Redwood smuggling

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌!

Submitted by arun on Thu, 07/12/2018 - 10:06

ఎలాగైనా నటుడిగా నిరూపించుకోవాలన్న లక్ష్యంతో దొరికిన పాత్రలన్నీ చేస్తూ, టీవీ సీరియల్స్ లో నటిస్తూ, జబర్దస్త్ కార్యక్రమంలో నవ్వించిన సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్... అది నిన్నటి వరకూ. నేడు శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. అంతేకాదు, ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోగా నటించగా, ఇటీవలే విడుదలైన చిత్రానికి ఫైనాన్స్ కూడా అందించాడు. తిరుపతికి చెందిన ఈ వ్యక్తి గురించి పక్కా ఆధారాలు లభ్యంకావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలోని స్మగ్లర్ల ద్వారా బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు.