Telangana Elections 2018

కేసీఆర్‌పై గద్దర్‌ పోటీ..!

Submitted by arun on Sat, 10/13/2018 - 10:32

రాహుల్ గాంధీతో భేటీ తర్వాత ప్రజా గాయకుడు గద్దర్....కాంగ్రెస్‌లో చేరే అంశంపై వివరణ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.. ఢిల్లీలో బుర్జువా పాలన కొనసాగుతోందనీ.. దాని అంతానికే రాహుల్ ‌ను కలిశానని చెప్పారు. సెక్యులర్ పార్టీలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటానన్న గద్దర్..మిగిలిన లౌకిక పార్టీల నేతలను కూడా కలుస్తానని తెలిపారు. ఒకవేళ అన్ని పార్టీలు కోరితే గజ్వేల్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు గద్దర్‌. గద్దర్ ఢిల్లీ బాట పట్టిన వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే రాహుల్‌తో భేటీ తర్వాత గద్దర్ తన రాజకీయ ప్రవేశం గురించి స్పష్టత ఇచ్చారు.

తెలంగాణ ఆపధ్ధర్మ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

Submitted by arun on Fri, 10/12/2018 - 16:04

తెలంగాణ ఆపధ్ధర్మ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్లు ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. అసెంబ్లీ రద్దుపై కాంగ్రెస్ నేత డీకె. అరుణతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగ బద్ధంగా అసెంబ్లీ రద్దు జరగలేదంటూ పిటిషనర్లు చేసిన వాదనలను తోసిపుచ్చింది. అసెంబ్లీ రద్దుకు సంబంధించి ప్రభుత్వ న్యాయవాదులు చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. 

మోడీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం

Submitted by arun on Tue, 10/09/2018 - 14:37

తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీకి వెళ్తుంటే కేసీఆర్ నోరు మూసుకున్నారని టి.కాంగ్రెస్‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు కాకున్నా బీజేపీకి టీఆర్‌ఎస్‌ సహకరించిందని ఆరోపించారు. మోడీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ కూడా కేసీఆర్ రెడీ చేసి అమిత్‌షాకు ఇచ్చారని విమర్శించారు. 119 స్థానాలలో బీజేపీకి అభ్యర్థులు ఉన్నారా? అని ప్రశ్నించిన పొన్నం వేరే పార్టీలలో టికెట్లు రాని నేతలను చేర్చుకొని టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి 100 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు.

అమావాస్య రోజు పోలింగ్...కేసీఆర్‌కు కలిసొచ్చేనా..?

Submitted by arun on Sun, 10/07/2018 - 15:18

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలు టీఆర్ఎస్ అధినేత  కేసీఆర్‌కు కలిసొస్తుందా? జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రగాఢంగా విశ్వసించే కేసీఆర్‌కు కమిషన్ ప్రకటించిన పోలింగ్‌ తేదీ ఆయనకు అనుకూలమా? ప్రతికూలమా? ఈ ఎన్నికల్లో అమావాస్య చంద్రుడిలా వెలుగుతాడా..? 

ఈసీ ఆంక్షలతో రంగంలోకి నిఘా బృందాలు..

Submitted by arun on Sun, 10/07/2018 - 09:59

తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల కోడ్‌ అమలుపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, ప్రభుత్వ ప్రాంగణాలను పార్టీలు దుర్వినియోగం చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, పోస్టర్లను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ సిబ్బంది రంగంలోకి దిగారు. వివిద ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులను హుటా హుటిన తొలగిస్తున్నారు.

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా రేవంత్, పొన్నం

Submitted by arun on Thu, 09/20/2018 - 10:12

ముందస్తు సమరానికి కాంగ్రెస్‌ సరికొత్త దళం సిద్దమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను నియమించగా, మరికొందరికి కీలక బాధ్యతలు అప్పగించింది. అలకమీదున్న విజయశాంతికి, స్టార్‌ క్యాంపెనర్‌గా చెలరేగిపోవాలని కర్తవ్య బోధ చేసింది కాంగ్రెస్. పొత్తులు, ఎత్తులు, రాహుల్‌తో వరుస సమావేశాలతో ముందస్తు దూకుడు పెంచిన టీ. కాంగ్రెస్ ‌నేతలు, యుద్ధానికి సైన్యంగా ఏర్పడ్డారు. పార్టీ వర్గాలు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న  ఎన్నికల కమిటీలను ప్రకటించి, సమరంలో దూసుకెళ్లాలని దిశానిర్దేశం చేసింది ఏఐసీసీ.

కేటీఆర్‌పై పోటీ చేసేదెవరో తెలుసా?

Submitted by arun on Thu, 09/13/2018 - 15:17

రాబోయే ఎన్నికల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీచేసే స్థానం నుంచి ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను, మంత్రి కేటీఆర్‌ పోటీచేసే స్థానం నుంచి ప్రజా గాయని విమలక్కను బరిలోకి దింపుతామని టీ మాస్‌ ఫోరం చైర్మన్‌ కంచ ఐలయ్య వెల్లడించారు. గద్దర్, విమలక్కలు తెలంగాణకు అసలైన వారసులని చెప్పారు. రాష్ట్రం కోసం వీరిద్దరూ ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. రాష్ట్రం కోసం పోరాడుతున్న గద్దర్ పై అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిపిందని... ఆయనకు 6 బుల్లెట్ గాయాలు తగిలాయని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం విమలక్క కాలుకు గజ్జె కట్టి ఆడిపాడారని అన్నారు.

టిక్కెట్ల కేటాయింపుపై తీవ్ర ఆందోళన...శ్రీకాంతాచారి తల్లికి టికెట్‌ ఇవ్వాలని..

Submitted by arun on Sat, 09/08/2018 - 09:48

టీఆర్‌ఎస్‌లో టిక్కెట్లపై  అసమ్మతి కుంపటి మొదలైంది. ఏకంగా కొందరు తిరుగుబాటు అభ్యర్థులు సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారాన్ని  మొదలుపెడుతున్నారు. మరికొంరు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. అసమ్మతి సెగలు కారు పార్టీకి ఎందుకు కమ్ముకుంటున్నాయి? 

టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన కేసీఆర్

Submitted by arun on Fri, 09/07/2018 - 08:59

అసెంబ్లీ రద్దయ్యిందో లేదో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్...ఎన్నికల వ్యూహాలు రచించడంలో మునిగిపోయారు. 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.