Just In

గెలుపు గుర్రాలకే టికెట్లిస్తాం: ఉత్తమ్

Submitted by arun on Sat, 09/22/2018 - 17:33

ఆశావహుల నుంచి ధరఖాస్తులకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ విధించిన గడువు ఇవాళ్టితో ముగిసింది. ఇవాళ్టి వరకు మొత్తం వెయ్యీ 76 ధరఖాస్తులు వచ్చాయి. ఇవాళ్టినుంచి వాటిని పరిశీలించనున్నారు. ఆశావహుల సామాజిక, ఆర్థిక, స్థానిక బలాబలాలపై అంచనా వేస్తున్నారు. నేటి నుంచి అభ్యర్థుల స్క్రూటినీ చేయనున్నారు. నియోజకవర్గానికి ముగ్గురిని ఎంపిక చేసి.. స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నట్లు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ స్పష్టం చేశారు. సర్వే ఫలితాల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీట్ల సర్దుబాటు తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నామని ఉత్తమ్ తెలిపారు.
 

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

Submitted by arun on Sat, 09/22/2018 - 17:24

ఆదిలాబాద్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న అనూష అనే విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంజనీరింగ్‌ రెండో ఏడాది చదువుతున్న అనూష కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటూ ఆమె వద్ద లభించిన సూసైడ్‌నోట్‌ ద్వారా తెలుస్తోంది. అనూష స్వస్థలం సిద్దిపేట జిల్లా మండపల్లి అని కాలేజీ యాజమాన్యం తెలిపింది. విద్యార్థి ఆత్మహత్యకు మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.
 

విపక్షాలకు అస్త్రాలుగా మారిన హరీశ్ వ్యాఖ్యలు

Submitted by arun on Sat, 09/22/2018 - 17:06

నిన్న ఇబ్రహీంపూర్‌ సభలో పాల్గొన్న హరీష్‌రావు  ప్రజల ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల్లో నుంచి వైదొలగాలని అన్నారు. ఇప్పుడా వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రాలుగా మారాయి. హరీష్‌ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ టీఆర్ఎస్‌పై దాడి చేస్తున్నాయి. హరీష్‌ వాఖ్యలతో టీఆర్ఎస్‌లో ఇంటిపోరు మొదలైందంటూ రఘునందన్‌రావు లాంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఇబ్రహీంపూర్‌లో మాట్లాడిన హరీష్‌రావు స్ధానికుల స్పందన చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి ఆప్యాయత, అనురాగాల మధ్యే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందంటూ వ్యా‌ఖ్యానించారు.

రాఫెల్ డీల్‌పై రాజుకుంటున్న వివాదం...మోడీపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

Submitted by arun on Sat, 09/22/2018 - 16:54

రాఫెల్‌ ఒప్పందం విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై తన విమర్శనాస్త్రాలు సంధించారు. రాఫెల్‌ పేరుతో మోదీ, అనిల్‌ అంబానీలు రక్షణశాఖపై సర్జికల్‌ దాడులు చేశారని దుయ్యబట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే చేసిన వ్యాఖ్యలపై మోడీ ఇప్పటికైనా స్పందించాలని రాహుల్ డిమాండ్ చేశారు. యుద్ధ విమానాల ధరల విషయంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెబుతున్నారని రాహుల్ మండిపడ్డారు. ఈ స్కాంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు.   

స్వామి వర్సెస్ జేసీ బ్రదర్స్... ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు...ఎక్కడి నుంచి పోటీకి...

Submitted by arun on Sat, 09/22/2018 - 16:42

ప్రబోధానంద స్వామి రాజకీయ ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్నటి దాకా ఖాకీ వర్సెస్ జేసీ అన్నట్టు సాగిన రాజకీయం ఇప్పుడు స్వామి వర్సెస్ జేసీ బ్రదర్స్ అన్నట్టు మలుపు తిరిగింది. జేసీ సోదరులు కుట్ర పూరితంగా తమ ఆశ్రమంపై దాడి చేశారని ఆరోపిస్తూ స్వామి ఓ వీడియో విడుదల చేశారు. ఇక తానే స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..? ఎక్కడి నుంచి పోటీకి దిగుతారన్న దాన్నది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. 

హరీశ్‌రావుకు పొమ్మనలేక పొగబెడుతున్నారు: రఘునందన్ రావు

Submitted by arun on Sat, 09/22/2018 - 16:05

బీజేపీ నేత రఘునందన్ రావు అపధర్మ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో ఇంటి పోరు ప్రారంభమైందన్న ఆయన  హరీష్‌రావును పార్టీ నుంచి పంపలేక పొగబెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన 105 మంది జాబితాలో తొలి మార్పు సిద్ధిపేటలోనే జరుగుతుందన్నారు.  సిద్దిపేట నుంచి కేసీఆర్‌ పోటీ చేయాలని భావిన్నాడని ఆయన అన్నారు. కారు నాలుగు టైర్లలో ఒకటి పంక్ఛర్ అయిందన్న రఘునందన్ రావు స్టెప్నీగా ఉంటాడనే సంతోష్‌ను రాజ్యసభకు పంపారంటూ వ్యాఖ్యానించారు.  

వెంకటేష్ కూతురు ప్రేమ పెళ్లి చేసుకోబోతోందా!

Submitted by arun on Sat, 09/22/2018 - 14:55

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి అని సమాచారం. వెంకటేష్ కుమార్తె ఆశ్రిత వివాహం త్వరలోనే జరగనుందని ఫిల్మ్ నగర్ టాక్. కుమార్తె ఆశ్రిత ప్రేమకు వెంకటేష్ పచ్చ జెండా ఊపాడట. తనకు పరిచయం ఉన్న యువకుడితో ఆర్షిత ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కూతురు ఆశ్రిత బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా శిక్షణ తీసుకుంది. ఆమె ఓ ప్రముఖుడి కుమారుడిని ప్రేమించిందని తెలుస్తోంది. వారిద్దరి మధ్య చదువుకునే రోజుల నుంచి స్నేహం ఉందట. అది కాస్తా ప్రేమగా అనంతరం పెళ్లిగా మారినట్టు తెలుస్తోంది.

పరువు హత్య పోస్టర్...సోని, రాహు ప్రియ...

Submitted by arun on Sat, 09/22/2018 - 14:34

విజయవాడ సత్యనారాయణపురంలో వెలసిన పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. నగరంలోని సత్యానారాయణపురం శివాలయం వీధిలో  సోని, రాహు ప్రియ త్వరలో పరువు హత్యకు గురికానున్నారంటూ పోస్టర్లు వెలిశాయి. సత్యనారాయణపురంలో వెలసిన ఈ పోస్టర్లు స్థానికులను భయపెట్టే ఉద్దేశంతోనే వేశారని స్థానికులు భావిస్తున్నారు. అయితే, పోస్టర్లలో ఉన్న సోని, రాహు ప్రియ ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాహు ప్రియ ఎవరు? ఏ సమయంలో పోస్టర్లు వేశారు? సీసీకెమరాల్లో రికార్డయిందా?  అని ఆరా తీస్తున్నారు.

సీఎం కేసీఆర్‌కు గుడి కట్టిన కానిస్టేబుల్

Submitted by arun on Sat, 09/22/2018 - 14:11

సీఎం కేసీఆర్‌పై అభిమానంతో ఏకంగా ఆయనకు గుడినే కట్టేశారు నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన గోగుల శ్రీనివాస్‌. కేసీఆర్‌ అంటే తమకెంతో అభిమానమని చెబుతున్నారు శ్రీనివాస్‌. కానిస్టేబుల్‌గా పనిచేసే శ్రీనివాస్‌ సొంత ఖర్చులతో తన అభిమాన నేతకు గుడికట్టించాడు. సుమారు రెండు లక్షల రూపాయల ఖర్చుతో తన ఇంటి పక్కనే కేసీఆర్ కు గుడిని నిర్మించాడు. ఖమ్మం జిల్లా కల్లూరులో 25 వేలతో కేసీఆర్‌ విగ్రహాన్ని తయారు చేయించాడు శ్రీనివాస్. కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు.. అన్ని వర్గాలకూ మేలు చేస్తున్నాయని చెప్పాడు.

పోలీసులపై జేసీ వ్యాఖ్యలు అనుచితం : హోంమంత్రి

Submitted by arun on Sat, 09/22/2018 - 13:45

ఖాకీ వర్సెస్‌ ఖద్దర్‌గా మారిన తాడిపత్రి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా జేసీ, పోలీసుల వ్యాఖ్యలపై హోం మంత్రి చిన రాజప్ప స్పందించారు. పోలీసులపై జేసీ వ్యాఖ్యలు అనుచితం అని వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థపై దివాకర్‌రెడ్డి తీరు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్న హోంమంత్రి.. ఒక ఎంపీగా ఉండి ప్రభుత్వ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. ఇటు నాలుకలు కోస్తామంటూ ఆవేశంగా మాట్లాడిన పోలీసు సంఘం తీరును కూడా ఆయన తప్పుబట్టారు. వారి వ్యాఖ్యలు కూడా సమర్థనీయం కాదన్న చిన రాజప్ప రాష్ట్రంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వివరించారు.