Shilpa suicide case under CID

శిల్ప కేసులో సీఐడీ

Submitted by arun on Thu, 08/09/2018 - 17:41

తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని శిల్ప ఆత్మహత్య కేసులో స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది. సీఐడీ డీఎస్పీ జీవీ రమణ ఆధ్వర్యంలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లతో ఏర్పాటైన బృందం దర్యాప్తు ప్రారంభించింది. శిల్ప ఆత్మహత్య కేసును సిట్ పలు కోణాల్లో విచారిస్తోంది. ఎస్వీ మెడికల్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థి సంఘ నేతలు, శిల్ప స్నేహితులు, యూజీ, పీజీ విద్యార్థులను పిట్ ప్రశ్నిస్తోంది. శిల్ప చనిపోవడానికి కారణమెవరు..లైంగిక వేధింపుల్లో ఎవరెవరి ప్రమేయం ఉంది..ముగ్గురు అధ్యాపకులపై విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత అనే కోణాల్లో సీఐడీ దర్యాప్తు చేస్తోంది.