china

చైనా పట్టణాలకు కాలుష్య పట్టం

Submitted by arun on Thu, 07/12/2018 - 12:22

ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 20 చైనాలోనే ఉన్నాయట, మరి చైనా వస్తువుల్లో ఎంత కాలుష్యం వుందో? శ్రీ.కో

నీరవ్‌ మోడీ అరెస్ట్‌కు రంగంసిద్ధం

Submitted by arun on Mon, 04/09/2018 - 16:15

బ్యాంకులకు 13వేల కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్‌మోడీ అరెస్ట్‌కు రంగంసిద్ధమైంది. అసలు నీరవ్‌ మోడీ ఎక్కడున్నాడో తెలిసింది. హాంకాంగ్‌లో నీరవ్‌ ఉన్నట్లు చైనా ధృవీకరించింది. దాంతో నీరవ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ హాంకాంగ్‌ పోలీసులను భారత్‌ కోరింది. దాంతో నీరవ్‌ను అరెస్ట్‌ చేసి భారత్‌కు అప్పగించే అవకాశముంది. ఇక రెండ్రోజుల క్రితమే నీరవ్‌మోడీపై సీబీఐ నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 

తలలోకి కత్తెర దూసుకెళ్లినా.. బస్సెక్కి ఆసుప్రతికి..

Submitted by arun on Sat, 04/07/2018 - 16:51

ఓ చిన్న దెబ్బ తాకితేనే అయ్యో.. కుర్రో ముర్రో అంటాం. కాని.. ఓ 57 ఏండ్ల మహిళ తలలో కత్తెర గుచ్చుకున్నా... రక్తస్రావం అయినా ఏ మాత్రం భయపడలేదు, టెన్షన్ పడలేదు, హడావుడి చేయలేదు. తనకు ఏం కానట్టు నడుచుకుంటూ వచ్చి బస్సెక్కి ఆసుపత్రికి వెళ్లి జాయిన్ అయింది. ఈ ఘటన చైనాలోని హుబెయ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్నది. స్థానిక మీడియా ప్రకారం..

బిడ్డను బతికించుకునేందుకు ఎవరూ చేయని సాహసం చేసిన తల్లి

Submitted by arun on Mon, 02/05/2018 - 18:51

బిడ్డను బతికించుకునేందుకు ఎవరూ చేయని సాహసం చేసింది ఓ తల్లి. ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న తన చిన్నారిని బతికించుకోవడానికి ఓ తల్లి తన చనుబాలను విక్రయానికి పెట్టింది. ఈ ఘటన చైనాలో వెలుగుచూసింది. వైద్యానికి సరిపడా డబ్బు లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిల్లో ఆ తల్లి ఇలా తన చనుబాలను విక్రయిస్తూ ఆర్థిక సాయాన్ని అర్థిస్తోంది.
 

ఇల్లు కాలిపోతే సెల్ఫీలు దిగుతూ పోస్టులు పెట్టిన జంట!

Submitted by arun on Sun, 01/14/2018 - 11:39

సాధారణంగా ఇల్లు తగలబడితే ఎవరైనా తీవ్ర విషాదంలోకి వెళతారు. కంగారెత్తిపోయి ఏం చేయాలో పాలుపోక ముఖంలో చిరునవ్వు మాయమై దుఃఖాన్ని వేలాడేసుకొని కనిపిస్తారు. కానీ, చైనాలో ఓ జంట మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తగలబడిన తమ ఇంట్లో నిల్చొని సెల్ఫీలతో పోటీ పడ్డారు. పదుల సంఖ్యలో హాయిగా నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకున్నారు. వీడియోలు కూడా రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ ఘటన చైనాలోని నానింగ్ ప్రాంతంలో జరిగింది. "నేను ఆ సమయంలో బాత్ రూములో ఉన్నాను. ఏదో కాలుతున్న వాసన వచ్చింది. డోర్ తీసి చూస్తే మంటలు కనిపించాయి. వస్తువులన్నీ కాలిపోతున్నాయని తెలిసింది.

చైనా ఆట క‌ట్టిస్తున్న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ యువ‌కుడు

Submitted by arun on Wed, 01/10/2018 - 17:18

భారత భూభాగంపై కన్నేసిన డ్రాగన్ కంట్రీ... డోక్లామ్ వివాదం తర్వాత మరోసారి బరి తెగించింది. అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చిమరీ బిషింగ్‌‌ దగ్గర రోడ్డు నిర్మాణం చేపట్టింది. అసాధ్యమైన చోట రోడ్డు నిర్మాణం చేపట్టడం ఒక వింతయితే...ఈ దురాక్రమణను మన సైన్యం గుర్తించలేకపోవడం మరో విచిత్రం. ఇంతకీ అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం ఎలా చేపట్టింది..? దానిని వెలుగులోకి తెచ్చిందెవరు...? చైనా దురాక్రమణకు గురైన బిషింగ్‌లో వాస్తవ పరిస్థితి ఏంటి అనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.   

దౌత్య యుద్ధంలో మనదే విజయం

Submitted by lakshman on Sun, 09/24/2017 - 15:51
భారత్ - పాకిస్థాన్... ఈ రెండు దేశాలు 1947లో వేరు పడినప్పటి నుంచి రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతూనే వస్తోంది. ఒకసారి యుద్ధం, మరోసారి దాదాపు చిన్నపాటి యుద్ధం లాంటి కార్గిల్ ఘటన, ఇంకోసారి సర్జికల్ స్ర్టైక్స్.. ఇలా తరచూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్.. రెండు దేశాలతోనూ...