ex cm son ramkumareddy meets ys jagan today

జగన్ ను కలిసిన మాజీ సీఎం కొడుకు

Submitted by nanireddy on Sun, 08/05/2018 - 12:39

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీలలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే వైసీపీనుంచి టీడీపీలోకి కొంతమంది నేతలు వెళ్లిపోయారు. తాజాగా వైసీపీ అధినేత వైయస్ జగన్ ను మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి కలిశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజక వర్గంలో జగన్ ను కలిసిన అయన వైసీపీలో చేరికపై చర్చించారు. కాగా నిన్న (శనివారం) రామ్ కుమార్ రెడ్డిని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు కన్నా లక్ష్మీనారాయణ. తాజగా వైసీపీ అయన  అధినేతను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రామ్ కుమార్ రెడ్డి ఇటీవల  తన కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ మారడంపై చర్చించారు.