babu mohan

...అయినా నా గాడ్‌ఫాదర్‌ కేసీఆరే

Submitted by arun on Fri, 10/12/2018 - 12:00

ఆందోల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌. సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. 25 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా బ్రతికానని, ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా... ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించలేదంటూ వాపోయారు. తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కేసీఆర్‌... ఇప్పుడు నడి రోడ్డుపైన వదిలేశారని అన్నారు. తన సేవలను బీజేపీ గుర్తించిందని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు బాబూ మోహన్‌. తప్పు చేస్తే క్షమించాలని, ఎప్పటికైనా కేసీఆరే తన గాడ్‌ఫాదర్‌ అని తెలిపారు.

Tags

టీఆర్‌ఎస్‌కు షాక్‌.. బీజేపీలో చేరిన బాబుమోహన్‌!

Submitted by arun on Sat, 09/29/2018 - 17:54

టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్‌ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన బాబుమోహన్ బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టికెట్ దక్కకపోవడంతో బాబుమోహన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

టీఆర్ఎస్‌కు మరో ఝలక్‌ ...పార్టీని వీడేందుకు సిద్ధమైన తాజా మాజీ ఎమ్మెల్యే

Submitted by arun on Sat, 09/29/2018 - 11:29

ఎన్నికల వేళ టీఆర్ఎస్‌కు తాజా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ఊహించని ఝలక్ ఇచ్చారు. పార్టీ టికేట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో  టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ చేరుకున్న ఆయన కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో చేరనున్నారు.  

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఇంటి నల్లా కనెక్షన్‌ కట్‌..!

Submitted by arun on Sat, 08/18/2018 - 08:58

గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నల్లా కనెక్షన్ల బండారం బయటపడుతోంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న కొందరు బడా బాబులు జలమండలికి చిల్లి గవ్వ చెల్లించకుండా దొడ్డిదారిన ఏళ్ల తరబడి మంచినీళ్లు తోడేస్తున్నారు. దొంగ చాటున కనెక్షన్లు తీసుకున్న వారిలో సినీ, వ్యాపార, రాజకీయ నాయకులున్నారు. వీరందరిపై జలమండలి కేసు నమోదు చేసింది.