youth

జీవితాలను నాశనం చేస్తున్న వైట్‌నర్‌...మత్తులో హత్యలు, అత్యాచారాలు

Submitted by arun on Mon, 06/11/2018 - 11:01

వైట్‌నర్‌ జనం జీవితాలను చిత్తు చేస్తోంది. పేపర్‌పై రాతను చెరిపేసేందుకు వాడే వైట్‌నర్‌...ప్రాణాలు తీస్తోంది. వైట్‌నర్‌కు అలవాటు పడ్డ వారు...మత్తులో మరొకరి ప్రాణాలు తీస్తున్నారు. తెలిసి కొందరు పీల్చేస్తుంటే...తెలియక మరి కొందరు వాడుతున్నారు. దీంతో వైట్‌నర్‌ వాడే వారి ఆలోచన విధానం కూడా డిఫరెంట్‌గా‌ ఉంటోంది. ఇదొక్కటే కాదు...నెయిల్ పాలిష్‌ రిమూవర్, పంచర్లు వేసేందుకు వాడే సొల్యూషన్‌లోనూ భారీ స్థాయిలో మత్తు పదార్థాలు ఉన్నాయ్. వీటికి అలవాటు పడిన వ్యసనపరులు...దాన్నుంచి బయటకు రాలేకపోతున్నారు. 

సోష‌ల్ మీడియాకు ఆద‌ర‌ణ క‌రువు

Submitted by lakshman on Sat, 03/10/2018 - 21:32

సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ కు ఆద‌ర‌ణ రోజు రోజుకు త‌గ్గుతుంది. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ దిగ్గ‌జఆలైన ఫెస్ బుక్, ట్విట్ట‌ర్ కు ఆద‌ర‌ణ క‌రువైపోతోంది. ఎక్కువ శాతం యువ‌త వాటికి దూరంగానే ఉంటున్నార‌ట‌. ఈ నేపథ్యంలో సోష‌ల్ మీడియాకు చాలా మంది గుడ్ బై చెబుతున్న‌ట్లు ఓ స‌ర్వే వెల్ల‌డించింది. బోస్టన్‌ కు చెందిన మార్కెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ సంస్థ ఓరిజిన్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి మందిపై అధ్యయనం చేసింది. 

ఆ సినిమాను బ్యాన్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా

Submitted by arun on Mon, 01/22/2018 - 14:55

పద్మావత్ సినిమా రిలీజ్ కు ముందే కర్ణిసేన దేశవ్యాప్తంగా రచ్చ సృష్టిస్తోంది. హర్యానాలోని కురుక్షేత్రలో సినీమాల్ పై కర్ణిసేన కార్యకర్తలు దాడి చేయగా... రాజస్తాన్ లో కర్ణిసేన నాయకుడు టీవీ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. బిల్వరాలోని భారీ టీవీ టవర్ పై తెల్లవారుజామున 4 గంటలకు కర్ణిసేన నేత, పంచాయతీ అధ్యక్షుడు ఉపేంద్ర రాథోడ్ ఎక్కాడు.  తన వెంట పెట్రోల్ డబ్బాను పెట్టుకున్నాడు. పద్మావత్ నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాడు. లేకుంటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని కాల్చుకుంటానని బెదిరిస్తున్నాడు. ఉపేంద్ర రాథోడ్ కు కర్ణిసేన కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారు.

రెండేసి ఉద్యోగాలు.. రెండు జీతాలు

Submitted by lakshman on Sun, 09/24/2017 - 19:05
మేక్‌ ద మోస్ట్‌ ఆఫ్‌ ఇట్‌..! కాస్త ఉత్సాహవంతులైన కుర్రకారును ఎవరిని కదిపినా వచ్చే ముందు మాట ఇది. మనకున్నది ఒకటే జీవితం. ఒక్క ఉద్యోగం కోసం ఎంతోమంది కష్టపడుతున్న కాలంలో రెండు ఉద్యోగాలు ఒకేసారి చేస్తూ...