bjp

బీజేపీకి యశ్వంత్‌ సిన్హా గుడ్‌బై

Submitted by arun on Sat, 04/21/2018 - 14:19

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా  ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఆయన... బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరబోననీ.. అయినప్పటికీ ప్రజాస్వామ్యం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇవాళ పాట్నాలో ప్రతిపక్షాలతో కలిసి నిర్వహించిన ఓ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ...ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న రిపోర్టర్లను హత్యలు చేయిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.

కంభంపాటి హరిబాబుకు కొత్త పదవి

Submitted by arun on Wed, 04/18/2018 - 16:26

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కంభంపాటి హరిబాబును పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్టీలో అంతర్గతంగా వస్తున్న విమర్శలు నేపథ్యంలో మనస్తాపం చెంది పార్టీ పదవికి హరిబాబు రాజీనామా చేసి ఉంటారనే వాదన బలంగా వినిపించింది. అయితే మిత్రపక్షం టీడీపీతో చెడిన తర్వాత అధ్యక్ష మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశారనేవి మరో వాదన.

బీజేపీలోకి ద్రవిడ్‌..కుంబ్లే ?

Submitted by arun on Tue, 04/17/2018 - 16:32

టీమిండియా మాజీ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌లు బీజేపీలో చేరబోతున్నారా? అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారిద్దరినీ ఎలాగైనా పార్టీలో చేర్చుకోవడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. మే నెలలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరిని బరిలోకి దించి ప్రచారం చేయించాలని భావిస్తోంది. ఐతే, వీరిద్దరూ రాజకీయ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కొత్త తలనొప్పి

Submitted by arun on Tue, 04/17/2018 - 12:19

ఉత్తరప్రదేశ్‌లో కాషాయ దళానికి కొత్త తలనొప్పి మొదలైంది. సాధువు, బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ బార్, నైట్‌ క్లబ్‌ను ప్రారంభించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు షాకిచ్చారు. ఇప్పటికే ఎన్నో సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన సాక్షి మహారాజ్ తాజాగా లెట్స్‌ మీట్ అన్న క్లబ్‌ను ప్రారంభించి విమర్శలకు కేంద్ర బిందువయ్యారు.

కంభంపాటి హరిబాబు రాజీనామా

Submitted by arun on Tue, 04/17/2018 - 10:59

బీజేపీ ఏపీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు నిన్ననే రాజీనామా లేఖ పంపించినట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన హరిబాబు ఆకస్మిక నిర్ణయానికి కారణాలేమిటో స్పష్టంగా తెలియడంలేదు. 

ఏపీ అధ్యక్షుడిగా హరిబాబు పదవీకాలాన్ని బీజేపీ అధిష్ఠానం ఓసారి పొడిగించింది. కొత్త అధ్యక్షుడిని నియమించే వరకు హరిబాబునే కొనసాగించాలని ముందే నిర్ణయించారు. అయితే, ఏపీ అధ్యక్ష పదవికి హరిబాబు ఆకస్మికంగా రాజీనామా చేయడం కొత్త చర్చకు తావిస్తోంది.

చంద్రబాబు పాకిస్తాన్‌ ఏజెంట్

Submitted by arun on Mon, 04/16/2018 - 11:51

తెలుగుదేశం, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయ్. ప్రత్యేక హోదా అంశం రెండు పార్టీల మధ్య చిచ్చు రేపుతూనే ఉంది. కేంద్రం ఆర్థిక సాయం చేద్దామనుకున్నా ఏపీ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడాలని టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. 

జాతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ

Submitted by arun on Wed, 04/11/2018 - 14:00

అత్యంత ధనవంతుల జాబితా మాదిరిగానే ఈఏడాది కూడా అత్యంత ధనిక పార్టీల లిస్టు కూడా వచ్చేసింది. దేశంలోని జాతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. అధికార పార్టీకి మాములుగానే అత్యధికంగా విరాళాల రూపంలో వస్తుంటాయి. నాలుగేళ్లలో బీజేపీ వెయ్యికోట్లకు పైగా ఆస్తులు సంపాదించి రిచెస్ట్ పార్టీగా నిలిచింది.

చంద్ర‌బాబు దెబ్బ‌తో వైసీపీ - జ‌న‌సేన - బీజేపీ ఉక్కిరిబిక్కిరి..?

Submitted by lakshman on Tue, 04/10/2018 - 11:16

ఏపీలో ఎన్నిక‌ల రాజ‌కీయం వేడెక్కుతుంది. హ‌స్తిన‌లో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక‌హోదా దిశ‌గా మారిన పోరాటం..ఇప్పుడు స్వ‌లాభం కోసం ఎవ‌రి పోరాటం వారు చేస్తున్నారు. వైసీపీ  ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తుంది. జ‌న‌సేన - లెఫ్ట్ పార్టీలు రాష్ట్రంలో ప‌ర్య‌ట‌న‌లు చేపట్టేందుకు కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించాయి. దీంతో అన్నీ పార్టీల నాయ‌కులు ప్ర‌త్యేక‌హోదా కోసం ఒకే తాటిపై కాకుండా ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌చందంగా వ్య‌వ‌హరిస్తున్నారు. 

ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటర్

Submitted by arun on Sat, 04/07/2018 - 16:18

బీజేపీ ఏ రాష్ట్రానికీ అన్యాయం చేయదన్నారు మాజీ మంత్రి పురందరేశ్వరి. ఏపీకి హోదా కంటే ప్యాకేజీనే బెటర్ అని తెలిపారు. 2014లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. టీడీపీ.... బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. భూగర్భ డ్రైనేజ్‌కి ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని, ఏపీలో ఎవరేంటో ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని అన్నారు బీజేపీ నేత పురందరేశ్వరి.

మోదీకి మరో బీజేపీ ఎంపీ షాక్‌

Submitted by arun on Sat, 04/07/2018 - 15:40

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో దళిత ఎంపీ యశ్వంత్ సింగ్ ఊహించని షాక్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో దళితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిందంటూ నిలదీశారు. నాగిన నియోజవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్న యశ్వంత్.. కేవలం రిజర్వేషన్ కారణంగానే తాను ఎంపీనయ్యానన్నారు. ‘‘ఒక దళితుడిగా నా సామర్ధ్యాన్ని ఏమాత్రం ఉపయోగించుకోవడం లేదు. నేను కేవలం రిజర్వేషన్ కారణంగానే పార్లమెంటు సభ్యుడిని కాగలిగాను. దేశంలోని 30 కోట్ల మంది దళితులకు గత నాలుగేళ్లలో కేంద్రప్రభుత్వం చేసింది శూన్యం...’’ అంటూ తన లేఖలో ధ్వజమెత్తారు.