Amrutha

ప్రణయ్‌ ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు అరెస్ట్‌

Submitted by arun on Tue, 11/06/2018 - 15:39

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్‌ ఇంట్లోకి...నవంబర్ మూడు తెల్లవారుజామున 4గంటల సమయంలో చొరబడిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముసుగు ధరించి గోడ దూకిన యువకుడిని పోలీసులు... దొంగగా గుర్తించారు. చోరీ కోసమే ఇంట్లోకి ప్రవేశించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అనేక చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రణయ్ భార్య అమృత ప్రాణాలకు ముప్పు..?

Submitted by arun on Tue, 11/06/2018 - 08:39

మిర్యాలగూడలో కులగజ్జితో ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇప్పుడు అతడి భార్య అమృత ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందా ? ఆమెను కూడా అంతమొదించేందుకు పథకం పన్నుతున్నారా ? అమృత నివసించే ఇంటి వద్ద రెక్కీ జరిగిందా ? నిజమేనంటోంది అమృత.   

ప్రణయ్ ఆత్మ ఏడుస్తోందా..?

Submitted by arun on Mon, 10/15/2018 - 14:06

ప్రణయ్‌ ఆత్మ తమతో మాట్లాడుతుందంటూ హైదరాబాద్‌కు చెందిన దంపతుల వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి. పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్‌ మర్డర్‌ తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ప్రణయ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన భార్య అమృత గత కొంతకాలంగా పోరాడుతోంది. ఈ సమయంలో అనూహ్యంగా హైదరాబాద్‌ శివారు పటాన్‌ చెరుకు చెందిన సత్యప్రియ దంపతులు పరామర్శ పేరుతో మిర్యాలగూడలోని అమృత ఇంటికి చేరుకుంది. 

అమృతపై అసభ్య కామెంట్స్‌.. యువకుడు అరెస్ట్‌

Submitted by arun on Mon, 10/08/2018 - 11:46

పరువు హత్యకు గురైన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ భార్య అమృతను కించపరిచేలా అసభ్య కామెంట్లు చేసిన యువకున్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈశ్వర్‌(25) అనే యువకుడు ప్రణయ్‌ హత్య విషయంలో ఫేస్‌బుక్‌ వేదికగా అమృత వర్షినిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దీంతో ఈశ్వర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. 
 
 

అమృతకు వ్యవసాయభూమి, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు

Submitted by arun on Thu, 09/20/2018 - 15:48

మిర్యాలగూడలో కిరాయి హంతకుల చేతిలో హత్యకు గురైన ప్రణయ్ కుటుంబ సభ్యులను, ప్రణయ్ భార్య అమృత వర్షిణిని మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని చెప్పారు. మారుతీరావు లాంటి వ్యక్తులకు సంఘ బహిష్కణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను కుటుంబ సభ్యులకు అందజేస్తామని ప్రకటించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున 8 లక్షల 25వేల రూపాయలు, డబుల్ బెడ్‌రూం ఇల్లు, వ్యవసాయ భూమి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించడం జరిగిందన్నారు. గంటల వ్యవధిలోనే పోలీసు యంత్రాంగం వేగంగా స్పందించి హంతకులను పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు సహించదని తెలిపారు.

నా తండ్రైనా సరే ఉరి తీయాల్సిందే: ప్రణయ్ భార్య

Submitted by arun on Sat, 09/15/2018 - 14:04

ప్రణయ్‌ను చంపించింది మా నాన్నే అని అమృత తెలిపింది. మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రిలో అమృత చికిత్స పొందుతోంది. అయితే ప్రణయ్ హత్యకు గల కారణాలపై అమృతను మీడియా సంప్రదించగా కొన్ని విషయాలను వెల్లడిచింది. తన కళ్ల ఎదుటే ప్రణయ్‌‌ను నరికి చంపించిన తన తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. హంతకుడు తన తండ్రైనా సరే ఉరి తీయాల్సిందే అని అమృత పట్టుబడుతోంది. తండ్రే భర్తను హత్య చేయిస్తాడని ఊహించలేదని ఆమె వాపోయారు. ప్రేమించి పెళ్లాడిన తన భర్త ప్రణయ్ ఇక లేడనే విషయం తెలియగానే అతడి భార్య అమృత కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రణయ్‌ను చంపేందుకు చాలా రోజులుగా రెక్కీ నిర్వహించారని చెప్పింది.

దారుణం...పట్టపగలే యువకుడిని కత్తితో నరికేశాడు.. వీడియో

Submitted by arun on Fri, 09/14/2018 - 16:07

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తిని నరికేశారు. ఇద్దరు అమ్మాయిలతో కలిసి వెళ్తున్న పెరుమాళ్ల ప్రణయ్‌ అనే వ్యక్తిని కత్తి చేతపట్టుకుని వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి అటాక్‌ చేశాడు. తొలి వేటుకు ప్రణయ్‌ కిందపడిపోగా రెండో వేటుకు ప్రణయ్‌ తలపగిలిపోయింది. దీంతో ప్రణయ్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇటు ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ప్రణయ్‌తో వచ్చిన అమ్మాయిలు అరుపులు కేకలతో పరుగులు పెట్టారు.