Just In

మంత్రి కాలువ ఇంటి వద్ద ఉద్రిక్తత

Submitted by arun on Mon, 10/15/2018 - 12:24

అనంతపురంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంటిని మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత కొద్ది కాలంగా నిరసన దీక్షలు చేస్తున్న పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మహిళా కార్మికులను బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చెలరేగింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడ్డారు. 

ఢిల్లీకి కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా...దాదాపు 70 స్థానాల్లో ఒకే వ్యక్తి పేరు ఖరారు

Submitted by arun on Mon, 10/15/2018 - 12:09

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఢిల్లీకి చేరింది. మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించిన భక్తచరణ్‌దాస్‌ నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ బృందం  హస్తిన వెళ్లింది. ఈ నెల 10 నుంచి 12 వరకు హైదరాబాద్‌లోనే మకాం వేసిన త్రిసభ్య స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు వందల మందితో జరిపిన చర్చలు, తమ వద్ద ఉన్న సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. తమకు వచ్చిన అంచనా మేరకు ఏ స్థానానికి ఏ అభ్యర్థి గెలుపుగుర్రమో నిర్ధారించిన జాబితాతో ఈ బృందం ఢిల్లీకి వెళ్లింది.

పీకే ఏకేస్తే.. ఎదురుగాలి ఉండదట...ఎదురుగాలికి తట్టుకునే గెలుపుగుర్రాలు

Submitted by arun on Mon, 10/15/2018 - 11:58

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై వైసీపీ అధినేత జగన్మోహన్‌‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అభ్యర్ధుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న జగన్‌ వీక్‌గా ఉన్నచోట నిర్ధాక్షిణ్యంగా నియోజకవర్గ ఇన్‍ఛార్జులను మార్చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మార్పులు చేర్పులు చేపట్టిన జగన్‌ ఇప్పుడు గుంటూరు జిల్లాపై ఫోకస్‌ పెట్టారు.

మహా కూటమి పొత్తుల్లో కొత్త ట్విస్ట్‌

Submitted by arun on Mon, 10/15/2018 - 11:35

మహా కూటమి పొత్తులో కొత్త కోణం వెలుగు చూసింది.  మిత్రపక్షాలను సాధ్యమైనంత వరకు తక్కువ స్ధానాలు ఇవ్వాలని భావిస్తున్న టీ కాంగ్రెస్ పొత్తులపై ఆచితూచి వ్యవహరిస్తోంది. అటు  భవిష్యత్‌కు ఢోకా లేకుండా ఇటు పొత్తులు విఛిన్నం కాకుండా తనదైన శైలిలో పావులు కుదుపుతుంది. తాజాగా  పొత్తుల్లో భాగంగా తెలంగాణ జనసమితికి ఇచ్చే సీట్ల విషయంలో ఎవరూ ఊహించని  ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.  టీజేఎస్‌ అభ్యర్థులు తమ పార్టీతో కాకుండా కాంగ్రెస్‌ బీఫారంపైనే పోటీ చేయాలంటూ ప్రతిపాదించింది. ఇందుకోసం ఆ పార్టీ కోరుకుంటున్న స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమంటూ పార్టీ కోర్‌కమిటీ  నిర్ణయించారు.

జనసేన కవాతు...రాజమండ్రి చేరుకున్న హైపర్ ఆది

Submitted by arun on Mon, 10/15/2018 - 11:17

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కవాతులో పాల్గొనేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పవన్ హార్డ్‌కోర్ ఫ్యాన్‌గా గుర్తింపు పొందిన హైపర్ ఆది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి చేరుకున్నారు. పవన్‌ చేపట్టిన ఈ యాత్రలో  కార్యకర్తలతో కలిసి పాల్గొంటానంటూ ఆది ప్రకటించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా జనసేనాని కాసేపట్లో భారీ కవాతు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ధవళేశ్వరం బ్రిడ్జీపై జనసేన కవాతు జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌...పార్టీ మారేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీ...

Submitted by arun on Mon, 10/15/2018 - 10:58

ఎన్నికల వేళ కారు జోరుకు సొంత పార్టీ నేతలే బ్రేకులు వేస్తున్నారు. రోజుకోకరు పార్టీకి బై కొట్టి కాంగ్రెస్‌కు జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ .. పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన సమయంలో కాంగ్రెస్‌లో ఆయన చేరనున్నారు. పార్టీని వీడేందుకు గల కారణాలు వివరించేందుకు మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  
 

కాంగ్రెస్‌లోకి గడ్డం బ్రదర్స్ ?

Submitted by arun on Mon, 10/15/2018 - 10:50

జి. వెంకట స్వామి కుటుంబం మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత గడ్డం వినోద్‌ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ సమక్షంలో రెండ్రోజుల్లో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిన్న తన అనుచరులతో సమావేశమైన వినోద్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నూర్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో అలకబూనిన వినోద్ మాజీ మంత్రినైన తనకు టీఆర్ఎస్‌లో కనీస గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Tags

యువతే లక్ష్యంగా టీఆర్ఎస్‌ ఎన్నికల ప్రచారం ...రంగంలో దిగిన...

Submitted by arun on Mon, 10/15/2018 - 10:29

పెట్టుబడి సాయంతో రైతులను, బతుకమ్మ చీరలతో మహిళల్లో ఆదరణ పొందిన టీఆర్ఎస్ యూత్‌ను ఆకట్టుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. కోడ్ అమల్లో ఉండటంతో  తాము గతంలో చేపట్టిన పథకాలను వివరిస్తూ కొత్త పంథాలో ముందుకు వెళుతోంది. ఏక కాలంలో బహుళ ప్రయోజనాలు పొందేలా అటు యూత్ ఇటు వీరి తల్లిదండ్రులను ఆకట్టుకునేలా క్షేత్రస్ధాయి ప్రచారం ప్రారంభించింది.   

మద్యం ప్రియులకు సూపర్ న్యూస్

Submitted by arun on Mon, 10/15/2018 - 10:17

ఎన్ని అనర్థాలు జరుగుతున్నా ఎన్ని విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ప్రభుత్వాలెన్ని మారినా మద్యపానాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నాయి. ఖజానాను నింపే మద్యం మాలక్ష్మీని వదిలిపెట్టేందుకు సర్కారు ససేమీరా అంటోంది. అంతేకాదు అదే మద్యంపై వచ్చే రాబడిని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనల్ని అన్వేషిస్తున్నాయి. అందులో భాగంగానే ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలకు మహారాష్ట్ర సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

ధవళేశ్వరం బ్రిడ్జిపై సేనాని కవాతు

Submitted by arun on Mon, 10/15/2018 - 10:07

జనసేన కదం తొక్కనుంది. జనసైనికులు పవన్ అడుగులో అడుగు వేయనున్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా.. జనసేనాని కాసేపట్లో భారీ కవాతు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ధవళేశ్వరం బ్రిడ్జీపై జనసేన కవాతు జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం దగ్గర గోదావరి నదిపై ఉన్న సర్‌ ఆర్థర్‌ కాటన్‌ విగ్రహం వరకు నిర్వహించనున్న ఈ కవాతు కోసం జనసేన సైనికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ కవాతులో 2 లక్షల మంది పవన్‌ అభిమానులు పాల్గొంటారని తెలుస్తోంది. స్థానికులతో పాటు.. వివిధ జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఫ్యాన్స్‌ తరలివస్తారని అంచనా వేస్తున్నారు.