In-Depth

టీఆర్ఎస్‌లో కేటీఆర్‌ది తారకమంత్రం

Submitted by santosh on Sat, 12/15/2018 - 13:06

గులాబీదళంలో కేటీఆర్‌ది తారకమంత్రం. అన్నీ తానై నడుస్తూ... అందరిని తానై నడిపిస్తూ ఎన్నికల్లో అత్యంత కీలకంగా వ్యవహరించారు కేటీఆర్‌. సెటిరట్ల ఓటర్లను గెలిచే విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యహరించారు. రెండేళ్ల కిందటి గ్రేటర్‌ ఎన్నికల నుంచి తాజా ఎలక్షన్ల కార్యాచరణలో కేటీఆర్‌ కీలక భూమిక పోషించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో తండ్రి కేసీఆర్‌కు తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు కేటీఆర్‌.

కేటీఆర్‌ సన్నాఫ్‌ కేసీఆర్‌

Submitted by santosh on Sat, 12/15/2018 - 13:03

ఉద్యోగ దశ నుంచి ఉద్యమ బాట పట్టిన ప్రస్థానం. జై తెలంగాణ అంటూ కేసీఆర్ అడుగుజాడలో నడిచిన ఉత్తేజం. అధినేతతో వేసిన అడుగులే ఎమ్మెల్యేగా మార్చిన నేపథ్యం. యువ ఎమ్మెల్యేగా నియోజవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించిన నాయకుడు. ఉరిసిల్ల నుంచి సిరుల ఖిల్లాగా మార్చేందుకు అహర్నిశలు శ్రమించిన రాజకీయ శ్రామికుడు... ఆయనే కల్వకుంట్ల తారకరామారావు సన్నాఫ్‌ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 

కొత్త డ్రైవర్‌ రాకతో కారు పరిగెత్తే స్పీడెంత?

Submitted by santosh on Sat, 12/15/2018 - 12:55

ఎప్పటి నుంచో అనుకున్నదే అయింది. కేసీఆర్‌ తన వారసుడిగా కేటీఆర్‌ను ప్రకటించేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదా ఇస్తూ పార్టీలో నెంబర్‌ 2న కేటీఆరేనని తేల్చిచెప్పేశారు. పార్టీలో కీలక బాధ్యతలు చూస్తున్న తారకరాముడు... ఇక కార్యనిర్వాహక నిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. గులాబీ పార్టీకి కొత్త జోష్‌ వస్తుందంటున్న శ్రేణులు... రానున్న రోజుల్లో మరింత బలపేతమవుతుందని చెబుతున్నాయి. 

మోడీని ఢీకొట్టేందుకు రాహుల్‌‌‌లో ఈ మార్పు సరిపోతుందా?

Submitted by santosh on Fri, 12/14/2018 - 16:42


రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించి, విశ్రాంతి తీసుకోవాలని, సోనియా గాంధీ 2014 నుంచి అనుకుంటూనే ఉన్నారు. కానీ ముళ్లకిరీటంలా భావించి తప్పించుకు తిరిగారు రాహుల్‌.ఎవరికీ చెప్పకుండా, వేరే దేశాలకు వెళ్లేవారు. కానీ ఏమైందో ఏమో కానీ, 2017 డిసెంబర్‌ 16న బలవంతంగానో, బతిమాలో రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌ అధ్యక్షున్ని చేశారు. ఇష్టంలేకుండా బాధ్యతలు తీసుకున్న రాహుల్‌, పార్టీని ప్రక్షాళన చేయడం మాత్రం మొదలుపెట్టారు.

జీఎస్టీని గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌గా అభివర్ణించిన రాహుల్

Submitted by santosh on Fri, 12/14/2018 - 16:36


పార్లమెంట్‌లో నిద్రపోతాడు అన్న విమర్శలు ఎదుర్కొన్న రాహుల్‌, పదునైన ప్రసంగాలు చేస్తూ, మోడీకి హగ్‌లిచ్చాడు. బహిరంగ సభల్లోనూ, ఎవరో రాసింది చదువుతాడు, మోడీలా అనర్గళ ప్రసంగం చేయలేడు అన్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా, ఇప్పుడు సొంతంగానే స్పీచ్‌లు దంచేస్తున్నారు. మోడీ అంత కాకపోయినా, మాటలు తూటాల్లా పేలుస్తున్నారు.

మోడీకి తానేమీ తీసిపోను అంటూ రాహుల్‌ నిరూపణ..

Submitted by santosh on Fri, 12/14/2018 - 16:31


2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో, బీజేపీ ఘనవిజయం సాధించింది. కేవలం మోడీ మానియాతోనే, పువ్వు వికసించిందని బీజేపీ నేతలు మనసావాచా నమ్మారు. ఇక మోడీ, అమిత్ షాలైతే, తమ ఛరిష్మా, వ్యూహాలతోనే గెలిచామని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ, స్థానిక నాయకులు కాకుండా, కేవలం మోడీ, షా అంతా తామై నడిపారు. లోకల్‌ సమస్యలేవీ పట్టించుకోకుండా, జాతీయ అంశాలే ప్రాతిపదికగా మోడీ ముఖం చూసి ఓట్లేయమన్నారు. చేతగాని రాహుల్‌పై విమర్శలు కురిపించారు. దీంతో రాష్ట్రాల ఎన్నికల్లోనూ రాహుల్ వర్సెస్ మోడీగా మార్చేశారు బీజేపీ నేతలు.

'పప్పూ' కాదు నిప్పు అంటున్న రాహుల్‌

Submitted by santosh on Fri, 12/14/2018 - 16:24

పప్పూ అన్నారు. అజ్ణాని అన్నారు. మాట్లాడ్డం రాదని ఎద్దేవా చేశారు. వారసత్వమే తప్ప నాయకత్వ లక్షణాల్లేవని దెప్పి పొడిచారు. ఐరన్‌లెగ్‌ అని ముద్రేశారు. పరాజయాల పాదమని స్టాంపేశారు. ఇప్పుడు అవేనోళ్లు మూతపడుతున్నాయి. వెక్కిరించిన నొసళ్లే సైలెంటవుతున్నాయి. గుజరాత్‌‌లో మోడీని వణికించి, కర్ణాటకలో అపర చాణక్యం ప్రదర్శించి, కాషాయ కంచుకోట్లాంటి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేసి, తూటాల్లాటి మాటలు దూస్తూ, మిత్రో అబ్‌ కౌన్ హై పప్పు అంటున్నాడు.

పలకరిస్తే పులకరించిన ఎర్రవల్లి, చింతమడక

Submitted by santosh on Fri, 12/14/2018 - 13:58

మూడక్షరాల సక్సెస్‌ మంత్రతో ఉద్యమ ధీరత్వంతో చాణక్య వ్యూహాలతో గెలుపు ఐకాన్‌గా యునిక్‌ లీడర్‌‌గా తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా తెలంగాణ సెకండ్‌ టైమ్‌ సీఎంగా ఎదిగారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన కేసీఆర్‌ సాగించిన ప్రస్థానం ఒక చరిత్ర. ఒక అధ్యాయం. చెరిగిపోని సంతకం. చింతమడక నుంచి చీఫ్‌ మినిస్టర్‌ దాకా సాగిన కేసీఆర్‌ ప్రయాణం ఎర్రవల్లితో మరింత ఎగిరింది. భావి తరాలకు ఒక పాఠమైంది. 

భావోద్వేగంతో ముడిపడిన ఒక సమస్యని అలా నిలిపిన ధీరత్వం

Submitted by santosh on Thu, 12/13/2018 - 19:37

నాభాష నాయాస నాగోస అంటూ కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటం అని తెలంగాణ జనానికి భరోసా కలిగేలా ఆయన ప్రసంగాలు సాగాయి. ఆయన చేసిన విమర్శలకి, ఇచ్చిన స్ఫూర్తికి తెలంగాణ గజ్జెకట్టింది. తీన్మార్ ఆడింది. తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ల పాటూ నిలబెట్టడం మాములు మాటేమీ కాదు. అది ఓ సామాన్య రాజకీయ నాయకుడి తరమూ కాదు. ఇంకా అందులోనూ భావోద్వేగంతో ముడిపడిన ఒక సమస్యని అన్నేళ్ల పాటూ కళ్లెం వేసి సరైన రీతిలో నడపడం మహామహులకి మాత్రమే సాధ్యపడుతుంది.. ఉద్యమాన్ని టోన్‌డౌన్ చేయాల్సి వచ్చినప్పుడు.. కొంతకాలం పాటూ విరామం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కాడి వదిలేయకుండా..

వ్యూహాత్మక విరామం... ఎత్తుగడ మారుతుంటుంది

Submitted by santosh on Thu, 12/13/2018 - 19:32

కేసిఆర్‌కి ఎవరైనా ఒక్కరే లక్ష్యసాధనలో వ్యూహాత్మకంగా అడుగులు పడతాయి పెదాలు కదులుతాయి. సందర్భాన్ని బట్టి పదాలు పడతాయి. పరిస్థితులను బట్టి వేరియేషన్స్ మారతాయి. మూడ్స్ మారతాయి.. జనం దృష్టి ఎవరిపై టార్గెట్ చేయాలో వారిని వ్యూహాత్మకంగా మాటల చట్రంలో బంధిస్తారు.. ఒక విధంగా చెప్పాలంటే టార్గెట్ సెట్ చేసి వదిలేస్తారు. ఇక ఆ దాడిలోంచి బయటపడటం అన్నది ప్రత్యర్ధి సమస్య. ఉద్యమం అంటే కొలిమి కాదు. నిరంతరం రగిల్చేందుకు. ఇందులో వ్యూహాత్మక విరామం ఉంటుంది... ఎత్తుగడ మారుతుంటుంది... ఈ శైలే కారుకు విజయాన్నిచ్చింది. వివిధ సందర్భాల్లో  ఆయన ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా దానిని సమర్ధించుకునే సత్తా ఆయనకుంది.