Asaduddin Owaisi

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీయే ఇప్పుడు ముఖేష్ రాజకీయ భవిష్యత్ నిర్ణయించబోతున్నారా.?

Submitted by arun on Sat, 06/30/2018 - 18:00

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్‌‌ను వీడతారా.? పుట్టినరోజు వేడుకల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖేష్ పార్టీని వీడకుండా పీసీసీ చీఫ్ ఎలాంటి చర్యలు చేపట్టారు.? ఉత్తమ్ బుజ్జగింపుతో ముఖేష్ వెనక్కి తగ్గుతారా.? ఎంపీ అసదుద్దీన్ ఒవైసీయే ఇప్పుడు ముఖేష్ రాజకీయ భవిష్యత్ నిర్ణయించబోతున్నారా.?

మక్కా పేలుళ్లపై ఎన్ఐఏ తీర్పు...నిప్పులు చెరిగిన అసదుద్దీన్‌

Submitted by arun on Mon, 04/16/2018 - 13:46

2007 మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు ఇవాళ వెలువరించిన తీర్పుపై ఏఐఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం తీర్పు వెలువడిన తర్వాత వరుస ట్వీట్లు చేసిన ఆయన.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), మోదీ సర్కారులపై నిప్పులుచెరిగారు.

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చట్ట విరుద్ధం : అసదుద్దీన్ ఓవైసీ

Submitted by arun on Thu, 12/28/2017 - 16:25

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చట్ట విరుద్ధమన్నారు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఓవైసీ ముస్లింలను సంప్రదించకుండా బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందన్నారు. ఈ బిల్లుతో ముస్లిం మహిళలకు న్యాయం జరగదన్నారు అసదుద్దీన్‌ ఓవైసీ. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుతో ఆర్టికల్‌ 14, 15కి ఉల్లంఘన జరుగుతుందన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ద్వారా ఫిర్యాదు చేస్తే అరెస్ట్‌ చేసే పరిస్థితి ఏర్పడుతుందని, భర్త జైలుకెళ్తే ఆ మహిళ పోషణ బాధ్యత ఎవరు తీసుకుంటారన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో అరుదైన దృశ్యం

Submitted by arun on Sat, 12/16/2017 - 11:06

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలుగులో చేసిన ప్రసంగం ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో దాదాపు ఏనాడూ లేని విధంగా తెలుగులో మాట్లాడిన ఓవైసీ.. ఉర్దూ, తెలుగు భాషలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కుతుబ్‌షాహీల కాలం నుంచే తెలంగాణ.. హిందూ-ముస్లింల ఐక్యతకు ఉదాహరణగా నిలిచిందని గుర్తుచేశారు.