slider

కృష్ణా జిల్లా పేరు మార్చేది లేదు : అంబటి రాంబాబు

Submitted by nanireddy on Thu, 05/03/2018 - 08:39

తాము అధికారం లోకి వస్తే కృష్ణా జిల్లా పేరును కాస్త నందమూరి తారకరామారావు జిల్లాగా మారుస్తామని వైసీపీ అధినేత  వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ  వైసీపీ సీనియర్ నేత ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా పేరు మార్పు ఉండదు, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి పార్లమెంటు నియోకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తామని జగన్ ఇదివరకే హామీ ఇచ్చారని గుర్తుచేశారు..

తెలుగు రాష్ట్రాలకు ఐడియా బంపర్ ఆఫర్

Submitted by nanireddy on Wed, 05/02/2018 - 13:01

టెలికాం రంగంలో  కొత్త ఒరవడిని సృష్టించిన 'జియో' వినియోగ దారులకు సరసమైన ధరలతో వివిధ ఆఫర్లు ఇస్తూ మార్కెట్లో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇక జియో దెబ్బకు ఇతర టెలికాం సంస్థలు కూడా దిగివచ్చి  వారి కస్టమర్లను కాపాడుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా ఐడియా ఎయిర్టెల్ ముందువరుసలో ఉన్నాయి. ఇప్పటికే వివోఎల్టీఈ ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. జియో , ఎయిర్టెల్ , వోడాఫోన్ లు తాజాగా  (వాయిస్ ఓవర్ ఎల్టీఈ) వివోఎల్టీఈ సేవలను ప్రారంభించనున్నట్టు ఐడియా తెలిపింది. దీంతో వినియోగదారులు వీవోఎల్టీఈ సేవలు ఐడియాలో కూడా పొందే అవాకాశం  ఐడియా సెల్యూలర్ నెట్వర్క్ కల్పించింది.

పేస్ బుక్ వినియోగదారులకు శుభవార్త.. అందుబాటులోకి కొత్త ఫీచర్

Submitted by nanireddy on Wed, 05/02/2018 - 12:47

ఇప్పటికే వినియోగదారుల సమాచారం చోరీ ఆరోపణలతో సతమతమవుతున్న పేస్ బుక్ ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పేస్ బుక్ నిపుణులతో చర్చలు ప్రారంభించిన పేస్ బుక్ వ్యవస్థాకుడు  మార్క్ జుకర్ బెర్గ్ నేతృత్వంలో ఓ చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. పేస్ బుక్ వినియోగదారుల సమాచారాన్ని లీక్ అవ్వకుండా చూసుకునేందుకు ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు మార్క్ జుకర్ బెర్గ్ తెలిపారు. పేస్ బుక్ లో చూసిన వెబ్ సైట్లు, యాప్స్ సమాచారాన్ని అకౌంట్ నుంచి డిలీట్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందన్నారు. బ్రౌజర్ లో కుకీస్ క్లియర్ కూడా చేసుకోవచ్చని చెప్పారు.

ఏపీలో ఎంసెట్ పలితాలు విడుదల.. రిజల్ట్ కోసం క్లిక్ చేయండి..!

Submitted by nanireddy on Wed, 05/02/2018 - 12:16

ఇంజనీరింగ్, మెడిసిన్ లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఛాంబర్ లో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం  లక్షా 37 వేల మంది పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. లక్షా 27 వేల 192 మందికి ర్యాంక్ లు కేటాయించారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు సమాచారం అందించామని మంత్రి గంటా తెలిపారు.

రిజల్ట్  కోసం క్లిక్ చేయండి : ap-eamcet-results-avialable here 

ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకుడు ఆయనే?

Submitted by nanireddy on Wed, 05/02/2018 - 12:00

దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారణగా రూపొందుతున్న 'ఎన్టీఆర్ బయోపిక్' నుంచి దర్శకుడు తేజ అనూహ్యంగా తప్పుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ చేపట్టడం తన వల్ల కాదని మెగాఫోన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో దర్శకుల వేట ప్రారంభించాడు చిత్ర నిర్మాత, నటుడు నందమూరి బాలకృష్ణ అందులో భాగంగా ప్రసిద్ధ దర్శకులు కే. రాఘవేందర్ రావు , జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) , కృష్ణవంశీ లను సంప్రదించాడు. అయితే ఎవరి ప్రాజెక్ట్ లో వారు బిజీగా ఉండటం చేత  'ఎన్టీఆర్ బయోపిక్' కోసం టైం స్పెండ్ చేయలేమని బాలయ్యకు చెప్పారట. దీంతో ఒకానొక దశలో బాలకృష్ణే ఈ సినిమాకు మెగాఫోన్ పట్టాలని ఫిక్స్ అయ్యాడు.

నడిరోడ్డుపై మహిళా అధికారి కాల్చివేత..

Submitted by nanireddy on Wed, 05/02/2018 - 11:34

అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఆదేశించిన కోర్టు తీర్పును అమలు చేస్తున్న ఓ అధికారిని కాల్చి చంపాడో వ్యక్తి. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన  షేల్‌ బాలా అసిస్టెంట్ టౌన్ ప్లానర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ గౌరవ న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో కోర్టు ఉత్తర్వులను అమలు పరుస్తున్నారు. ఈ మేరకు మంగళవారం షేల్‌ బాలా పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారుతో కలిసి  కసౌలీ పట్టణానికి చేరుకున్నారు. పోలీసుల సాయంతో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించారు. ఈ క్రమంలో మండో మాట్కండలో ఉన్న నారాయణి గెస్ట్‌ హౌజ్‌ వద్దకు చేరుకున్నారు.

వైసీపీలోకి వలసల జోరు.. మరి టీడీపీ?

Submitted by hmtvdt on Tue, 05/01/2018 - 16:52

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అయినట్టే కనిపిస్తోంది. 2014 తర్వాత.. వల వేసి మరీ పట్టుకున్నట్టుగా.. టీడీపీ నేతలు చేరికలను ప్రోత్సహించారు. తమ పార్టీలోకి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించారు. ఆపరేషన్ ఆకర్ష్ అన్నట్టుగా వ్యవహరించి.. తమ పార్టీని బలోపేతం చేసుకోవడంపైనే ఎక్కువ కాలం గడిపేశారు. అందులో.. ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు కూడా భాగమయ్యారు.

పదిహేడేళ్ల 'ఖుషి'

Submitted by hmtvdt on Sat, 04/28/2018 - 15:11

పవన్ కళ్యాణ్ తో ఆనందాన్ని పంచుకున్న నిర్మాత ఎ.ఎం.రత్నం
సిద్దు... సిద్ధార్థ్ రాయ్... అంటూ వెండి తెరపై పవన్ కళ్యాణ్  చేసి 'ఖుషి'కి నేటితో పదిహేడేళ్లు నిండాయి. 2001 ఏప్రిల్ 27 న విడుదలైన 'ఖుషి' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యువతరం ప్రేమ కథలకు, స్టైల్స్ కు ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో  పవన్ కళ్యాణ్ హుషారైన నటన, ఫైట్స్ నాటి యువతనే కాదు పెద్దవాళ్ళనీ మెప్పించాయి. 

పార్టీ నేత‌ల నోరు కుట్టేసే వార్నింగ్ ఇచ్చిన‌ మోడీ

Submitted by hmtvdt on Mon, 04/23/2018 - 13:37

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఉగ్ర‌రూపం దాల్చారు. త‌న పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. ఇదంతా ఎందుకోసం అంటే..వారి నోటిని అదుపులో ఉంచుకునేందుకు. ఇటీవ‌లి కాలంలో బీజేపీ నేత‌లు మీడియా ముఖంగా అనేక వ్యాఖ్య‌లు చేయ‌డం, అవి వైర‌ల్ అవ్వ‌డం, వివాదాస్ప‌దంగా మార‌డం, నేత‌లు నవ్వుల‌పాలు అవ‌డం తెలిసిందే.

చంద్ర‌బాబు ఎవ‌రంటే

Submitted by lakshman on Tue, 04/03/2018 - 03:15

స్వ‌ర్గీయ నంద‌మూరి ఎన్టీ రామారావు బ‌యోపిక్ సినిమా హ‌ట్ట‌హాసంగా ప్రారంభమైంది. బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్ర‌ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఉప‌రాష్ట్ర‌పతి వెంక‌య్య‌నాయుడు  నాచారంలోని రామ‌కృష్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర స‌న్నివేశానికి క్లాప్ కొట్టి సినిమాను షూటింగ్ ను ప్రారంభించారు .  ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గా బాల‌కృష్ణ‌,  అల్లుడు చంద్రబాబుగా ఎవ‌రు చేస్తారు. ఎన్టీఆర్ నిజ‌జీవితంలో కీల‌క పాత్ర‌పోషించిన నాదెండ్ల విజ‌య భాస్క‌ర్ పాత్ర‌ను ఎవ‌రు పోషించ‌నున్నారు అనే విష‌యాల‌పై సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.