In-Depth

కేంద్రంపై మరోసారి అవిశ్వాసం

Submitted by arun on Wed, 07/18/2018 - 10:17

ఏపీ విభజన హామీల అమలుకోసం కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవుతోంది టీడీపీ. మరోసారి అవిశ్వాస అస్త్రాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇప్పటికే అవిశ్వాసానికి మద్దతు తెలపాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు పలు పార్టీల నేతలని కోరారు. ఈ పక్షంలో ఈ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగున్నాయి.

అజార్ వెనక ఆయన హ్యాండ్ ఉందంటున్న సీనియర్లు

Submitted by arun on Tue, 07/17/2018 - 11:51

ఎన్నికల మాటేమోగానీ కాంగ్రెస్ లో అప్పుడే సీట్ల పంచాయతీ  మొదలైంది నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. మాజీ కెప్టెన్ అజారుద్దీన్  సికింద్రాబాద్ ఎంపీ స్థానం ఆశించడంతో చర్చ కాస్తా రచ్చగా మారింది.

డీఎస్ తనయుడితో భేటీ...డీఎస్ రాజకీయ భవిష్యత్తుపై చర్చ?

Submitted by arun on Tue, 07/17/2018 - 11:31

తెలంగాణలో ఒకరోజు పర్యటనలో బీజేపీ నేతలకు క్లాస్ పీకిన అమిత్ షా అసలెందుకొచ్చినట్లు? సీనియర్లను కాక కేవలం ఎంపిక చేసిన కొద్ది మందితో వ్యక్తిగత సమావేశాల వెనక ఎజెండా ఏంటి? హిందూత్వ ఎజెండా మోస్తున్న వారికే అమిత్ షా ప్రాధాన్యత ఇచ్చారా?

ముందస్తు ఎన్నికలంటేనే హడలెత్తిపోతున్న నేతలు...విపక్ష పార్టీల నేతలే కాదు...అధికార పార్టీ నేతలు....

Submitted by arun on Tue, 07/17/2018 - 11:07

ముందస్తు ఎన్నికల ప్రచారంతో పార్టీల్లో దడ మొదలైందా ? పార్టీ కేడర్‌‌ను కాపాడుకునేందుకు నేతలు తంటాలు పడాల్సి వస్తోందా ? తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీతో పాటు విపక్షాలకు కొత్త కష్టాలు మొదలయ్యాయా ? సభలు, సమావేశాలు నిర్వహించాలంటే నేతలు ఎందుకు వణికిపోతున్నారు ? ముందస్తు ఎన్నికలు రాకపోతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతలు పరిస్థితి ఏంటీ ? 

కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు

Submitted by arun on Tue, 07/17/2018 - 10:53

అంతర్గత ప్రజాస్వామ్యం కాసింత ఎక్కువగా కనిపించే కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు అత్యంత సాధారణం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు మరింత ఉధృతంగా కనిపిస్తుంటాయి. ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపించే నియోజకవర్గాల్లో హస్తం పాలిటిక్స్ హాట్‌ హాట్‌గా సాగుతాయి. తాజాగా గ్రేటర్‌తో పాటు భువనగిరి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశాల్లో అసమ్మతి నేతల హంగామాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 

చంద్రబాబును కలిసిన ఉండవల్లి

Submitted by arun on Tue, 07/17/2018 - 09:56

నిన్నమొన్నటివరకూ కత్తులు దూశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని మాటల తూటాలు పేల్చారు. అనేక లేఖలతో ప్రభుత్వం యుద్ధం ప్రకటించారు. చంద్రబాబు టార్గెట్‌గా ఎన్నోసార్లు విరుచుకుపడ్డారు. అలాంటి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సడన్‌గా చంద్రబాబును ఎందుకు కలిశారు?. ఎప్పుడూ చంద్రబాబుపై విరుచుకుపడుతూ జగన్‌కు సపోర్ట్‌ మాట్లాడే ఉండవల్లి అమరావతి టూర్ వెనుక కారణమేంటి? 

గోతులకు 3,597 మంది బలి

Submitted by arun on Mon, 07/16/2018 - 13:53

లక్షలు పోసి కొన్న వాహనాలు ఎన్నో సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అయినా యాక్సిడెంట్ లు జరుగుతాయి. తాగి వాహనాన్ని నడపరు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయరు అయినా ప్రాణాలు పోతున్నాయి. ఎదురుగా వాహనాలు రావు, అదుపు తప్పి ఏ చెట్టునూ ఢీ కొట్టరు అయినా ఆస్పత్రుల పాలవుతారు రహదారులపై పడిన గుంతలు నిండు జీవితాలను బలి తీసుకుంటున్నాయి దేశ వ్యాప్తంగా వేలల్లో ప్రమాదాలకు వందల్లో మరణాలుకు గుంతల రోడ్లు కారణమవుతున్నాయి.

యాత్ర ఆలస్యం కావడంతో అనేక కొత్త సమస్యలు

Submitted by arun on Mon, 07/16/2018 - 11:13

వైసీపీ అధినేత జగన్ చేపడుతున్న ప్రజాసంకల్పయాత్ర ఎప్పుడు పూర్తవుతుందనే విషయం అంతుపట్టకుండా ఉంది. జగన్ యాత్ర షెడ్యూల్ ప్రకారం కొనసాగకపోవడంతో నెలల తరబడి ఆలస్యం అవుతోంది. కోర్టు కేసులు, పండుగ బ్రేక్‌లతో పాటు ప్రతికూల వాతావరణం కూడా జగన్ యాత్రకు ఆటంకాలుగా మారాయి. ప్రజా సంకల్ప యాత్ర ఆలస్యం కావడం ఆ పార్టీకి మేలు చేస్తుందా ? కీడు చేస్తుందా అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 

టీఆర్ఎస్ ఎంపీ ఇంటికెళ్లిన టీడీపీ ఎంపీలు

Submitted by arun on Mon, 07/16/2018 - 10:40

కేంద్రంపై మరోసారి అవిశ్వాస అస్త్రం ప్రయోగించేందుకు టీడీపీ రెడీ అయ్యింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్రమోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టనుంది. మద్దతు కోసం బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు చంద్రబాబు 8 పేజీల లేఖ రాశారు. మద్దతు కూడగట్టే ప్రయత్నంలో టీడీపీ ఎంపీలు టీఆర్ఎస్ ఎంపీలను కలిసి తమకు సపోర్ట్ చేయాలని కోరారు.

500 సంవత్సరాలు పూర్తిచేసుకున్న గోల్కొండ కోట

Submitted by arun on Sat, 07/14/2018 - 17:27

గోల్కొండ.. ఈ పేరు చెబితే హైదరాబాద్ చరిత్ర గుర్తొస్తుంది. నవాబుల పాలన కళ్లముందు కనిపిస్తుంది. కోటలోకి అడుగు పెట్టగానే చేతులు చప్పట్లు కొట్టేస్తాయ్. కాళ్లు రామదాసు కారాగారం వైపు తీసుకెళ్తాయి. కళ్లు కోట పైనుంచి హైదరాబాద్ అందాలు చూసేందుకు ఉత్సాహం చూపుతాయి.  5 వందల ఏళ్లైనా చరిత్రకు సాక్ష్యంగా మన కళ్ల ముందే ఉన్న గోల్కొండపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్.