leaders arrest in telangana

కక్ష సాధింపా? వ్యూహంలో భాగమా? అరెస్టుల వెనుక అసలు కథ!!

Submitted by santosh on Fri, 09/14/2018 - 13:09

ఎన్నికల వేళ, కేసులు-అరెస్టులతో అలజడి రేగుతోంది. నకిలీ పాస్‌ పోర్ట్ కేసుల్లో, జగ్గారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు,  హౌసింగ్‌ సొసైటీ కేసులో రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌ పోలీసుల నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. కేవలం రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే, పాత కేసులు తిరగతోడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తుంటే, చట్టం తన పని తాను చేసుకుపోతోందని టీఆర్ఎస్‌ నేతలంటున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో పాస్ పోర్టు తీసుకుని.. అమెరికాకు మనుషులను అక్రమంగా తరలించారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం, తెలంగాణలో కలకలం రేపింది.