Editorial

జియోఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

Submitted by arun on Wed, 01/17/2018 - 14:38

రిలయన్స్‌ జియో ఫోన్‌ యూజర్లకు ఆ కంపెనీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. జియోఫోన్‌కు చెందిన 153 రూపాయల ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.  ఇప్పటి వరకు ఈ ప్యాక్‌లో కస్టమర్లకు రోజుకు 500 ఎంబీ డేటా మాత్రమే లభించగా, ఇప్పుడు దాన్ని జియో 1జీబీకి పెంచింది. దీంతో రూ.153 ప్లాన్‌ను వాడే జియో కస్టమర్లు 28 రోజులకు గాను రోజుకు 1జీబీ డేటా చొప్పున 28 జీబీ డేటాను వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్, ఫ్రీ జియో యాప్స్ యథావిధిగా లభిస్తున్నాయి. అలాగే రూ.149 ప్లాన్‌కు కూడా రూ.153 ప్లాన్ బెనిఫిట్స్‌ను అందిస్తున్నారు.

దౌత్య యుద్ధంలో మనదే విజయం

Submitted by lakshman on Sun, 09/24/2017 - 15:51
భారత్ - పాకిస్థాన్... ఈ రెండు దేశాలు 1947లో వేరు పడినప్పటి నుంచి రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతూనే వస్తోంది. ఒకసారి యుద్ధం, మరోసారి దాదాపు చిన్నపాటి యుద్ధం లాంటి కార్గిల్ ఘటన, ఇంకోసారి సర్జికల్ స్ర్టైక్స్.. ఇలా తరచూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్.. రెండు దేశాలతోనూ...

ర్యాంకుల వెంట సర్కారు పరుగులు!

Submitted by lakshman on Fri, 09/22/2017 - 15:39
మన దేశంలో ఐఐటీలు, ఐఐఎంలే ఇప్పటి వరకు అతిపెద్ద స్థాయి విద్యా సంస్థలు. ఇంజనీరింగ్, ఎంబీయే లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివితే వీటిలోనే చదవాలన్న యాంబిషన్ చాలామందిలో కనిపిస్తుంది. అయితే వీటిని తలదన్నేలా సరికొత్తగా...
Tags

మరో ప్రచ్ఛన్నం

Submitted by lakshman on Thu, 09/21/2017 - 20:16

ఉత్తర కొరియా రూపంలో అమెరికాకు నేడు మరో విలన్ దొరికింది. ప్రచండ తుపానులతో అతలాకుతలమవుతున్న అమెరికాలోని న్యూయార్క్  నగరంలో మంగళవారం నాడు  జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ప్రారంభ సమావేశంలో ఉత్తర కొరియాపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన తొలిసారి ప్రసంగంలో చండ్రనిప్పులు చెరిగారు. అణు విధానంపై ఉత్తర కొరియా తన వైఖరిని మార్చుకోకపోతే విధ్వంసం  తప్పదని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలపై దురాక్రమణ పూరిత యుద్ధాలు చేసిన అమెరికా, ఆ తర్వాత ఇరాన్, సిరియా దేశాలను విలన్‌లుగా చిత్రీకరిస్తూ  ప్రచారం చేసింది.

తమిళనాట ఉత్కంఠ

Submitted by lakshman on Wed, 09/20/2017 - 17:08
తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ అమితాసక్తికరంగా తయారయ్యాయి. గత డిసెంబర్‌లో ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి క్రమంగా ముదిరి  పరాకాష్ఠకు చేరింది. తమిళనాడులో టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన అన్నాడిఎంకే వర్గం ఎమ్మెల్యేలు 18 మందిని అనర్హులుగా ప్రకటిస్తూ...

అన్నదాతలకు ఆసరా ఏదీ?

Submitted by lakshman on Wed, 09/20/2017 - 16:55

రైతే దేశానికి వెన్నెముక అని అంటారు. కానీ ఇప్పుడా వెన్నెముకే విరిగిపోతోంది. రైతుకు కనీస ఆదాయం కూడా ఉండటం లేదు. పదిమందికీ అన్నం పెట్టే రైతన్న తాను రోజుకు మూడు పూట్లా నాలుగు వేళ్లు నోట్లో పెట్టుకోలేకపోతున్నాడు. పిల్లలకు సరైన చదువులు చెప్పించే పరిస్థితి కూడా ఉండట్లేదు. ఆరుగాలం కష్టపడి పొలంలో ఎండనక, వాననక, పగలనక, రేయనక నిరంతరాయంగా కష్టపడినా దానికి తగిన ఫలితం రావడం లేదు. గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదు. ప్రపంచంలో ఏ వస్తువు తయారు చేసేవాళ్లయినా దాని ఉత్పత్తి కోసం అయిన ఖర్చు, పన్నులు, రవాణా, నిల్వ, మార్కెటింగ్.. వీటన్నింటితో పాటు తమ లాభాలు కూడా వేసుకుని ఆ ధరకు అమ్ముతారు.

రోహింగ్యా సంక్షోభం

Submitted by lakshman on Tue, 09/19/2017 - 22:20

మయన్మార్‌  రోహింగ్యాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అంగ్‌ సాన్‌ సూకీ పాలనలో గతంలో ఎన్నడూలేని స్థాయిలో మయన్మార్‌ సైన్యం వారిౖపె విరుచుకుపడి మారణహోమం సృష్టిస్తోంది. ప్రాణభీతితో దేశాల సరిహద్దులు దాటి పరిగెడుతున్నారు. రోహింగ్యా శరణార్థులకు రక్షణ కల్పించమని యూఎన్‌హెచ్‌సీఆర్‌ భారత్‌ను కోరింది. ఆశ్రయం కల్పించమని రోహింగ్యా శరణార్థులు సుప్రీంకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై దేశంలో అనుకూల, ప్రతికూల వాదనలు తలెత్తార¬.

అమావాస్య చంద్రుడు.. పౌర్ణమి చంద్రుడు

Submitted by lakshman on Tue, 09/19/2017 - 22:06
చంద్రుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మారుతుంటాడు. పౌర్ణమి తర్వాత నుంచి క్రమంగా క్షీణిస్తూ చివరకు అమావాస్య నాటికి పూర్తిగా కనిపించకుండాపోతే.. అమావాస్య తర్వాత మాత్రం దినదినాభివృద్ధి చెందుతూ...

వాయుసేన అమ్ములపొదిలో కొత్త అస్త్రం!

Submitted by lakshman on Mon, 09/18/2017 - 22:05
భారత వైమానిక దళం (ఐఎఎఫ్) అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మిస్సైల్ ఇది. ఆకాశంలో దృశ్యగోచర ఆవలి లక్ష్యాలను ఛేదించే అత్యంత అధునాతన క్షిపణి అస్త్రను భారత్ విజయవంతంగా...

ఉత్తర కొరియా ధైర్యం

Submitted by lakshman on Mon, 09/18/2017 - 21:59

అమెరికాకు తాజా క్షిపణి ప్రయోగంతో ఉత్తర కొరియా స్పష్టమైన సంకేతం ఇచ్చింది. జపాన్లోని హొక్కాయిడో ద్వీపం మీదుగా వారం రోజుల్లోనే రెండోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించి ప్రపంచ దేశాలకు మరోసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సవాల్ విసిరారు. తాము ఏకంగా హైడ్రోజన్ బాంబునే పరీక్షించామని చెప్పి ప్రపంచ దేశాలకు పెనుసవాల్ విసిరిన కిమ్ సరిగ్గా వారం తిరక్కుండానే మరో ఖండాంతర క్షిపణి ప్రయోగిస్తానని, ఏం చేసుకుంటారో చేసుకోమని తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు. అసలు కిమ్ జాంగ్ ఉన్ కు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? అణ్వస్త్ర అగ్ర దేశాలు కిమ్‌ను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాయి?