Rahul Gandhi

కాంగ్రెస్‌లోకి ప్రజా యుద్ధనౌక ..?

Submitted by arun on Fri, 10/12/2018 - 10:40

ప్రజాగాయకుడు గద్దర్ నేడు ఢిల్లీలో రాహుల్ తో భేటీకానున్నారు. గద్దర్ కుటుంబాన్ని మధుయాష్కీ ఢిల్లీకి తీసుకెళ్లారు. గద్దర్ కుమారుడు ఇటీవలే కాంగ్రెస్ లో చేరడంతో ఇప్పుడు గద్దర్ కూడా హస్తం గూటికి చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, గద్దర్ మాత్రం మద్దతు తెలిపేందుకే రాహుల్ ను కలుస్తున్నానని తెలిపారు. రాహుల్ సమక్షంలో గద్దర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డ గద్దర్ రానున్న ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నానని చెప్పారు. మహాకూటమి తరుపున తనకు సీటు ఇస్తే గజ్వేల్ నుంచి కేసీఆర్ పై పోటీకి సిద్ధమని చెప్పారు.

రాహుల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Submitted by arun on Mon, 10/08/2018 - 09:58

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని  జబల్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ కు కొందరు కార్యకర్తలు హారతులు ఇస్తుండగా... పక్కనే  కార్యకర్తలు చేతుల్లోనున్న బెలూన్లకు హారతులు తగలడంతో పెద్ద మంట చెలరేగింది. భయంతో జనం పరుగులు తీశారు. వెంటనే మంటలను కార్యకర్తలు ఆర్పివేశారు.  

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై వేటు తప్పదా..?

Submitted by arun on Wed, 09/26/2018 - 10:02

పార్టీ పెద్దలపై నోరు పారేసుకుని షోకాజ్‌ నోటీసులతో చేతులు కాల్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. రెండు నోటీసులు అందుకొని మరీ వివరణ ఇవ్వకుండా ఉన్న రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటారా..? పార్టీ పెద్దలపై కనీస గౌవరం లేకుండా మాట్లాడటం ఏ మాత్రం క్షమార్హం కాదని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కోమటిరెడ్డిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి హద్దు దాటారని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

రాఫెల్ డీల్‌పై రాజుకుంటున్న వివాదం...మోడీపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

Submitted by arun on Sat, 09/22/2018 - 16:54

రాఫెల్‌ ఒప్పందం విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై తన విమర్శనాస్త్రాలు సంధించారు. రాఫెల్‌ పేరుతో మోదీ, అనిల్‌ అంబానీలు రక్షణశాఖపై సర్జికల్‌ దాడులు చేశారని దుయ్యబట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే చేసిన వ్యాఖ్యలపై మోడీ ఇప్పటికైనా స్పందించాలని రాహుల్ డిమాండ్ చేశారు. యుద్ధ విమానాల ధరల విషయంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెబుతున్నారని రాహుల్ మండిపడ్డారు. ఈ స్కాంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు.   

అధికారంలోకి రాగానే ఏపీకి హోదా ఇస్తాం: రాహుల్

Submitted by arun on Tue, 09/18/2018 - 15:59

కర్నూల్ బై రెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న రాహుల్ అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు. విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పారు. మోడీ ప్రభుత్వం కొంత మంది కార్పోరేట్ల కోసమే పని చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రాహుల్ గాంధీ అన్నారు. ఏపీకి కేంద్రం నుంచి ప్రత్యేక సాయం అందాలని అభిప్రాయపడ్డారు. చైనాలో రోజుకు 50 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుంటే భారత్‌లో కేవలం 450 ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నాయని రాహుల్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి

Submitted by arun on Fri, 09/14/2018 - 11:32

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలో వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. పలువురు తెలంగాణ ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ లో చేరారు. అలాగే నిజామాబాద్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి తెలిపారు. ఉద్యోగాలు లేవని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేశ్‌...పవన్‌ కల్యాణ్‌ తనకు దేవుడితో సమానమనీ

Submitted by arun on Fri, 09/14/2018 - 11:23

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలో వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. పలువురు తెలంగాణ ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ లో చేరారు. రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. త్యాగాలకు ప్రతిరూపం కాంగ్రెస్‌ పార్టీ అని సినీ నిర్మాత బండ్ల గణేష్‌ అన్నారు. కాంగ్రెస్‌ అంటే ఇష్టం కావడంవల్లే ఆ పార్టీలో చేరానని చెప్పారు. పార్టీ ఏదీ చెబితే అది చేస్తానన్న బండ్ల గణేష‌..ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తానని అన్నారు.

కేవలం 20 సెకన్లు ఆలస్యమైతే...రాహుల్‌ విమానం గాల్లోనే పేలిపోయి ఉండేది

Submitted by arun on Sat, 09/01/2018 - 13:45

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పెద్ద గండం నుంచి తప్పించుకున్నారు. కేవలం ఇరవై అంటే 20 సెకన్ల తేడాతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్‌ 26న రాహుల్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌‌పై డీజీసీఏ షాకింగ్‌ నిజాలు బయటపెట్టింది. మరో 20 సెకన్లు ఫ్లైట్‌ గాల్లో ఉంటే జరగరానిది జరిగేదంటూ సంచలన విషయాలు పెద్ద బాంబు పేల్చింది.

నోట్ల రద్దు పెద్ద కుంభకోణం

Submitted by arun on Thu, 08/30/2018 - 18:05

నోట్ల రద్దు అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని మరో సారి టార్గెట్ చేశారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావించన రాహుల్ గాంధీ ప్రధాని మోడీని నిలదీశారు. దేశ ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దును ఓ పెద్ద కుంభకోణంగా అభివర్ణించిన రాహుల్ దేశంలో చిన్న, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.