hyderabad

ఆరెంజ్ ట్రావెల్స్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

Submitted by arun on Wed, 06/20/2018 - 11:02

కుత్బుల్లాపూర్ సుచిత్ర సర్కిల్‌లోని ఆరెంజ్ ట్రావెల్స్‌లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్‌లో చెలరేగిన మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆరెంజ్ ట్రావెల్స్‌లోని బస్సుల గ్యారేజిలో షాట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాద సమయంలో బస్సులు ఏవీ లేకపోవడంతో ఆస్తి నష్టం జరుగలేదు.
 

కవలల హత్య కేసులో మరో మలుపు

Submitted by arun on Mon, 06/18/2018 - 13:23

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం స్పష్టించిన కవల పిల్లల హత్య కేసులో తల్లిదండ్రుల ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. ఫోన్ కాల్స్‌తో పాటు వాట్సప్‌, మెసేంజర్ పరిశీలించిన పోలీసులు ఈ విషయంలో తల్లిదండ్రులకు సంబంధం లేదని గుర్తించారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్నందునే ఇద్దరు పిల్లలను హత్య చేసినట్టు మేనమామ మల్లికార్జున రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు.  పిల్లల కోసం తన కుటుంబంలో కలహాలు కూడా వచ్చాయని ఇవన్నీ భరించలేకే హత్య  చేసినట్టు పోలీసులకు  వాంగ్మూలమిచ్చాడు.  దీంతో మల్లికార్జున రెడ్డి ఐపీసీ 302తో ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 

కవలల మర్డర్ కేసులో మలుపు

Submitted by arun on Sat, 06/16/2018 - 11:25

కవల పిల్లల మర్డర్‌  ప్లాన్‌ ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది.  పిల్లలను హత్యచేసిన  మామ మల్లికార్జున రెడ్డిపై తల్లిదండ్రులు కేసు పెట్టకపోవడంతో  హత్య విషయంలో వీరి పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  హాస్టల్‌లో జాయిన్‌ చేయిస్తానని ..మిర్యాలగూడ నుంచి  హైదరాబాద్‌కు  వచ్చిన మేనమామ  పిల్లలను తీసుకువెళ్లడం వెనుక ఉన్న మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు. నిజంగా పిల్లల మానసిక స్థితి బాగాలేదనే మేనమామ హత్య చేశాడా... లేక తల్లిదండ్రులు చంపేయించారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.అయితే గొంతు నులిమి  హత్య చేశాడా... లేక విషం ఇచ్చి చంపాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఘోరం: మేనమమే కాలయముడై..

Submitted by arun on Sat, 06/16/2018 - 10:49

మేనమామే ఆ చిన్నారుల పాలిట కాలయముడయ్యాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కనికరం లేకుండా ప్రవర్తించాడు. స్వయాన అక్క బిడ్డలైన కవలలను దారుణంగా చంపేశాడు. ఈ కిరాతకానికి పాల్పడిన నిందితుడు తర్వాత మృతదేహాలను మాయం చేసేందుకు కారులో తరలిస్తుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.  సినిమా ట్విస్టులను తలపించే రీతిలో జరిగిన ఈ క్రైమ్‌స్టోరితో  హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

హైదరాబాద్‌లో మళ్లీ చెడ్దీ గ్యాంగ్‌ కదలికలు

Submitted by arun on Mon, 06/11/2018 - 15:00

హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్‌ కదలికలు  కలవరపెడుతున్నాయి. బాచుపల్లిలోని నిజాంపేట్‌ బండారి లే అవుట్‌ సమీపంలో సంచరించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ అపార్ట్‌మెంట్‌ సమీపంలో అనుమానంగా తిరుగుతున్నట్లు గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.  ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు అక్కడ లభించిన ఆధారాల ప్రకారం విచారణ చేపట్టారు. అయితే ఎలాంటి దొంగతనం జరగకపోవడంతో అందరూ  ఊపిరిపీల్చుకున్నారు.

ఫేస్‌బుక్, స్వీట్ పాన్ చీటింగ్ కేసులో కొత్త ట్విస్ట్

Submitted by arun on Mon, 06/11/2018 - 12:36

హైదరాబాద్ ఫేస్‌బుక్ చీటింగ్ కేసులో.. కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. ఈ వ్యవహారంలో నిందితుడు ఉపేంద్రవర్మ సోదరుడు.. సురేంద్ర వర్మ బాంబ్ పేల్చారు. తమపై ఫిర్యాదు చేసిన అమ్మాయికి.. ఇంతకుముందే చాలామంది అబ్బాయిలతో సంబంధం ఉందని ఆరోపిస్తూ.. అందుకు తగ్గ ఆధారాలను కూడా బయటపెట్టారు. తన తమ్ముడు ఉపేంద్రవర్మను వదిలేయడానికి.. కోటి డిమాండ్ చేసిందని చెప్పారు. దీంతో.. ఈ కేసు ఇప్పుడు ఏ టర్న్ తీసుకోబోతుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

సీఎం కేసీఆర్ కోర్టులో ఆర్టీసీ కార్మికుల సమ్మె

Submitted by arun on Sat, 06/09/2018 - 18:44

తెలంగాణ ఆర్టీసీ బస్సు స్టీరింగ్.. ఇప్పుడు సీఎం కేసీఆర్ చేతిలో ఉంది. దానిని సమ్మె వైపు తిప్పుతారా.. లేక.. కార్మికసంఘాల డిమాండ్ల వైపు తిప్పుతారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఆర్టీసీ యూనియన్ల ప్రతిపాదనలను మంత్రుల కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి కేసీఆరే తీసుకోనున్నారు.

పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు : కేటీఆర్

Submitted by arun on Sat, 06/09/2018 - 15:36

పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా.. మెరుగైన వైద్యం అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని.. మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని ఐపీఎం క్యాంపస్‌లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్‌ను మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించామన్న కేటీఆర్.. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 40 నుంచి 50 శాతం పెరిగిందన్నారు. ఇటు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్  ఏర్పాటు.. వైద్య చరిత్రలోనే ఓ మైలురాయిగా.. వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. విద్యార్థి దుర్మరణం

Submitted by arun on Sat, 06/09/2018 - 12:29

హైదరాబాద్ రాయదుర్గం చౌరస్తాలో కారు బీభత్సం సృష్టించింది. ఫిల్మ్‌ నగర్  నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు.. JRC దగ్గర డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరొకరికి తీవ్రగాయాలు 

వీడిన యువతి ఆత్మహత్య కేసు మిస్టరీ

Submitted by arun on Tue, 06/05/2018 - 16:27

హైదరాబాద్ అబిడ్స్‌లో ఆత్మహత్య చేసుకున్న యువతి మిస్టరీ వీడింది. నీట్‌ పరీక్షలో అర్హత సాధించలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మయూరి కాంప్లెక్స్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతిని కాచిగూడకు చెందిన జస్లిన్‌ కౌర్‌గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్‌ టీమ్ వివరాలు సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.