Krishnudu

వైసీపీలో చేరిన మరో సినీ నటుడు

Submitted by arun on Mon, 08/06/2018 - 13:08

వైసీపీకి సినీ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే  పలువురు సినీ నటులు వైసీపీకి మద్దతు పలకగా.. మరో సినీ నటుడు కృష్ణుడు కూడా ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. కాగా..జగన్‌ పాదయాత్రకు ఆకర్షితుడై సినీ నటుడు కృష్ణుడు వైసీపీలో చేరారు.