congress

సొంత పార్టీ నేతలపై రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు...జైలుకి వెళ్ళొచ్చిన నేతలకు ...

Submitted by arun on Fri, 09/21/2018 - 10:45

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల కమిటీలు పెట్టిన చిచ్చు రగులుతూనే ఉంది. కమిటీల కూర్పుపై నేతలు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పెద్ద అంబర్ పేట దగ్గర ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. జైలుకు వెళ్లొచ్చిన వారికి పదవులు ఇచ్చారన్న రాజగోపాల్‌రెడ్డి వార్డు మెంబర్‌గా కూడా గెలిచే సత్తా లేనివారికి కమిటీల్లో ప్రాధాన్యమిచ్చారని మండి పడ్డారు. తెలంగాణకు కుంతియా శనిలా తయారయ్యాడని వ్యాఖ్యానించారు.

ఫైర్‌ బ్రాండ్‌ రాములక్క... ఇప్పుడు కాంగ్రెస్‌ తురుపుముక్క!!

Submitted by santosh on Fri, 09/21/2018 - 10:34

ఫైర్‌ బ్రాండ్‌ రాములమ్మ, తెలంగాణ ఎన్నికల తెరపై ధూంధాం చేసేందుకు సిద్దమయ్యారు. మొన్నటి వరకు అలకపాన్పుపై ఉన్న విజయశాంతికి, స్టార్‌ క్యాంపెనర్‌గా బాధ్యతలు అప్పగించడంతో, ఇక చెలరేగిపోవాలని డిసైడయ్యారు. ఊరూవాడా తిరుగుతూ, కేసీఆర్‌కు దీటుగా విమర్శల బాణాలు సంధించాలని సిద్దమయ్యారు. మరి మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న రాములమ్మ, ఇక తెలంగాణ పోరులో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారారు. సిల్వర్‌ స్క్రీన్‌పైనే కాదు, పొలిటికల్‌ స్క్రీన్‌పైనా విజయశాంతి తనదైన ముద్ర వేశారు. భావోద్వేగ ప్రసంగాలతో ఉర్రూతలూగించారు. మొదటి నుంచి తెలంగాణ నినాదంతో, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.

కేసీఆర్ లా మాట తప్పే తత్వం కాంగ్రెస్ పార్టీకి లేదు

Submitted by arun on Thu, 09/20/2018 - 17:11

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం దగ్గర నుంచి వంద హామీలను కేసీఆర్ ఇచ్చారని... ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి, ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ లా మాట తప్పే తత్వం కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలను కేసీఆర్ బానిసలుగా చూశారని విమర్శించారు. కేసీఆర్, టీఆర్ఎస్ పతనం నల్గొండ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.
 

కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులున్నారా...వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Thu, 09/20/2018 - 12:34

కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించిన కమిటీల్లో స్థానాలపై అలక బూనిన సీనియర్‌ నాయకుడు వీ హనుమంతారావు.. కాసేపటి క్రితం పార్క్‌ హయత్‌ హోటల్‌ లో ఉన్న గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. ప్రచార కమిటీ ఛైర్మెన్‌ పదవి వస్తుందని ఆశించానని కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆయన వాపోయారు. ఈ సందర్భంగా వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కేసీఆర్‌ కోవర్టులున్నారని తనకు పదవి వస్తే కేసీఆర్‌ను ఓడిస్తాననే భయం కోవర్టుల్లో ఉందని వీహెచ్‌ వెల్లడించారు. అందుకే తనకు పదవి రాకుండా చేశారని ఆరోపించిన వీహెచ్‌ వారి పేర్లను డైరెక్ట్‌గా రాహుల్‌గాంధీ ముందే చెబుతానని స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్‌‌కు షాక్ ఇచ్చిన సీనియర్ నేత.. రేపు కాంగ్రెస్‌లోకి...

Submitted by arun on Thu, 09/20/2018 - 12:05

గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తాజాగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అంతేకాదు ఆ పార్టీ తరఫున ఖానాపూర్ నుంచి రమేశ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌‌ ఈ నెల ఆరో తేదీన ప్రకటించిన జాబితాలో ఖానాపూర్‌ టిక్కెట్‌ను తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కేటాయించడంతో రమేష్‌ రాఠోడ్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

కారెక్కిన వారికీ కాంగ్రెస్‌ పదవులు...టీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డికి 3 కీలక పదవులు...

Submitted by arun on Thu, 09/20/2018 - 10:24

కాంగ్రెస్‌ కొత్త కమిటీలపై గొడవ మొదలైంది. వీహెచ్‌, పొంగులేటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు గులాబీ కండువా కప్పుకున్న సురేష్‌ రెడ్డికి, పలు కమిటీల్లో చోటు కల్పించడం కూడా చర్చనీయాంశమమైంది.

కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన నూతన కమిటీలు రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు రేపాయి. తమకు తగిన అవకాశలు దక్కలేదంటూ పలువురు సీనియర్ నేతలు మండిపడ్డారు. ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో సీనియర్ నేత  వీహెచ్ తీవ్ర స్ధాయిలో అసంతృప్తి చెందారు. గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చిన ఆయన, వాహనం కోసం కూడా ఎదురుచూడకుండా  నాంపల్లి సిగ్నల్ వరకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. 

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా రేవంత్, పొన్నం

Submitted by arun on Thu, 09/20/2018 - 10:12

ముందస్తు సమరానికి కాంగ్రెస్‌ సరికొత్త దళం సిద్దమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను నియమించగా, మరికొందరికి కీలక బాధ్యతలు అప్పగించింది. అలకమీదున్న విజయశాంతికి, స్టార్‌ క్యాంపెనర్‌గా చెలరేగిపోవాలని కర్తవ్య బోధ చేసింది కాంగ్రెస్. పొత్తులు, ఎత్తులు, రాహుల్‌తో వరుస సమావేశాలతో ముందస్తు దూకుడు పెంచిన టీ. కాంగ్రెస్ ‌నేతలు, యుద్ధానికి సైన్యంగా ఏర్పడ్డారు. పార్టీ వర్గాలు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న  ఎన్నికల కమిటీలను ప్రకటించి, సమరంలో దూసుకెళ్లాలని దిశానిర్దేశం చేసింది ఏఐసీసీ.

రాజకీయంగా ఎదుర్కోలేకే ఓటుకు నోటు కేసును తెరపైకి తెస్తున్నారు

Submitted by arun on Tue, 09/18/2018 - 09:29

రాజకీయంగా ఎదుర్కోలేకే ఓటుకు నోటు కేసును మళ్లీ తిరగదోడుతున్నారని కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మత్తయ్యపై క్వాష్‌ పిటీషన్‌ వేస్తే హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఇదే కేసులో సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బలు తగిలాయన్నారు. మోడీకి ఎదురుతిరిగిన చంద్రబాబును, కేసీఆర్‌ ప్రత్యర్థి రేవంత్‌రెడ్డిని దెబ్బకొట్టేందుకు మోడీ, కేసీఆర్‌లు కలిసి కుట్ర పన్నుతున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి

Submitted by arun on Fri, 09/14/2018 - 11:32

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలో వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. పలువురు తెలంగాణ ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ లో చేరారు. అలాగే నిజామాబాద్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి తెలిపారు. ఉద్యోగాలు లేవని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేశ్‌...పవన్‌ కల్యాణ్‌ తనకు దేవుడితో సమానమనీ

Submitted by arun on Fri, 09/14/2018 - 11:23

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలో వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. పలువురు తెలంగాణ ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ లో చేరారు. రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. త్యాగాలకు ప్రతిరూపం కాంగ్రెస్‌ పార్టీ అని సినీ నిర్మాత బండ్ల గణేష్‌ అన్నారు. కాంగ్రెస్‌ అంటే ఇష్టం కావడంవల్లే ఆ పార్టీలో చేరానని చెప్పారు. పార్టీ ఏదీ చెబితే అది చేస్తానన్న బండ్ల గణేష‌..ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తానని అన్నారు.