Adilabad

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కష్టాలు...గ్రామాల్లోకి రావొద్దంటూ...

Submitted by arun on Sun, 10/07/2018 - 13:36

తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అడుగడుగునా నిరాశే ఎదురవుతోంది. నియోజకవర్గాల్లో వారికి స్వాగతం పలకాల్సిన జనం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. తమ గ్రామాల అభివృద్ధికి నిధులివ్వని ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి రావొద్దంటూ తీర్మానాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రజల్లో తిరుగుబాటు రావడంతో తాజా మాజీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. పార్టీ బలంగా ఉందనుకున్న నియోజకవర్గాల్లో కూడా టీఆర్‌ఎస్ పార్టీకి  కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, బోధ్ నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేల పరిస్థితిపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ. 

ఉమ్మడి ఆదిలాబాద్ టీఆర్ఎస్ లో చిచ్చు...ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఎడ తెగని వార్

Submitted by arun on Fri, 08/03/2018 - 10:54

ఆదిలాబాద్ జిల్లా టిఆరెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పార్టీ పరువు తీసేస్తున్నాయి ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీల మధ్య అంతర్గత గొడవలు ముదిరి కార్యకర్తలకు తలనొప్పులు తెస్తున్నాయి. నియోజక వర్గంలో ఎమ్మెల్యే, ఎంపీల తీరు ఎడమొఖం, పెడమొఖంగా ఉండటంతో మధ్యలో కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఈ సమస్యను పార్టీ అధిష్టానం పట్టించుకోకపోతే పార్టీకే నష్టమని ఆందోళన పడుతున్నారు.

రియల్‌ బాహుబలి...ప్రాణాలకు తెగించి అడవి పందితో పోరాడిన రైతు

Submitted by arun on Mon, 07/23/2018 - 13:07

ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ గిరిజనుడు బాహుబలిలా విరుచుకుపడి అడవి పందిని మట్టికరిపించాడు. బోథ్‌ మండలం సంపత్‌నాయక్‌ తండాలో తన పత్తి పంటను పరిశీలించేందుకు వెళ్లిన రైతు కటక్వార్‌ జైసింగ్‌‌పై సడన్‌గా అడవి పంది దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన జైసింగ్‌ అడవి పంది నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అడవి పంది పదేపదే రైతుపై విరుచుకుపడటంతో మరో దారిలేక తిరగబడ్డాడు.

కలెక్టర్ దివ్య దేవరాజన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం

Submitted by arun on Thu, 03/22/2018 - 11:52

ఆదీవాసీల కష్టనష్టాలు తెలుసుకునేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. వాళ్లకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ మాత్రం వాళ్ల సమస్యల పరిష్కారం కోసం వాళ్లలో ఒకరిగా మారిపోయారు. ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య దేవరాజన్ చేస్తున్న కృషిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఏం చేస్తున్నారు. 

ఏజెన్సీలో అమ్మాయిల మిస్సింగ్‌ కలకలం

Submitted by arun on Sun, 01/07/2018 - 17:02

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో...అమ్మాయిల మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. ఎక్కడికి వెళుతున్నారో తెలీదు. ఎవరు అమ్మాయిలను తీసుకెళ్తున్నారో అంతుచిక్కడం లేదు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని అమ్మాయిలు...బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. గ్రామాల్లో వరుసగా అదృశ్యమవుతుండటంతో...గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నివురుగప్పిన నిప్పులా ఉట్నూరు ఏజెన్సీ

Submitted by arun on Sat, 12/16/2017 - 10:51

ఆదివాసీలు, లంబాడీల ఘర్షణతో ఆదిలాబాద్‌ ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది. నిన్న ఇరు వర్గాలు పరస్పర దాడులకు దిగడంతో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ఏజెన్సీ మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్‌ ఏజెన్సీలో ఎనిమిది జిల్లాల నుంచి వచ్చిన వెయ్యి  మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా డిచ్‌పల్లిలో 13 బెటాలియన్‌లు, గుడిపేటలో 7 బెటాలియన్‌ల పోలీసులను మోహరించారు. ఉట్నూరు‌, నార్నూర్‌, జైనూర్‌ మండలాల్లో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. ఒక డీఐజీ, ముగ్గురు ఐజీలు , ఇద్దరు పోలీస్ కమిషనర్లు, 9 మంది ఎస్పీలు ఉట్నూర్‌ ఏజెన్సీలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.