uttar pradesh

ఉపఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన బీజేపీ

Submitted by lakshman on Wed, 03/14/2018 - 20:25

ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లోని మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పుర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌ నిషాద్‌ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య ప్రాతినిధ్యం వహించిన ఫుల్పూర్‌లో సమాజ్‌వాదీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్‌ సింగ్‌ పటేల్‌ తన సమీప బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్‌ పటేల్‌పై 59,460 ఓట్ల భారీ తేడాతో విజయభేరి మోగించారు. బీజేపీ  ఘోర పరాభవాన్ని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అంగీకరించారు.

తెగిన కాలునే దిండుగా పెట్టారు…

Submitted by arun on Mon, 03/12/2018 - 11:33

ఆయనో డాక్టర్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సంయమనం కోల్పోకుండా వైద్యం అందించాలి. తన పరిమితుల్లో రోగికి ఉన్నతమైన సేవలు అందించాలి. బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడాలి. కానీ.. వైద్య వృత్తికే అవమానం కలిగేలా ఉత్తరప్రదేశ్ లోని ఓ డాక్టర్ ప్రవర్తించాడు. చివరికి.. విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు.

నిద్రలోనే మహిళకు నిప్పటించారు

Submitted by arun on Fri, 03/09/2018 - 16:53

తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేదని ఓ దళిత మహిళపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన కిరాతక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన దళిత మహిళ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బల్లియా జిల్లా జజౌలి గ్రామంలో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 

శ్రీదేవి వల్లే నా సోదరుడు బతికున్నాడు!

Submitted by arun on Wed, 02/28/2018 - 11:02

శ్రీదేవి మరణవార్త వినగానే ఆ అభిమాని గుండె పగిలిపోయింది. వెంటనే ఉత్తర ప్రదేశ్ నుంచి ముంబై బయల్దేరి వచ్చేశాడు అతను. అతని పేరు జతిన్ వాల్మీకి. కళ్లు కనిపించవు. అంధుడు. గత మూడు రోజులుగా శ్రీదేవి నివాసం వద్దే వేచి చూస్తున్నాడు. 

భర్తపై దాడి.. తుపాకీతో వచ్చి కాపాడిన భార్య

Submitted by arun on Mon, 02/05/2018 - 18:17

ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నోలో ఓ వ్య‌క్తి త‌న ఇంటి ముందు నిల‌బ‌డి ఉండ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఒక్క‌సారిగా దూసుకొచ్చి ఆయ‌న‌పై పిడిగుద్దులు కురిపిస్తూ, రాడ్‌తో కొడుతూ దాడి చేశారు. తన భర్తపై కర్రలతో దాడికి చేస్తున్నార‌ని తెలుసుకున్న మ‌హిళ‌ తుపాకీతో బయటకు వచ్చి స‌ద‌రు దుండ‌గుల‌ను బెంబేలెత్తించింది. వివరాల్లోకి వెళితే..లఖ్‌నవూలోని కాకోరీ ప్రాంతానికి చెందిన అబిద్ అలీ వృత్తిపరంగా జర్నలిస్టు. సోమవారం ఉదయం అలీ తన ఇంటి ముందు నిల్చుని మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు అలీపై దాడి చేయడం ప్రారంభించారు.

పట్టపగలే దారుణం...తల్లీకొడుకులపై కాల్పులు

Submitted by arun on Thu, 01/25/2018 - 12:32

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ముగ్గురు దుండగులు ఓ 60 ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా కాల్చిచంపారు. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన మీరట్‌లో జరిగింది. 60ఏళ్ల వృద్ధురాలు నిచేత్తర్‌ కౌర్‌ మరో మహిళతో కలిసి మంచంపై కూర్చుని కబుర్లు చెప్తోంది. ఇంతలో ఉన్నట్టుండి ముగ్గురు యువకులు తుపాకులతో వచ్చి నిచేత్తర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆమె శరీరంలోకి ఏకంగా పది బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి పక్కనే ఉన్న మహిళను మాత్రం పారిపోమన్నారు. ఈ దారుణమంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఒకటో తరగతి విద్యార్ధిపై ఆరో తరగతి విద్యార్ధి దాడి

Submitted by arun on Fri, 01/19/2018 - 12:56

చిన్న పిల్లల్లో నేర ప్రవృత్తి రాను రాను పెరిగిపోతోంది.. స్కూలు శెలవు కోసం.. తోటి విద్యార్ధులను హత్య చేసేందుకు కూడా వెనకాడటం లేదు. గతంలో ఢిల్లీలో జరిగిన హత్య తరహాలోనే యూపీలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పిల్లలపై చదువుల ఒత్తిడి ఏ మేరకు ఉందనడానికి ఈ సంఘటనలే ఒక ఉదాహరణ. చిన్న పిల్లల్లో నేర ప్రవృత్తి వెర్రి తలలు వేస్తోంది. యూపీలో ఓ ఎల్ కేజీ స్టూడెంట్ ను సీనియర్ కత్తితో పొడిచి హత్యా యత్నం చేయడం కలకలం రేపింది. గురుగావ్ లో ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఘటన దర్యాప్తు ముగియకుండానే తాజాగా మరో సంఘటన తల్లి దండ్రుల్లో భయాన్ని పెంచుతోంది.

ఫొటో పిచ్చి.. పరువు తీసుకున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే

Submitted by arun on Sun, 01/14/2018 - 11:01

ఓ బీజేపీ ఎంపీ, మరో బీజేపీ ఎమ్మెల్యే... పత్రికల్లో తమ ఫోటోలు కనిపించాలన్న 'ప్రచార పిచ్చి' వారి పరువు తీసింది. ప్రజా ప్రతినిధులై ఉండి వారు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ రేఖావర్మ, మరో మహిళా ఎమ్మెల్యే తమ మద్దతుదారులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేసేందుకు సీతాపూర్‌ జిల్లాకు వెళ్లారు. పెద్దపెద్ద అధికార ప్రతినిధులు హాజరవడంతోపాటు వారి మద్దతుదారులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. గత కొద్ది రోజులుగా విపరీతమైన చలికారణంగా పలువురు రోడ్డుపక్కన ఉండేవారు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వారికి దుప్పట్ల సాయం చేసేందుకు వెళ్లారు.

కొడుకు ప్రేమించాడని..తల్లిపై అత్యాచారం

Submitted by arun on Sat, 12/30/2017 - 18:15

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయాడనే కోపంతో యువకుడి కుటుంబం పట్ల అమానుషంగా ప్రవర్తించారు ఆమె కుటుంబసభ్యులు. యువకుడి కుటుంబాన్ని కిడ్నాప్‌ చేయడమేగాక.. అతడి తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోపురా గ్రామానికి చెందిన ఓ యువకుడు(26), ముజఫర్‌నగర్‌కు చెందిన మరో యువతి(24)ని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ ఘజియాబాద్‌లో చదువుకుంటున్నారు. ఈ ప్రేమికులిద్దరూ నవంబర్ 20న ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. మొత్తానికి తమ కూతురు ఆచూకీ వారి తల్లిదండ్రులకు లభించలేదు.

మత గురువుకు శిష్యురాళ్ల దేహశుద్ధి

Submitted by arun on Wed, 12/27/2017 - 17:47

ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో మత గురువుకు శిష్యురాళ్లు దేహశుద్ధి చేశారు. ఆశ్రమం నుంచి గురువును బంధువుల సాయంతో జట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చారు. అర్ధనగ్నం చేసి లాఠీలతో చితకబాదారు. భగవద్గీత నేర్పిస్తానని శిష్యురాళ్లను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు  కామాంధ గురువు.