pawankalyan

స్టార్ ఆఫ్ ది డే.. మార్క్‌ ‘శంకర్‌’ పవనోవిచ్‌!

Submitted by arun on Thu, 08/23/2018 - 09:18

చిరంజీవి 63వ జన్మదిన వేడుకలను మెగా అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో చిరంజీవి ఇంటి వద్ద అభిమానుల సందోహం కనిపించింది. తనను కలవడానికి ఇంటి ముందుకు వచ్చిన అభిమానులను ఆప్యాయంగా చిరంజీవి పలకరించారు. పవన్‌కల్యాణ్‌ కుటుంబ సమేతంగా చిరంజీవి ఇంటికెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తోపాటు ఆయన సతీమణి అన్నా లెజినోవా, పిల్లలు ఉన్నారు. పవన్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ ఈ ఫొటోల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గత ఏడాది అక్టోబర్ 10న పుట్టిన ఈ బుడతడు.. అప్పట్లో నాన్న చేతుల్లో పొదివిపట్టుకున్నప్పటి ఫొటోలో మెరిశాడు.

చిరంజీవిని కలిసిన పవన్‌కల్యాణ్ దంపతులు

Submitted by arun on Wed, 08/22/2018 - 15:46

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 63వ పుట్టిన రోజు వేడుకలను నేడు జరుపుకుంటున్నారు, తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ వేడుకలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవికి టాలీవుడ్ సినీ రంగస్థలానికి సంబంధించిన ప్రముఖులు, యంగ్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి చిరంజీవిని కలిశారు. చిరంజీవికి పవన్‌కల్యాణ్, అన్నాలెజినోవా దంపతులు పుష్పగుచ్ఛం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాన్ని చిరంజీవి కోడలు ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

జనసేన మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల

Submitted by arun on Tue, 08/14/2018 - 13:46

జనసేన ప్రీ మ్యానిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విడుదల అయ్యింది. భీమవరంలోని మావూళ్ళమ్మ దేవాలయంలో పూజలు చేసిన తర్వాత పవన్ ప్రీ మ్యానిఫెస్టోను విడుల చేశారు. జనసేన ప్రీ మ్యానిఫెస్టోలో 12 హామీలను పొందు పరిచారు. కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. అలాగే బీసీలకు అవకాశాన్నిబట్టి 5శాతం రిజర్వేషన్లు పెంపుదల చేస్తామనీ చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు.  మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

పవన్ సార్ సారీ.. గుర్తు చేస్తున్నానంతే…:శ్రీరెడ్డి

Submitted by arun on Fri, 07/13/2018 - 12:19

శ్రీరెడ్డి పరిచయం అక్కరలేని పేరు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేసేందుకు శ్రీశక్తిగా మారుతున్నానంటూ ఆ మధ్య హడావుడి చేసిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో కామ్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గానే ఉంటోంది.  ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో ఆమె పోస్టులు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్యే హీరో నానీని టార్గెట్ చేసింది. ఇప్పుడు కోలీవుడ్‌పై వరుస పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమె మళ్లీ జనసేన అధినేత,నటుడు పవన్ కళ్యాణ్‌పై మరో పోస్టు పెట్టింది. ‘వీరనారి విభాగం గురించి మాట్లాడుతూ.. మీరు ఒక మాట అన్నారు సార్. నేను నా సినిమాల్లో అర్ధనగ్న(ఎక్స్‌పోజింగ్) సీన్స్‌కి అనుమతి ఇవ్వను.

జనసేనకు మెగా ఫ్యామిలీ మద్దత్తు... త్వరలోనే....

Submitted by arun on Sat, 07/07/2018 - 10:49

జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు క్రమంగా శక్తి పుంజుకుంటోందా ? పవన్‌కు మెగాబ్రదర్స్‌కు తోడవుతున్నారా ? చిరంజీవి ఫ్యాన్స్‌ను లీడ్ చేసే స్వామి నాయుడుతోపాటు మెగా అభిమానులు జనసేన కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. 

పెళ్లి త‌ర్వాత కూడా ఆయనతో ట‌చ్‌లోనే ఉంటాను: రేణూ దేశాయ్‌

Submitted by arun on Thu, 06/28/2018 - 16:56

త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తితో త్వ‌ర‌లోనే ఏడ‌డుగులు వేయ‌బోతున్న న‌టి రేణూదేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించారు. అభిమానుల బెదిరింపులు, విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉండాల‌నే ఉద్దేశంతో ఇటీవ‌లె రేణు ట్విటర్ నుంచి నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాత్రం అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. తాజాగా లైవ్‌లోకి వ‌చ్చిన రేణు ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల గురించి మాట్లాడారు. అయితే ఓ అభిమాని పెళ్లి తర్వాత కూడా మీరు పవన్ తో టచ్ లో ఉంటారా అని ప్రశ్నించాడు. దీనికి మరో మాట ఆలోచించకూడా తప్పక ఉంటానని చెప్పింది. ఆయన అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకి తండ్రి.

మేం గెలుపొందే మొట్టమొదటి సీటు అదే....

Submitted by arun on Sat, 06/09/2018 - 11:57

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుపొందే మొట్టమొదటి సీటు పాయకరావుపేటేనని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2014 ఎన్నికల్లోనే పాయకరావుపేట నుంచి పోటీ చేయాలనుకున్నా టీడీపీకి మద్దతు ఇవ్వడంతో మిన్నకుండిపోయామన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని పవన్‌ జోస్యం చెప్పారు. శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించిన పవన్, ఫ్లెక్సీలు కడుతూ ఇటీవల చనిపోయిన శివ-నాగరాజు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ర్యాలీలో ఆవేశంగా ప్రసంగించాడు. ఇంతకీ.. పాయకరావుపేట జనసేన అభ్యర్థి ఎవరు? అన్న క్లారిటీ అయితే లేదు. ఫలానా వ్యక్తికి టిక్కెట్ ఇస్తున్నానన్న స్పష్టత ఇవ్వకుండానే ప్రసంగాన్ని ముగించారు పవన్.

పవన్ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే భార్య !

Submitted by arun on Mon, 05/28/2018 - 11:31

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని నిరసిస్తూ పవన్ తన బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి మరీ  ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న దీక్షకు సంఘీభావంగా జనసేన కార్యకర్తలు సైతం ఆయా ప్రాంతాల్లో ఒక్క రోజు దీక్ష చేపట్టారు. అయితే రాజమండ్రిలో జనసేన ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య ఆకుల లక్ష్మీ పద్మావతి పాల్గొనడం ఆసక్తిని రేపుతుంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య ఆకుల లక్ష్మీపద్మావతి.. పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ మద్దతు పలికారు. ఉద్దానం బాధితుల కోసం పవన్ చేసిన దీక్షకు సంఘీభావంగా ఆమె కూడా ఒకరోజు దీక్ష చేశారు.

‘బట్టలు విప్పి మాట్లాడుకుందాం’..సంచలన ట్వీట్స్‌తో బెంబేలెత్తిస్తున్న పవన్

Submitted by arun on Sat, 04/21/2018 - 11:35

టాలీవుడ్‌లో ట్వీట్‌ల సెగను మరోసారి రాజేశారు జనసేనాని. శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ వివాదంలో తనను లాగడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించిన పవన్ .. దీనికి సంబంధించి పలు ట్వీట్‌లు చేశారు.  ఇది అనుకోకుండా జరిగిన వ్యవహారం కాదని  పక్కా ప్లాన్ ద్వారా ముందే రచించిన స్క్రిప్ట్  ప్రకారం జరిగిన వ్యవహారమంటూ ట్వీట్ చేశారు. మొత్తం ఎపిసోడ్‌లో కనబడుతున్న పాత్రధారుల కంటే వెనకున్న బడాబాబులే కీలకపాత్ర పోషించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో  పవన్ కల్యాణ్ బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటి వరకూ పవన్ ఏ విషయంపైనా స్పందించడం లేదని బాధ పడుతున్న ఫ్యాన్స్‌కు తన ట్వీట్స్‌తో ఉత్సాహం నింపుతున్నారు.

పవన్ మ్యాటర్ డిఫరెంట్.. నా గురించి మాట్లాడితే తాట తీస్తా: శ్రీరెడ్డి

Submitted by arun on Sat, 04/21/2018 - 11:09

పవన్ పై శ్రీరెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. పవన్ ను తిట్టమని శ్రీరెడ్డికి తానే సలహా ఇచ్చానని వర్మ స్వయంగా స్టేట్ మెంట్ ఇవ్వడం....దానిపై పవన్ ఈ రోజు తీవ్రస్థాయిలో రియాక్ట్ కావడం వంటి పరిణామాల గురించి విదితమే. అయితే తనకు సంబంధించిన అంశంపై ఇంత జరుగుతోన్నప్పటికీ...శ్రీరెడ్డి పెదవి విప్పలదు. దాదాపు 20 గంటల నుంచి ఇటు ఫేస్ బుక్ లో కానీ అటు మీడియా చానెళ్లతో కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా శ్రీరెడ్డి తన మౌన ముద్రను వీడింది. తన ఫేస్ బుక్ ఖాతాలో  వరుస పోస్టులతో విరుచుకుపడింది. పవన్ కల్యాణ్ మ్యాటర్ డిఫరెంట్ అని..