Crime

దారుణం: 2 రోజులపాటు మైనర్‌ బాలికపై 14 మంది గ్యాంగ్‌రేప్

Submitted by arun on Mon, 03/19/2018 - 13:39

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం జానంపేట పాండురంగాపురం గ్రామానికి చెందిన 15 ఏళ్ళ బాలికపై 14 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. బాధితురాలిని అడవుల్లోకి తీసుకెళ్ళి రెండు రోజుల పాటు యువతిని 14మంది యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు నిందితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆనంపేట పాండురంగాపురం గ్రామానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతుంది. కొన్ని కారణాలతో ఇటీవలనే స్కూల్ మానేసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లితో కలిసి కూలి పనులకు వెళ్తోంది.

Tags

పెళ్లిలో భార్య డాన్స్ చేసిందని..

Submitted by arun on Mon, 03/19/2018 - 13:12

పెళ్లిలో డాన్స్ చేసిందనే కారణంతో భార్యను అతిదారుణంగా చంపాడో భర్త. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో దక్షిణ 24 పర్గానాలోని బసంతి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..స్వప్న (18)అనే యువతికి సుబీర్ నష్కర్ అనే వ్యక్తితో  ఇటీవలే  వివాహం జరిగింది.  అయితే శనివారం తమ బంధువుల వివాహా వేడుకకు సుబీర్, స్వప్న తమ తల్లిదండ్రలతో కలిసి వెళ్లారు. అక్కడ స్వప్న కొంత మంది యువకులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. అది సుబీర్‌కు నచ్చలేదు. దీంతో సుబీర్ అందరి ముందే భార్యతో గొడవ పెట్టుకొన్నాడు. డ్యాన్స్ ఎందుకు చేశావని అక్కడే నిలదీశాడు. దీంతో స్వప్న అలిగి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఇంటికి వెళ్లిన స్వప్నను..

హెచ్‌సీయూలో దారుణం..విద్యార్థినిపై సామూహిక అత్యాచారయత్నం

Submitted by arun on Sat, 03/17/2018 - 13:04

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి క్యాంపస్ లో ఇంటిగ్రేటెడ్  MA ఫస్ట్ ఇయర్ చదువుతున్న కేరళ యువతిపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. నల్లగండ్ల చెరువు దగ్గరకు తన ఫ్రెండ్ తో కలిసి వెళ్లిన యువతిని.. గుర్తుతెలియని కొంతమంది యువకులు బెదిరించి.. రేప్ అటెంప్ట్ చేశారు. వారి నుంచి తప్పించుకున్న అమ్మాయి.. సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించింది. ఇటు సమాచారం అందుకున్న గచ్చీబౌలీ పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే అత్యాచార యత్నానికి పాల్పడ్డవారంతా.. భవన నిర్మాణ కార్మికులుగా అనుమానిస్తున్నారు. 
 

భర్తకు ప్రియుడితో చేసిన పాడుపని వీడియోలు..

Submitted by arun on Fri, 03/16/2018 - 16:06

కట్టుకున్న భర్తను కాదని మరో యువకుడిని పెళ్లి చేసుకుంది ఓ యువతి. అంతేకాకుండా ప్రియుడితో కలిసి పెళ్లి దృశ్యాలను ఏకంగా భర్త మొబైల్‌కే వాట్సాప్‌లో పంపించి మానసికంగా వేధించింది. తీవ్రమనస్తాపానికి లోనైన భర్త.. పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడితో కలిసి భర్తకు పంపిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోనే జగిత్యాల మండలం ఖానాపూర్‌కు చెందిన నాగలక్ష్మితో ధర్మారావు పేటకు చెందిన ధర్మరాజు (27)కు పెళ్లయింది. కానీ, ఆ పెళ్లికి ముందే ఆమె తన పుట్టింటికి దగ్గర్లోని వెల్గటూరుకు చెందిన మంత్రి మహేశ్ అనే యువకుడితో ప్రేమాయాణం సాగించింది.

ఖమ్మం ప్రమాదం వెనుకు జీర్ణించుకోలేని చేదు నిజం

Submitted by arun on Sat, 03/10/2018 - 16:53

చావు. అందరికీ భయమే. ఎప్పుడైనా ఏ రూపంలోనైనా కాటేసే మరణమంటే చచ్చేంత భయం. ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో...ఎవ్వరూ చెప్పలేరు. కనీసం ఊహకు కూడా అందదు. అలాంటి చావు దుర్మార్గమా చిదిమేస్తుంది. కారుణ్యం చూపించనంత కఠినంగా కాటేస్తుంది. ఖమ్మం జిల్లాలో నిన్న అదే జరిగింది. పెళ్లయిన కేవలం ఆరంటే ఆరు గంటల్లోనే మృత్యువు దారుణంగా పాశం వేసింది. పాశవికంగా ప్రాణాలు తీసేసింది. చావు ఎదురయ్యే ఆ క్షణం ముందే తెలిసిపోయిన ఆ ప్రాణాలు ఎంత అవిసిపోయాయో... ఎంతగా అల్లాడిపోయాయో పాపం.

నిద్రలోనే మహిళకు నిప్పటించారు

Submitted by arun on Fri, 03/09/2018 - 16:53

తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేదని ఓ దళిత మహిళపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన కిరాతక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన దళిత మహిళ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బల్లియా జిల్లా జజౌలి గ్రామంలో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 

హైదరాబాద్ ను టార్గెట్ చేసిన డి-గ్యాంగ్...ఓ హైదరాబాద్ సెలబ్రిటీ హత్యకు కుట్ర

Submitted by arun on Wed, 02/21/2018 - 11:46

మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇప్పుడీ మాఫియా డాన్ కన్ను హైదరాబాద్ పై పడిందనే విషయం కలవరం సృష్టిస్తోంది. ఇంతకాలం ముంబైకే పరిమితమైన డీ- గ్యాంగ్ కార్యకలాపాలు ఇప్పుడు మన విశ్వనగరానికి విస్తరించాయనే అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ లో ఓ సెలబ్రిటీని చంపేందుకు సుపారీ తీసుకున్నాడని ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావడం కలకలం రేపుతోంది.

రెండు కార్లు ఢీకొని ఏడుగురి మృతి

Submitted by arun on Wed, 02/21/2018 - 09:50

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీ కొనడంతో.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 44 వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. అతివేగంతో వస్తున్న ఓ కారు.. డివైడర్ పైకెక్కి.. ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. 

రంగస్వామి లీలలు గుట్టురట్టు..

Submitted by arun on Tue, 02/20/2018 - 17:26

ఒంటరి మహిళలకు ఎర వేసి మోసం చేస్తున్న ఘరానా మోసగాడ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒంటరిగా నివశిస్తున్న మహిళలను ఫేస్‌బుక్ ఛాటింగ్ ద్వారా పరిచయం చేసుకుని మోసం చేస్తున్న రంగస్వామి రాచకొండ పోలీసులకు చిక్కాడు. అనంతపురం జిల్లాకు చెందిన రంగస్వామి ఇప్పటి వరకు 10 మంది మహిళల్ని మోసం చేశాడు. ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగస్వామి లీలలు బయటపడ్డాయి. అయితే రంగస్వామిపై హైదరాబాద్‌లో ఇప్పటికే 10 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

సెక్స్ కు ఒప్పుకోని యువ‌తి దారుణ హ‌త్య

Submitted by arun on Mon, 02/19/2018 - 14:50

ఫేస్‌బుక్ పరిచయం.. ఆ పరిచయం కాస్తా ముదిరి స్నేహమవడం.. ఆ స్నేహం ముదిరి ముప్పుగా పరిణమిస్తుందనడం మరోసారి తేలింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి.. 20 ఏళ్ల యువతిని హత్య చేశాడు. లైంగిక చర్యకు ఆ అమ్మాయి నిరాకరించడంతో అత్యంత కర్కశంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని నలసొపారాలో ఆదివారం రాత్రి 7 గంటలకు జరిగింది. ముంబైలోని వాసి ప్రాంతానికి చెందిన అంకిత (20) న‌ల‌సోపార ప్రాంతానికి చెందిన హ‌రిదాస్‌కు ఫేస్‌బుక్ ద్వారా కొన్ని నెల‌ల క్రితం ప‌రిచ‌య‌మైంది. మాట‌ల‌తో మాయ చేసి ఆమెతో హ‌రిదాస్ స్నేహం కొనసాగించాడు.