train

రైలు కింద పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు

Submitted by chandram on Sun, 11/18/2018 - 12:23

చావు అంచుకు చేరి చివరి క్షణంలో తప్పించుకున్న ఘటనలు సినిమాల్లో తరచూ చూస్తుంటాం. కలలో తప్ప నిజజీవితంలో ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా మాత్రమే చోటు చేసుకుంటూ ఉంటాయి. అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఘటన నుంచి ఓ ప్రయాణీకుడు తృటిలో తప్పించుకన్నాడు. రైల్వే పట్టాల మీదుగా ప్లాట్‌ ఫాం మారుతుండగా ఎదురుగా ఓ గూడ్స్ రైలు దూసుకొచ్చింది. దీంతో పట్టాల మధ్యే ప్రయాణీకుడు పడుకున్నాడు. రైలు కింద పట్టాల మధ్య నిమిషం పాటు గడిపిన ప్రయాణీకుడు  గూడ్స్ రైలు వెళ్లిన తరువాత పైకి లేచాడు. యువకుడికి ఏం జరుగుతుందోనని ఆందోళన చెందిన చుట్టుపక్కల వారు క్షేమంగా రావడంతో ఆనందం వ్యక్తం చేశారు.

కికీ ఛాలెంజ్‌ తీసుకున్న ముగ్గురి తిక్క కుదిర్చిన కోర్ట్

Submitted by arun on Fri, 08/10/2018 - 12:37

కికీ ఛాలెంజ‌్  తీసుకున్న ముగ్గురు కుర్రాళ్లకు మహారాష్ట్ర పోలీసులు తిక్క కుదిర్చారు. ఈ ఛాలెంజ్‌ గురించి దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నా కుర్రకారు ఆగడం లేదు. ఛాలెంజ్‌ను స్వీకరించొద్దంటూ పోలీసులు ఎంతగా చెప్పుకొస్తున్నా యూత్‌ దాన్ని బుర్రకెక్కించుకోవడం లేదు. మహారాష్ట్రలోని విరార్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు కికీ ఛాలెంజ్‌ చేశారు. కదులుతున్న రైలు నుంచి ప్లాట్‌ ఫామ్‌ పైకి దూకి డ్యాన్సులు చేశారు. దీన్నీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. 

చేతి నుంచి జారిపడిన సెల్‌ఫోన్...రైలు నుంచి దూకేసిన యువకుడు

Submitted by arun on Sat, 06/16/2018 - 11:13

యువత సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారుతోంది. సెల్‌ఫోన్‌ లేకుండా ఒక్క క్షణం కూడా గడపని పరిస్థితి నెలకొంది. ప్రాణాలు పోతున్నా...స్మార్ట్‌ఫోన్‌ను మాత్రం వదలడం లేదు. చెన్నై నుంచి ఒడిషా వెళ్తున్నాడు కేదారీనాథ్‌. భోగి డోర్‌ వద్ద కూర్చోని ఫోన్‌లో మాట్లాడుతుండగా... ద్వారపూడి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఫోన్‌ కింద పడిపోయింది. దీంతో కేదారీనాథ్‌...కదిలే ట్రైన్‌లో నుంచి ఫోన్‌ కోసం దూకేశాడు. తీవ్రంగా గాయపడటంతో స్థానికులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేదారీనాథ్‌ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Tags

నిజామాబాద్ మీదుగా కాచిగూడ - కరీంనగర్ ప్యాసింజర్ రైలు ప్రారంభం

Submitted by arun on Fri, 06/15/2018 - 17:11

తెలంగాణలో రూ.258 కోట్ల ఖర్చుతో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పారు. 45 వేల కోట్లతో రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సికింద్రాబాద్  రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి పనులను పియూష్‌ గోయల్‌ ప్రారంభించారు. కరీంనగర్‌ వరకు పొడిగించిన కాచిగూడ-నిజామాబాద్‌ ప్యాసింజర్ రైలును వారు జెండా ఊపి రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో నాల్గవ పాదచారుల వంతెన నిర్మాణానికి పియూష్‌ గోయల్ శంకుస్థాపన చేశారు. అన్ని రైల్వే స్టేషన్లు, పరిపాలన భవనాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లను ప్రారంభించారు.

ఎంతపని చేశావమ్మా...

Submitted by arun on Thu, 06/07/2018 - 12:42

కన్నబిడ్డలిద్దరితో సహా ఓ తల్లి కదులుతున్న రైల్లోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదఘటన బుధవారం విశాఖపట్నంలోని గోపాలపట్నం సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం వెంకంపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, ఇందుమతి దంపతులు తమ సంతానం జ్యోత్స్న (6), బద్రీనాథ్‌ (5)తో కలిసి  ఏడాది కిందటే వడ్లపూడి దరి కణితి ఆర్‌హెచ్‌ కాలనీకి వలస వచ్చారు. చంద్రశేఖర్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, ఇందుమతి స్థానికంగా టైలరింగ్‌ దుకాణంలో పని చేస్తున్నారు. మొదటి నుంచీ తన పిల్లల్ని బాగా చదివించాలనే తపనతో ఉన్న ఇందుమతి ప్రైవేటు పాఠశాలలో చేర్పించాలని భర్తతో చెబుతుండేది.

స్కూలు బస్సును ఢీకొన్న రైలు.. 13మంది మృతి

Submitted by arun on Thu, 04/26/2018 - 10:59

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతున్న పాఠశాల బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 13మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు తునాతునకలైంది. డివైన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన బస్సును థావే-కపటన్‌గంజ్‌ ప్యాసింజర్‌ రైలు బెహ్‌పుర్వా రైల్వే క్రాసింగ్‌ వద్ద ఢీకొట్టిందని రైల్వే అధికార ప్రతినిధి వేద్‌ ప్రకాశ్‌ వెల్లడించారు. రైలు సివాన్‌ నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ఉన్నారని, వారిలో ఎక్కువ మంది 10 సంవత్సరాల లోపు చిన్నారులే అని అధికారులు తెలిపారు.

అందరినీ ఫూల్ చేద్దామనుకొని చివరికి తానే ఫూల్ అయ్యాడు...

Submitted by arun on Thu, 01/25/2018 - 19:22

వైరల్‌గా మారిన ట్రైన్ సెల్ఫీ వీడియోపై.. మరో వీడియో రిలీజ్ చేశాడు సెల్ఫీ శివ. తాను సేఫ్‌గానే ఉన్నానని ఆ వీడియోలో తెలిపాడు. తనకేం కాలేదని.. అందరినీ ఫూల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. ప్రమాదం జరిగింది.. అతనికి గాయమైంది.. నిజమేనని రైల్వే పోలీసులు తేల్చేశారు. అతని చేత ఫైన్ కూడా కట్టించారు. దీనికి సంబంధించి.. రైల్వే పోలీసులు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దీంతో.. అందరినీ పూల్ చేద్దామనుకున్న సెల్ఫీ శివ.. తానే ఫూల్ అయ్యాడు.

Tags

ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్లకు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ డెబిట్ కార్డులు చెల్లవు

Submitted by lakshman on Sun, 09/24/2017 - 19:36
డెబిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్ రైల్వే టికెట్ల బుకింగ్ విధానాన్ని రైల్వే శాఖ మరింత కఠినతరం చేసింది. పలు బ్యాంకులను డెబిట్ కార్డ్ పేమెంట్ గేట్‌వే నుంచి తొలగించింది. ఇందులో ఎస్‌బీఐ, ఐసీఐసీపై బ్యాంకులు కూడా ఉండటం గమనార్హం. ఆయా బ్యాంకులు వినియోగదారుల నుంచి వసూలు చేసే...