Gaddar

జీవితంలో తొలిసారి ఓటేసిన గద్దర్

Submitted by arun on Fri, 12/07/2018 - 13:09

ప్రజాయుద్ధ నౌక గద్దర్ తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ లోని పోలింగ్ బూత్ లో ఆయన ఓటేశారు. తన జీవితంలో తొలిసారి ఓటు వేశారు ప్రజా గాయకుడు గద్దర్. తన సతీమణితో కలిసి ఆల్వాల్‌లోని వెంకటాపురంలో గద్దర్ ఓటు వేశారు. ఓటు వేయడానికి వచ్చిన సమయంలో గద్దర్ చేతిలో అంబేద్కర్ ఫొటో ఉండటం విశేషం. 70 ఏళ్ల గద్దర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. గతంలో భువనగిరిలో బ్యాంక్ ఉద్యోగిగా చేసే సమయంలో మావోయిస్ట్ పార్టీలో చేరిన గద్దర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన ఓటు హక్కును ఎప్పుడూ వినియోగించుకోలేదు.

‘పొడుస్తున్న పొద్దు మీద’ అంటూ మేడ్చల్ సభను హోరెత్తించిన గద్దర్

Submitted by chandram on Fri, 11/23/2018 - 20:01

పొడుస్తున్న పొద్దుమీద అంటూ తెలంగాణ ఉద్యమాన్ని త‌న పాట‌తో శిఖరాగ్రానికి తీసుకు వెళ్లిన ప్రజా గాయ‌కుడు, యుద్దనౌక గ‌ద్దర్.  పోడుస్తున్న పాట విన్న ప్రతిఒక్కరిలో  రక్తం ఉరుకలైపారింది. నేడు సోనియా రాకతో మేడ్చల్  మొత్తం కాంగ్రెస్ మాయంగా మారింది. కాంగ్రెస్ సభకు జనసంద్రోహాంగా తరలివచ్చారు.  సభ ప్రాంగణం మేత్తం కాంగ్రెస్ కార్యకర్తలతో కోలహాలంగా మారింది. ఈ సందర్భంలో ప్రజాయుద్దనౌక సభ ప్రాంగణం ఎక్కి ప్రసంగంతోనే పొడుస్తున్న పొద్దు పాట మొదలు పెట్టాడు దింతో ఒక్కసారిగా సభ ప్రాంగణం ఈలలు, చప్పట్లతో సభను హోరెత్తించారు. కాలాన్ని బంధించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. 
 

గద్దర్ ను గందరగోళంలో పడేసిన కాంగ్రెస్

Submitted by chandram on Tue, 11/20/2018 - 14:43

పొడుస్తున్న పొద్దుమీద అంటూ తెలంగాణ ఉద్యమాన్ని త‌న పాట‌తో శిఖరాగ్రానికి తీసుకు వెళ్లిన ప్రజా గాయ‌కుడు, యుద్దనౌక గ‌ద్దర్. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ పరిస్థితి అయోమయంలో పడిపోయిందనే చెబుతున్నారు. ఈ ఎన్నికల బరిలో దిగాలని ప్రయత్నించినప్పటికి ఫలితం దక్కలేదని అర్థమౌతుంది. కాగా గద్దర్ తనయుడు సూర్యం బెల్లంపల్లి నుండి శాసనసభ అభ్యర్ధిగా పోటీ చేయాలని చూసినా కాంగ్రెస్ మాత్రం మహాకూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించింది. కాగా ఇటు గద్దర్ కు,కుమారుడికి అన్యాయం జరిగిందనే భావనలో గద్దర్ ఉన్నట్లు విశ్లేశకులు చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ తో గద్దర్ మంతనాలు జరిపిన ఫలితం దక్కలేదు.

కెసిఆర్ పై గద్దర్ పోటీ...

Submitted by arun on Thu, 11/08/2018 - 14:42

ఆపద్ధర్మ సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రజా యుద్ధనౌక గద్దర్‌ స్ఫష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీకి మద్దతు దారుడిని కాదని, రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. వారితో జరిగిన సమావేశంలో 45 నిమిషాలూ పాట పాడి వినిపించానని, అంతే కాకుండా రాహుల్‌కు ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌ సేవ్‌ డెమొక్రసీ’ గురించి వివరించానని అన్నారు. ఢిల్లీలో సీఐడీ అడిషినల్‌ డీజీని కలిసి తనకు రక్షణ  కల్పించాలని కోరానని, సీఈఓకు కూడా వినతిపత్రం సమర్పించానని వెల్లడించారు.

ఖద్దర్‌ వేసుకుంటా... ఖబడ్దార్‌ అంటున్న గద్దర్

Submitted by santosh on Sat, 10/13/2018 - 16:03

ప్రజా గాయకుడు గద్దర్ యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగినా...అది అబద్ధమని ఆయన తేల్చి చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్‌ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. భార్య, కుమారుడితో సహా రాహుల్‌‌ని కలిశారు. కాంగ్రెస్ నేతలు మధు యాష్కీ, కొప్పుల రాజుతో పాటు రాహుల్‌తో సమావేశమయ్యారు. తర్వాత కొద్దిసేపటికే యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాతో కూడా గద్దర్ కుటుంబం భేటీ అయ్యింది.

Tags

కేసీఆర్‌పై గద్దర్‌ పోటీ..!

Submitted by arun on Sat, 10/13/2018 - 10:32

రాహుల్ గాంధీతో భేటీ తర్వాత ప్రజా గాయకుడు గద్దర్....కాంగ్రెస్‌లో చేరే అంశంపై వివరణ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.. ఢిల్లీలో బుర్జువా పాలన కొనసాగుతోందనీ.. దాని అంతానికే రాహుల్ ‌ను కలిశానని చెప్పారు. సెక్యులర్ పార్టీలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటానన్న గద్దర్..మిగిలిన లౌకిక పార్టీల నేతలను కూడా కలుస్తానని తెలిపారు. ఒకవేళ అన్ని పార్టీలు కోరితే గజ్వేల్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు గద్దర్‌. గద్దర్ ఢిల్లీ బాట పట్టిన వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే రాహుల్‌తో భేటీ తర్వాత గద్దర్ తన రాజకీయ ప్రవేశం గురించి స్పష్టత ఇచ్చారు.

కాంగ్రెస్‌లోకి ప్రజా యుద్ధనౌక ..?

Submitted by arun on Fri, 10/12/2018 - 10:40

ప్రజాగాయకుడు గద్దర్ నేడు ఢిల్లీలో రాహుల్ తో భేటీకానున్నారు. గద్దర్ కుటుంబాన్ని మధుయాష్కీ ఢిల్లీకి తీసుకెళ్లారు. గద్దర్ కుమారుడు ఇటీవలే కాంగ్రెస్ లో చేరడంతో ఇప్పుడు గద్దర్ కూడా హస్తం గూటికి చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, గద్దర్ మాత్రం మద్దతు తెలిపేందుకే రాహుల్ ను కలుస్తున్నానని తెలిపారు. రాహుల్ సమక్షంలో గద్దర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డ గద్దర్ రానున్న ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నానని చెప్పారు. మహాకూటమి తరుపున తనకు సీటు ఇస్తే గజ్వేల్ నుంచి కేసీఆర్ పై పోటీకి సిద్ధమని చెప్పారు.

గులాబీ కంచుకోటపై గద్దర్ గురి!

Submitted by santosh on Tue, 10/09/2018 - 12:11

ఒకప్పుడు ఆయన ఓటును బహిష్కరించాడు. ఆయుధంతోనే అణగారిన వర్గాలకు విముక్తి అని నమ్మాడు. కాలికి గజ్జకట్టాడు. విప్లవ గీతమై జనాన్ని చైతన్యం చేశాడు. ఆటతో, పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించాడు. ఒకనాడు ఓటు వద్దన్నా ఆయనే, ఇప్పుడే అదే ఓటు వజ్రాయుధమని చెబుతున్నాడు. ప్రజాస్వామ్య రణక్షేత్రమైన ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. ఏకంగా సీఎం కేసీఆర్‌పైనే పోటీకి సై అంటున్నాడు. గులాబీదళాధిపతి వర్సెస్‌ ప్రజాయు‌ద్ధ నౌక పోరుతో, గజ్వేల్‌ నియోజవర్గంపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. 

కేసీఆర్‌పై పోటీకి సై అంటున్న ప్రజా గాయకుడు గద్దర్‌...

Submitted by arun on Mon, 10/08/2018 - 15:18

ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై పోటీకి సై అంటున్నారు ప్రజా నాయకుడు గద్దర్‌.  ఇందుకోసమే గజ్వేల్ నియోజకవర్గంలో ఓటర్‌గా నమోదు చేసుకున్నానని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన కూటమి ద్వారా తనకు అవకాశం కల్పిస్తే పోటీకి సిద్ధమంటూ ప్రకటించారు. సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసిన ఆయన గజ్వేల్‌లో ఓటు నమోదు చేసుకున్నట్టు వివరించారు. 
 

భట్టి విక్రమార్కతో గద్దర్ భేటీ

Submitted by arun on Sat, 09/29/2018 - 14:04

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కతో ప్రజా గాయకుడు గద్దర్ భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క నివాసానికి వచ్చిన ఆయన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ...తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని, ఏ ఆశయాలు, లక్ష్యాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని చేరుకునేందుకు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉందని విక్రమార్క పేర్కొన్నారు. పొడుస్తున్న పొద్దుమీద కదులుతున్న కాలమా.. పోరు తెలంగాణమా... అన్న గీతంలోని లక్ష్యాలను చేరుకుందామని విక్రమార్క అన్నారు.