prajasankalpayaatra

యాత్ర ఆలస్యం కావడంతో అనేక కొత్త సమస్యలు

Submitted by arun on Mon, 07/16/2018 - 11:13

వైసీపీ అధినేత జగన్ చేపడుతున్న ప్రజాసంకల్పయాత్ర ఎప్పుడు పూర్తవుతుందనే విషయం అంతుపట్టకుండా ఉంది. జగన్ యాత్ర షెడ్యూల్ ప్రకారం కొనసాగకపోవడంతో నెలల తరబడి ఆలస్యం అవుతోంది. కోర్టు కేసులు, పండుగ బ్రేక్‌లతో పాటు ప్రతికూల వాతావరణం కూడా జగన్ యాత్రకు ఆటంకాలుగా మారాయి. ప్రజా సంకల్ప యాత్ర ఆలస్యం కావడం ఆ పార్టీకి మేలు చేస్తుందా ? కీడు చేస్తుందా అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 

పవన్ యాత్రను డిసైడ్ చేసిన జగన్.!

Submitted by arun on Thu, 07/12/2018 - 12:03

ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సాగుతుండగా, అదే జిల్లాలో తన యాత్రను తలపెట్టిన పవన్ ను పోలీసులు వారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో యాత్రను ముగించుకున్న పవన్ కల్యాణ్, తూర్పు గోదావరి జిల్లాలో యాత్రను ప్రారంభించాలని భావించి పోలీసులకు సమాచారం అందించాడు. జగన్ యాత్ర సాగుతున్నందున పూర్తి భద్రతను అందిచలేమని పోలీసులు స్పష్టం చేయడంతో, తన నిర్ణయాన్ని మార్చుకున్న పవన్, తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్రను తలపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుందని సమాచారం.

జగన్‌తో టీడీపీ నేత కుమారుడి భేటీ...

Submitted by arun on Wed, 01/24/2018 - 13:25

జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ వేనాటి రామచంద్రారెడ్డి కుమారుడు సూళ్లూరుపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ వేనాటి సుమంత్‌రెడ్డి మంగళవారం వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని కలవడం స్థానికంగా చర్చనీయంశమైంది.
సూళ్లూరుపేటలో వేనాటి కుటుంబ రాజకీయం హాట్‌టాఫిక్‌గా మారిపోయింది. చలికాలంలోనే ఈ ప్రాంతంలో రాజకీయం వేడెక్కింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గానికి విచ్చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని విశ్రాంత సమయంలో జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి తనయుడు వేనాటి సుమంత్‌రెడ్డి కలవడంతో తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. 

నేటినుంచి ధర్మవరంలో జగన్ పాదయాత్ర.!

Submitted by nanireddy on Sat, 12/16/2017 - 10:58

ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో  రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.. ఇవాళ ఉదయం అయన పాదయాత్ర  ధర్మవరం నియోజకవర్గం చిగిచెర్ల నుంచి ప్రారంభించారు.. అక్కడినుంచి వసంతపురం, గరుడంపల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. బాదన్నపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు మల్కాపురం క్రాస్‌ చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండా ఎగురవేస్తారు.