Fornication Relationship

మేనత్తతో వివాహేతర సంబంధం.. మేనల్లుడిని గొడ్డలితో నరికి చంపిన మామ

Submitted by arun on Tue, 09/25/2018 - 17:12

వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. ఈసంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం నారాయణపురం గ్రామ శివారు కొత్తతండాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కురవి ఎస్సై నాగభూషణం తెలిపిన ప్రకారం... కొత్తతండాకు చెందిన బానోత్‌ భద్రు, మాలోతు లింగన్న(24)  మామ అల్లుళ్లు. భద్రు కు పదేళ్లక్రితం ఖమ్మం జిల్లాకు చెందిన నాగమణితో వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నా డు. భద్రు మేనల్లుడు మాలోత్‌ లింగన్న నాగమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

వివాహేతర సంబంధం...భార్య తల నరికిన భర్త

Submitted by arun on Tue, 09/11/2018 - 13:27

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో ఓ భర్త ఆమె తల నరికి పోలీసుల ఎదుట లొంగిపోయిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. అజ్జంపుర ప్రాంతంలో సతీశ్, రూప దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ 9 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గతంలో డ్రైవర్ గా పనిచేసిన సతీశ్ ఇటీవల అజ్జంపురలోని శివణిలో చికెన్ షాప్ తెరిచాడు. ఈ నేపథ్యంలో రూప(28) ఇదే ప్రాంతానికి చెందిన సునీల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు భర్త సతీశ్ హెచ్చరించినా రూప ప్రవర్తనలో మార్పు రాలేదు. కుటుంబ సభ్యులు, పెద్దలు రాజీ కుదర్చినా ప్రయోజనం లేకపోయింది.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..

Submitted by arun on Tue, 09/11/2018 - 12:06

హైదరాబాద్‌లో ఓ కసాయి తల్లి తన కన్న కూతురి పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తుందనే కారణంతో కన్న కూతురుకి నరకం చూపించింది. కసాయి తల్లి క్రూరత్వాన్ని గమనించిన స్థానికులు ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సుధీర్ రెడ్డి బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి పాపను కాపాడారు. కసాయి తల్లి సరితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ దేవెందర్ తెలిపిన కథనం ప్రకారం... నల్గొండ మోత్కూర్‌కు చెందిన ముఖావలి సరిత(25)కు నల్గొండకు చెందిన వెంకన్న యాదవ్‌తో ఏడేళ్లక్రితం వివాహం జరుగగా, వారికి పాప (రేణుక)జన్మించింది.

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

Submitted by arun on Wed, 08/15/2018 - 15:51

ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు.  కొంత కాలం బాగానే ఉన్నారు.  అయితే  వివాహేతర సంబంధం భార్య,భర్తల మధ్య చిచ్చు రేపింది.  ఈ విషయమై తరచూ గొడవలకు దిగేవారు. అయితే ఈ విషయమై పెద్దలు రాజీ కుదిర్చారు. నిద్రమాత్రలిచ్చి మరో వ్యక్తితో తన భార్య రాసలీలలకు పాల్పడుతోందనే నెపంతో రాంబాబు అనే వ్యక్తి తన భార్యను రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకొంది.ఏలూరు పత్తేబాద రాఘవాచారి వీధిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న తాళ్లూరి రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ప్రే మించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరిది లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెం.

తాత్కాలిక మోజు... అనుబంధానికి బూజు...అంతరించిపోతున్న మానవతా విలువలు

Submitted by arun on Fri, 08/10/2018 - 11:20

తాత్కాలిక ఆనందం కోసం వేదమంత్రాలు సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తలనే భార్యలు కడతేరుస్తున్నారు. ప్రియుడు మోజులో పడి చేసిన బాసలు మరచిపోతున్నారు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కర్కశంగా చంపేస్తున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు, పిల్లలకు దూరమై పోతున్నారు.