kathi-mahesh-father-fires-paripoornananda-swami

కత్తి మహేష్ ఇష్యూ పై మొదటిసారి స్పందించిన అయన తండ్రి

Submitted by nanireddy on Tue, 07/10/2018 - 09:49

గత కొన్నాళ్లుగా కత్తి మహేష్ వివాదాల్లో కూరుకుపోతున్నారు. హిందువుల ఆరాధ్యదైవం రాముడిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రముఖ స్వామిజి పరిపూర్ణానంద స్వామిజి ధర్మాగ్రహ యాత్ర చేపట్టిన సంగతి తెలిసింది. అయితే ఈ యాత్రకు పోలీసులు బ్రేక్ వేశారు. ఈ క్రమంలో కత్తి మహేష్ ను ఆరునెలల పాటు నగర బహిష్కరణ చేశారు పోలీసులు. ఇక ఈ ఇస్యూపై  కత్తి మహేష్ తండ్రి ఓబులేసు మొదటిసారి స్పందించారు.  'నా కొడుకును కాదు.. హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలన్నారు. మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రార్థాంతం చేస్తున్నారని మండిపడ్డారు.