Technology

వాట్సాప్ లో స‌రికొత్త ఫీచ‌ర్

Submitted by lakshman on Fri, 01/12/2018 - 17:57

వాట్సాప్‌లో మరో అడుగుముందుకేసింది. సాధార‌ణంగా వాట్సాప్ గ్రూప్ లో ఉన్న అడ్మిన్ ను తొల‌గించాలంటే వారు సంబంధిత గ్రూప్ ను బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. అయితే త్వ‌ర‌లో వాట్సాప్ కొత్త ఫీచ‌ర్ తో ఆ స‌మ‌స్య ఉండ‌ద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతానికి ఆండ్రాయిడ్, ఐవోఎస్ లో ఈ ఫీచ‌ర్ ప‌రీక్ష ద‌శ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తే అడ్మిన్ ను  తొల‌గించేందుకు వీలుగా ‘డిస్మిస్‌’ బటన్‌ను వాట్సాప్‌ కొత్తగా తీసుకురాబోతోంది.
 

పాన్ కార్డ్ ప‌నిచేస్తుందా..? లేదా..? అని తెలుసుకోవాలంటే

Submitted by arun on Sun, 01/07/2018 - 17:44

న‌కిలీ పాన్ కార్డ్ ల‌ను గుర్తించేలా కేంద్రంప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇందులో భాగంగా సంబంధిత పాన్ కార్డ్ ల‌ను మార్చి 31,2018లోగా ఆధార్ తో అనుసంధానం చేయాల‌ని సూచించింది. మ‌న పాన్ కార్డ్ లు ఒరిజ‌నల్ లేదా డూప్లికేట్ అనేది  సంబంధిత అధికారులు కంప్యూట‌ర్ల ద్వారా చెక్ చేస్తారు. ఆ స‌మ‌యంలో పాన్ కార్డ్ లో ఏ చిన్న‌త‌ప్పు దొర్లినా న‌కిలీ పాన్ కార్డ్ లా ప‌రిగ‌ణిస్తారు. అయితే మ‌న పాన్ కార్డ్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే . ఈ డిజి లేదా అని చెక్ చేసుకోవాలంటే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

Tags

నిలిచిన వాట్సాప్ సేవ‌లు

Submitted by arun on Mon, 01/01/2018 - 15:01

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్ వాట్సాప్ మొరాయించింది.  దీంతో దేశ‌వ్యాప్తంగా ఉన్న వినియోగ‌దారులు అస‌హ‌నానికి లోన‌య్యారు. 2018కి స్వాగ‌తం చెప్పేందుకు ఆదివారం సాయంత్రం నుంచి వాట్సాప్ వినియోగ‌దారులు సిద్ద‌మ‌య్యారు. త‌మ స్నేహితుల‌కు విష‌స్ చెప్పేందుకు మిలియ‌న్ల కొద్ది మెసేజ్ ల‌ను షేర్ చేశారు. దీంతో వాట్సాప్ క్రాష్ డౌన్ అయ్యింది. అయితే వాట్సాప్ మొరాయించ‌డంతో యూకే, భార‌త్ , యూర‌ప్‌, బ్రెజిల్ దేశాల్లో 54 శాతం మందికి క‌నెక్టింగ్, 27 శాతం మందికి మెసేజ్ సెండింగ్, 17 శాతం మందికి లాగిన్ సమ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో వినియోగ‌దారులు వాట్సాప్ సేవ‌లు నిలిచిపోవ‌డంతో ట్విట్ట‌ర్ ను ఆశ్ర‌యించారు.

ఐఫోన్ కోసం సింగపూర్‌కు

Submitted by lakshman on Sun, 09/24/2017 - 19:23

సింగపూర్: ఐఫోన్ అంటే ఇష్టముండనివారు ఎవరుంటారు..! ఏడాదికొక కొత్త మోడల్‌ను ఆపిల్ కంపెనీ ప్రవేశపెట్టడం ఆలస్యం.. ఆ ఫోన్‌ను ఎప్పుడెప్పుడు చేతిలో చూసుకుంటామా అన్న తాపత్రయం చాలా మందిలో ఉంటుంది. ఇక్కడ ఆ ఫోన్ విడుదల కాకపోతే వేరే దేశంలో క్యూలో నిలబైడెనా సరే వెనువెంటనే దానిని దక్కించుకోవాలన్న ఆత్రుత ఉంటుంది చాలా మందికి. వ్యాపారవేత్తలూ అందుకు మినహాయింపేమీ కాదు.

ఫోన్‌లో డిలీట్ అయిన నంబర్లను తిరిగి పొందండిలా!

Submitted by lakshman on Fri, 09/22/2017 - 19:15
చాలామంది ఫోన్ యూజర్లు ఓ విషయంలో తెగ బాధపడిపోతుంటారు. తమ ఫోన్‌లో నంబర్లు పోయాయని, తిరిగి వాటిని పొందలేకపోయామని ఫీలవుతుంటారు. కానీ అలా డిలీట్ అయిన నంబర్లను...

ఫేస్‌బుక్ యూజర్లు ఇలా చేస్తే దొరికిపోతారు!

Submitted by lakshman on Thu, 09/21/2017 - 22:24
మీరేం చూస్తున్నారో ఫేస్‌బుక్ క్షణాలలో కనిపెట్టగలదు. కొంతమంది స్మార్ట్‌ఫోన్లలో పోర్న్ సైట్స్ ఓపెన్ చేసి చూస్తూ.. ఫేస్‌బుక్‌ను లాగ్ అవుట్ చేయకుడా వదిలేస్తుంటారు. అప్పుడు ఆ వెబ్‌సైట్‌లకు రిలేటెడ్ అయిన  ఫేస్‌బుక్ ప్లిగిన్స్ యాక్టివ్‌గా...

డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లు రాబోతున్నాయి!

Submitted by lakshman on Wed, 09/20/2017 - 16:20
ఇన్నాళ్లూ డ్రైవర్‌లెస్ కార్ల గురించి విన్నాం. గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ ఆ కార్లను అందుబాటులోకి తేవాలని భావించింది. టెస్ట్ డ్రైవ్ కూడా చేసింది. అవి రోడ్లపై తిరగడంతో పాటు జనంపైకి కూడా వెళుతుండటంతో...

బ్లూవేల్ ఛాలెంజ్ దారుణాలు

Submitted by lakshman on Mon, 09/18/2017 - 17:09
కిల్లర్ గేమ్ బ్లూవేల్ ఛాలెంజ్ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు , శాస్త్రవేత్తలు చివరికి కోర్టులు కూడా ఈ కిల్లర్ గేమ్‌ను ఆడొద్దని , బాధిత తల్లిదండ్రులు దీన్ని నిషేధించాలని నెత్తీ నోరు కొట్టుకుని చెప్తున్నా...

సెల్‌కాన్ లైఫ్‌టైమ్ వారంటీ ఆఫర్

Submitted by lakshman on Sun, 09/17/2017 - 22:10

త్వరలో 2,999లకే 4జీ స్మార్ట్‌ఫోన్
ప్రతి జిల్లాలోనూ సొంత సర్వీస్ సెంటర్
సెల్‌కాన్ చైర్మన్, ఎండీ వై.గురు వెల్లడి  

ఎయిర్‌టెల్ 4జీ ఫోన్  రూ.2500కే..? 

Submitted by lakshman on Sun, 09/17/2017 - 22:08

రిలయన్స్ ప్రవేశపెట్టిన జియో 4జీ ఫీచర్ ఫోనుకు పోటీగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కూడా ఓ నూతన 4జీ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోనును విడుదల చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఎయిర్‌టెల్ పలు మొబైల్ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. అయితే ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టనున్న 4జీ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుందని సమాచారం. ఈ ఫోన్ ధర రూ.2500 నుంచి రూ.2700 మధ్య ఉండే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎయిర్‌టెల్ తాను అందుబాటులోకి తేనున్న కొత్త 4జీ ఫోనును దీపావళికి మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలిసింది. ఈ ఫోన్‌తోపాటు ఎయిర్‌టెల్ సిమ్‌ను ఉచితంగా అందివ్వనున్నారు.