3-die-in-rajasthan-road-accident-as-onlookers-click-selfies

మానవత్వం మంటగలిసింది.. ప్రాణాలు పోతున్నా సెల్ఫీలు దిగారు..

Submitted by nanireddy on Wed, 07/11/2018 - 19:31

రోజు రోజుకు సమాజంలో మానవతా  విలువలు మంటగలిసిపోతున్నాయి. రోడ్డు  ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడిల్పింది పోయి వారితో సెల్ఫీలు దిగారు.. ప్రాణం పోతుందని తెలిసి మరి క్షతగాత్రులను ఇబ్బందిపాలు చేశారు.  ఈ ఘటన రాజస్థాన్‌లో బార్మిర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం  బైక్ పై వెళుతున్న ముగ్గురిని  ఓ స్కూల్ బస్సు ఢీకొట్టడంతో వారికి తీవ్రగాలయ్యాయి. దీంతో వారు రోడ్డు మీద పడి స్పృహ కోల్పోయారు. ఈ క్రమంలో  స్ధానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారికి సహాపడాల్పింది పోయి  రక్తమడుగుల్లో పడి ఉన్న వారితో సెల్ఫీలు దిగారు.