tdp

నీతికి ప్రతినిధి మోడీ ఐతే.. అవినీతికి ప్రతినిధి జగన్

Submitted by arun on Wed, 02/21/2018 - 17:29

నీతికి ప్రతినిధి మోడీ ఐతే.. అవినీతికి ప్రతినిధి జగన్ అన్నారు మంత్రి కామినేని. భవిష్యత్తులో.. బీజేపీ, వైసీపీ కలిసే చాన్సే లేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ విడిపోతే.. కొంతమంది లబ్ధి పొందేందుకు చూస్తున్నారని ఆయన చెప్పారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో.. బీజేపీ, టీడీపీ కలిసి పనిచేస్తాయన్నారు. నీతి, నిజాయితీకి మోదీ ప్రతిరూపమైతే...అవినీతి, అరాచకాలకు జగన్ అన్నారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన జగన్‌తో చేతులు కలిపే యోచన తమ పార్టీ జాతీయ నాయకత్వం చేయలేదన్నారు.

ఆ బీజేపీ మంత్రిపై చంద్ర‌బాబు చ‌ర్య‌లు..?

Submitted by lakshman on Wed, 02/21/2018 - 07:34

గతకొంత కాలంగా ఏపీ బిజెపి నేతలు టిడిపిపై విమర్శలు గుప్పిస్తున్నారు…అంతేకాదు మిత్ర పక్షం అయిన టిడిపి అధినేతపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తూనే ఉన్నారు..అయితే టిడిపి నేతలని మాత్రం చంద్రబాబు కామెంట్స్ చేయకండి అని అడ్డు చెప్పిన సందర్బాలు అనేకం ఉన్నాయి..అయితే టిడిపి తో పొత్తు కారణంగా అనుకోకుండా లక్కు కలిసొచ్చి దేవాదాయ శాఖామంత్రి గా ఎన్నికైనా మాణిక్యాలరావు..గత కొంతకాలంగా చంద్రబాబు పై విమర్శలు చేస్తూనే ఉన్నారు..ఎప్పుడు వారి వారి మాటలని సీరియస్ గా తీసుకొని చంద్రబాబు మాత్రం.తాజాగా జరిగిన పరిణామాల విషయంలో ఎంతో ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు.

టీడీపీ, వైసీపీలను ఇరుకున పెట్టిన పవన్

Submitted by arun on Tue, 02/20/2018 - 10:45

ఏపీ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మరింత వేడెక్కింది. జగన్ సవాల్ ను స్వీకరిస్తూ.. పవన్ కల్యాణ్ వెల్లడించిన తాజా వైఖరి.. టీడీపీతో పాటు వైసీపీని కూడా ఇరుకున పెట్టేలా ఉంది. ఆంధ్రా ప్రజల ప్రయోజనాల విషయంలో చిత్తశుద్ధి ఉన్నవారు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదన్న ప్రశ్న సర్వత్రా ఉదయిస్తున్న క్రమంలో.. టీడీపీ అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న దరిమిలా అవిశ్వాసం పెట్టే అవకాశాన్ని వైసీపీ ఉపయోగించుకుంటే ఎలాంటి మద్దతైనా ఇచ్చేందుకు రెడీ అంటూ పవన్ ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. 

పాపం మోత్కుపల్లి

Submitted by arun on Sat, 02/17/2018 - 11:41

ఒకప్పుడు టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత మోత్కుపల్లి. విభజన తర్వాత కూడా ఆయన తన సత్తా చాటుకున్నారు. సీఎం కేసీఆర్ మీద ఎవరూ చేయని స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలే ఆయన్ని ఇరకాటంలో పడేశాయా? అటు సొంత పార్టీ పట్టించుకోక.. అధికార పార్టీ నుంచి ఆహ్వానం అందక మోత్కుపల్లి అయోమయంలో పడిపోయారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

ఏపీలో టీడీపీ లీక్స్

Submitted by lakshman on Thu, 02/15/2018 - 23:34


   కేంద్రానికి ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ త‌న ఎంపీల‌ను ఏప్రిల్ 6న రాజీనామా చేయిస్తాన‌ని డెడ్ లైన్ పెట్టారు. కేంద్ర బ‌డ్జెట్ లో అన్యాయం జ‌రిగింద‌ని, ప్ర‌త్యేక ప్యాకేజీ కావాల‌ని డిమాండ్ చేస్తున్న జ‌గ‌న్ కేంద్ర ప్ర‌భుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఒక వేళ కేంద్రం కాదు -  కూడ‌దు అంటే త‌న పార్టీ కి చెందిన ఎంపీల‌తో రాజీనామా చేయించి పోరాటం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. 

లేటా.. రైటా..

Submitted by arun on Wed, 02/14/2018 - 17:52

హోదా కోసం ఎందాకైనా.. అంటూ నాలుగేళ్లుగా ధర్నాలు, దీక్షలు, ఆందోళనలతో అట్టుడికించిన వైసిపి.. క్లైమాక్స్ లో వ్యూహం రచించలేక బొక్క బోర్లా పడిందా? రాజీనామాల అస్త్రాన్ని లాస్ట్ మినిట్ లో తీసి.. టిడిపికి అడ్వాంటేజ్ అందించిందా? 

హోదా కోసం రాజీనామాలు చేయాలన్న అస్త్రాన్ని వైసిపి లేటుగా సంధించిందా? గతంలోనే రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన జగన్ ఇన్నాళ్లూ వారిచేత రాజీనామా చేయించకుండా ఇప్పుడు చివరి ఏడాదిలో చేయించడం వల్ల ఉపయోగమేంటనే సందేహాలు వైసిపి నేతలనుంచే ఎదురవుతున్నాయి. రాజీనామా అస్త్రాన్ని చాలా ఆలస్యంగా ప్రకటించారని ఇది జగన్ ఆడుతున్న రాజకీయ డ్రామా అంటూ టిడిపి మండిపడుతోంది.

ఎంపీల రాజీనామా పేరుతో జగన్ మరో నాటకానికి తెరలేపారు : అచ్చెన్నాయుడు

Submitted by arun on Wed, 02/14/2018 - 15:05

వైసీపీ అధినేత జగన్ ఎంపీల రాజీనామా పేరుతో మరో నాటకానికి తెరలేపారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. విశ్వసనీయత లేకపోతే ఏ నేతా మనుగడ సాగించలేరని చంద్రబాబుతో భేటీ తర్వాత అన్నారు. కొందరు విమర్శిస్తున్నట్లుగా టీడీపీ ప్రత్యేక హోదాను త్యాగం చెయ్యలేదన్న అచ్చెన్నాయుడు...ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నామని చెప్పారు. అయినా టీడీపీ నేతలకు పదవులు పెద్దవిషయం కాదని..తాము త్యాగాలకు వెనకాడేరకం కాదని చెప్పుకొచ్చారు. 
 

జగన్... దమ్ముంటే ఈరోజే చేయించు

Submitted by arun on Wed, 02/14/2018 - 14:18

ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ వ్యాఖ్యలపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌కు దమ్ముంటే ఇవాళే ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు. ఏప్రిల్‌లో రాజీనామాలు చేస్తే ఆ తర్వాత ఉప ఎన్నికలు రావనే అలా చేస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఏడాది క్రితం కూడా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామన్నారని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు.

ఇద్దరి మ‌ధ్య పొత్తు షురూ..?

Submitted by lakshman on Tue, 02/13/2018 - 08:10

ఏపీ లో ఎన్నికల సందడి అప్పుడే మొదలయ్యిపోయింది..ఏ పార్టీ ఎవరితో జట్టు కట్టాలి..ఎన్ని సీట్లు అడగాలి ఇలా ఎవరి అంచానాలు వారికి ఉన్నాయి అయితే టిడిపి –జనసేన పొత్తు ఉంటుంది ముందు నుంచీ భావిస్తున్న తరుణంలో..ఇద్దరి పొత్తు ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి..అయితే గతంలో పొత్తు పెట్టుకున్న బీజేపి ని ఈ సారి చంద్రబాబు దూరం పెట్టారనే చెప్పాలి…వచ్చే ఎన్నికల్లో ఈ సారి పవన్ తో పొత్తు ఉంటుంది అని చెప్తున్నారు..

ఒకరు అబద్ధం చెప్తున్నారు : పవన్ కల్యాణ్

Submitted by arun on Mon, 02/12/2018 - 09:32

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై.. జనసేనాని పవన్ కల్యాణ్ యాక్షన్ మొదలైంది. ఇక మిగిలింది వాళ్ల రియాక్షనే. విభజన హామీల అమలు కేంద్రం నిధులపై రెండు ప్రభుత్వాల్లో ఒకరు అబద్ధం చెప్తున్నారని పవన్ చెప్పారు. ఈ నెల 15 లోగా కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలను రాష్ట్రప్రభుత్వం తనకు ఇవ్వాలన్నారు. నిధుల లెక్కలు, ఖర్చుల వివరాలను కమిటీ పరిశీలించి వాస్తవాలు తేలుస్తుందన్నారు జనసేనాని.