road accident

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

Submitted by arun on Fri, 09/28/2018 - 15:52

కుమ్రం భీం జిల్లా జైనూర్‌ మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేగంగా వస్తున్న ఐచర్‌ వ్యాన్‌ ఓ చిన్నారిని ఢీ కొట్టడంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వ్యాన్‌ ముందు చక్రాల కింద నలిగి బాలుడు మృతిచెందాడు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో వ్యాన్‌ను అడ్డగించారు. తర్వాత దానికి నిప్పంటించారు. మంటల్లో వ్యాన్‌ తగులబడిపోయింది. దీంతో జైనూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

కొండగట్టు ఘాట్‌రోడ్‌లో ఘోర రోడ్డుప్రమాదం...32 మంది మృతి

Submitted by arun on Tue, 09/11/2018 - 12:45

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 32మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలియడంతో జిల్లా ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను అధికారులు పరిశీలిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. సుమారు 60మందితో ప్రయాణిస్తున్న బస్సు కొండగట్టులోని ఘాట్ రోడ్డులోకి వచ్చిన వెంటనే, ఒక్కసారిగా బోల్తా పడింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే ఘాట్ రోడ్డు నుంచి బస్సు పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతంలో పడిపోయింది.

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

Submitted by arun on Mon, 09/10/2018 - 09:23

హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు పాదచారులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. హెచ్‌సీయూ డిపోకు చెందిన బస్సు లింగపల్లి నుంచి కోఠి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం...8 మంది మృతి, 30 మందికి గాయాలు

Submitted by arun on Sat, 09/01/2018 - 10:03

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం సమీపంలోని మామందూరు రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఎదురుగా వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఎనిమిది మంది చనిపోగా 30 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణీకులను గ్యాస్ కటర్‌ల సాయంతో బయటకు తీసిన పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. 
 

డేంజర్ యాక్సిడెంట్స్

Submitted by arun on Fri, 08/10/2018 - 15:37

వాహనాల రద్దీ పెరగడంతో రోడ్డుపైకి రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పాదాచారులు రోడ్డు దాటాలంటే హడలిపోతున్నారు. వాహనాలు మెరుపు వేగంతో దూసుకురావడంతో రెప్పపాటులో ఘోర ప్రమాదాలు జరిగిపోతున్నాయి. తరచుగా జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలతో కొంత మంది ప్రాణాలు కోల్పోతే చాలామంది తీవ్ర గాయాపడి ఇబ్బందిపడుతున్నారు. 

బైక్‌ను ఢీకొన్న ఇన్నోవా...ఒకరు మృతి

Submitted by arun on Fri, 08/10/2018 - 12:13

యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బీబీ నగర్‌ మండలం కొండమడుగు దగ్గర జాతీయ రహదారిపై ఓ బైక్‌ను ఇన్నోవా కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థీ ప్రాణాలు కోల్పోయాడు. ఇంజనీరింగ్‌ పరీక్షలు రాసేందుకు ఒకే బైక్‌పై ముగ్గురు స్టూడెంట్స్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా బైక్‌ను బలంగా ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు సినిమా సీన్‌ను తలపించేలా ఎగిరిపడ్డారు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి శివకుమార్ సీఎస్‌ఈ రెండో యేడాది చదువుతున్నాడు.

‘మద్యం మత్తు.. ఒకరి ప్రాణాలు బలి’...

Submitted by arun on Mon, 07/30/2018 - 17:11

హైదరాబాద్ కేపీహెచ్ బీలో బస్సు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు యూటర్న్ వద్ద అడ్డంగా వెళుతున్న బైక్ దారుడిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం తాగి బైక్ నడపడం వల్లే ప్రాణం పోయిందని మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న గుడిసెను తగులబెట్టారు. 

ప్రమాదంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ దుర్మరణం

Submitted by arun on Tue, 06/26/2018 - 11:17

నెల్లూరు జిల్లా కొడవలూరి మండలంలోని రాచర్లపాడు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటుడు నన్నం సునీల్ మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పలు టీవీ సీరియళ్లు, సినిమాల్లో నటిస్తున్న సునీల్ ఆదివారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. రాచర్లపాడు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో సునీల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయనతో పాటు కారులో వస్తున్న సల్లావుద్దీన్ అనే వ్యక్తి కోమాలోకి వెళ్లాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

పాఠశాల బస్సు కిందపడి చిన్నారి మృతి

Submitted by arun on Mon, 06/25/2018 - 12:01

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోపిగడ్డలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి అవ్య మృతి చెందింది. స్థానికంగా ఉంటున్న శంకర్‌రెడ్డికి ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల పాప ఉంది. శంకర్‌రెడ్డి బాబును స్కూల్‌కు పంపించే నిమిత్తం ఇంటి ముందు ఉన్న స్కూల్ బస్సు ఎక్కించాడు. అదే సమయంలో ఇంట్లో నుంచి తండ్రి వెనకాలే పరిగెత్తుకుంటూ రెండేళ్ల చిన్నారి రోడ్డుపై నిల్చుంది. అయితే చిన్నారిని గుర్తించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో చిన్నారిపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. 

ఘోర రోడ్డు ప్రమాదం.. కుటుంబం మృతి

Submitted by arun on Fri, 06/22/2018 - 10:10

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్‌ రహదారిపై ఆగి ఉన్న లారీని  కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురు మృతి చెందారు.  ప్రమాదంలో మరణించిన వారిని మంథనిలోని  కృష్ణవేణి స్కూల్ నిర్వాహకుడు అరుణ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు.  ప్రమాదంలో  అరుణ్‌కుమార్‌తో పాటు భార్య, కుమారుడు, కుమార్తె మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఒకేసారి కుటుంబ సభ‌్యులంతా చనిపోవడంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.