Save Education Committee

సేవ్‌ ఎడ్యుకేషన్‌ కమిటీ ర్యాలీ పట్ల ఎసీపీ ఓవరాక్షన్‌

Submitted by arun on Fri, 09/14/2018 - 16:42

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందామంటూ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ చేపట్టిన విద్యా విజ్ఞానయాత్రలో సైఫాబాద్‌ ఏసీపీ ఓవరాక్షన్‌ చేశారు. ఆందోళనలో పాల్గొన్న వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఓ విద్యార్థినిపై ఏసీపీ వేణుగోపాల్‌ చేయి వేసి తోసేశాడు. హెచ్ఎంటీవీలో ప్రసారమైన దృశ్యాలను పరిశీలించిన డీజీపీ ఏసీపీ వేణుగోపాల్‌ ప్రవర్తన పట్ల సీరియస్‌ అయ్యారు. విద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏసీపీపై చర్యలకు సిద్ధమయ్యారు. సేవ్ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో గన్‌పార్క్‌ వద్ద నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు.