revanth reddy

కుట్రలకు వేదికగా రాజ్‌భవన్: రేవంత్

Submitted by arun on Tue, 03/20/2018 - 17:12

రాజ్‌ భవన్‌ రాజకీయాలకు, కుట్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గవర్నర్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న రేవంత్‌ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారన్నారు.  మోడి ఎజెండాను అమలు చేయడానికి రాజ్‌భవన్‌ను వాడుకుంటున్నారని అందుకు నరసింహన్ పదవీకాలం ముగిసినా అతన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

వైఎస్ తో హ‌రీష్ భేటీ - గుట్టుర‌ట్టు చేసిన రేవంత్

Submitted by arun on Sat, 03/10/2018 - 17:23

చచ్చేదాకా టీఆర్ఎస్ లో ఉంటానన్న మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో పార్టీ మారుతానని వైఎస్ ను హరీశ్ రావు  కలిసింది నిజం కాదా,  ఈటెలను ఫ్లోర్ లీడర్ చేయడంతో పార్టీ మారేందుకు హరీశ్ రావు సిద్ధపడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అమిత్ షాతో హరీశ్ రావు భేటీ అయింది నిజం కాదా అని నిలదీశారు. కేటీఆర్ ను సీఎంను చేస్తే టీఆర్ఎస్ చీలిపోతుంది అని, చీలిక వర్గానికి హరీశ్ లేదా ఈటెల నాయకత్వం వహిస్తారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. బస్సు యాత్రలో కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పక... టీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు అని చెప్పారు.  

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గుట్టు విప్పిన రేవంత్‌రెడ్డి

Submitted by arun on Mon, 03/05/2018 - 18:05

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గుట్టును విప్పారు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి. ఇంతకాలం ప్రజా సమస్యలు చూడనట్టు ఇప్పుడే తన దృష్టికి వచ్చినట్టు రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి కేసీఆర్ ప్రస్తావిస్తున్నారని రేవంత్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి థర్డ్ ఫ్రంట్ అంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఆయన ఆడుతున్న కొత్త డ్రామా అని, ఈ తెర వెనుక భాగోతాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు రేవంత్‌‌రెడ్డి.

రేవంత్‌రెడ్డిపై టీడీపీ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 03/02/2018 - 13:40

తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసుతో రేవంత్‌ తెలుగుదేశం పార్టీ పరువు తీశారన్నారు. రేవంత్‌రెడ్డిని ఆనాడే సస్పెండ్‌ చేసి ఉంటే తెలంగాణలో పార్టీ బతికేది అని మోత్కుపల్లి అన్నారు. ‘టీఆర్‌ఎస్‌తో రేవంత్‌‌రెడ్డికి వైరం ఉండొచ్చు... కానీ నాకు లేదు’ అని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేదని ఆరోపించారు మోత్కుపల్లి నర్సింహులు. కమిట్మెంట్ లేనివాళ్లకి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీ భ్రష్టు పట్టిందన్నారు.

రేవంతా మ‌జాకా

Submitted by arun on Sat, 02/24/2018 - 11:02

ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీని ఢికొట్టడానికి తన బలాన్ని పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రోత్సహిస్తోంది. ఇందులో బాగంగానే ప్రజాబలం ఉన్న సీనియర్ నేతలకు పార్టీ కండువా కప్పి గాంధిభవన్ కు స్వాగతం పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి టీమ్ కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి హస్తం పార్టీ వైపు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇప్పుడు అదే సమస్యగా మారింది. 

ఆ 5కోట్ల‌లో నా ప్ర‌మేయం లేదు : మ‌త్త‌య్య

Submitted by lakshman on Sat, 02/24/2018 - 04:31

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసు రోజుకో మ‌లుపు తిరుగుతుంది. ఈ కేసు సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య  అత్య‌న్నుత న్యాయ స్థానానికి లేఖ రాయడం ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో ఆ కేసు ఏమ‌లుపు తిరుగుతుందోన‌ని తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. 

త్వరలో రేవంత్‌ పాదయాత్ర

Submitted by arun on Thu, 02/15/2018 - 12:18

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెకుటల సాధనే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్‌-కృష్నా రైల్వేలైన్‌, నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతలకు నిధుల కేటాయింపుతో పాటు పలుడిమాండ్ల సాధనకు కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు 120 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. బంరాస్‌ పేట, పరిగి,వికారాబాద్‌,. మన్నెగూడ,చేవేళ్ల, మెయినాబాద్‌ మీదుగా ఈ యాత్ర సాగునుంది.

మన ముఖ్యమంత్రికి ‘కుంభకర్ణ అవార్డు’ ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

Submitted by arun on Sat, 02/03/2018 - 13:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతకొద్ది రోజులుగా కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఇంటి నుంచే వ్యవహారాలు చక్కబెట్టడంపై రేవంత్ విమర్శలు గుప్పిస్తూ ఓ ట్వీట్ చేశారు.‘సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టకుండా, ఇంటి నుంచి నిద్రావస్థలో పని చేస్తూ ఏడాది కాలం పూర్తి చేసుకున్న మన ముఖ్యమంత్రికి ‘కుంభకర్ణ అవార్డు’ ఇవ్వాలి.. స్లీపింగ్ మోడ్ సీఎం @ తెలంగాణ సీఎంఓ’ అంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

రేవంత్ రెడ్డి దూకుడుకు టీఆర్ఎస్ క‌ళ్లెం..?

Submitted by lakshman on Mon, 01/29/2018 - 11:11

టీ కాంగ్ లీడ‌ర్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారా..? ఆరోప‌ణ‌లో ప్ర‌త్యారోప‌ణ‌లతో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్న రేవంత్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీఆర్ఎస్ నేత‌లు ఆపార్టీ అధినేత కేసీఆర్ తో సంప్ర‌దింపలు జ‌రిపార‌ని టాక్ .