student

విద్యార్ధినిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు....టీచర్‌ను బట్టలూడదీసి ఊరేగించారు..

Submitted by arun on Wed, 08/22/2018 - 10:07

పవిత్రమైన వృత్తిలో ఉంటూ దారితప్పిన ఉపాధ్యాయుడికి స్ధానికులు దేహశుద్ది చేసి నగ్నంగా తిప్పిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. స్ధానికంగా ఉండే ఓ ప్రయివేటు కళాశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా ఉన్న రాంబాబు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధినిపై గత కొద్ది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. విషయం బయటచెబితే చంపేస్తానంటూ బెదిరిస్తూ తన కోరిక తీర్చుకుంటున్నాడు. అయితే ఇటీవల విద్యార్ధిని గర్భం దాల్చడంతో  అబార్షన్ చేసేందుకు మందులు ఇచ్చాడు. ఇవి వికటించడంతో విషయం వెలుగు చూసింది.  రాంబాబు ఆగడాన్ని తెలుసుకుని ఆగ్రహానికి గురైన స్ధానికులు, చుట్టుపక్కల వారు ఒక్కసారిగా దాడికి దిగారు.

టెడ్డీబేర్‌తో అత్తను హతమార్చిన మేనల్లుడు

Submitted by arun on Mon, 08/06/2018 - 12:42

తన కూతురిని కలవొద్దని, ఆమెతో మాట్లాడవద్దని హెచ్చరించినందుకు పదో తరగతి చదువుతోన్న 15 ఏళ్ల కుర్రాడు సొంత మేనత్తనే హత్య చేశాడు. అది కూడా టెడ్డీ బేర్‌తో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. ఆ తరవాత చేతి మణికట్టును కత్తితో కోసి ఆత్మహత్యగా నమ్మించాలనుకున్నాడు. అయితే సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ విద్యార్థిని అనుమానించి విచారించారు. మేనత్తను తానే హత్యచేసినట్లు పోలీసుల ఎదుట అతను ఒప్పుకున్నాడు. ఈ ఘటన చెన్నైలోని అమింజికరైలో చోటుచేసుకుంది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. చెన్నై అమింజికరై వల్లలార్‌వీధికి చెందిన శంకర్‌ సుబ్బు (45) అదే ప్రాంతంలో కిరాణ దుకాణం నడుపుతున్నాడు.

15 ఏళ్ల బాలుడితో 29 ఏళ్ల టీచర్..జంప్ !

Submitted by arun on Tue, 07/24/2018 - 17:42

పదో తరగతి పిల్లాడిని తీసుకొని 29 ఏళ్ల స్కూల్ టీచర్వెళ్లిపోయింది. రెండు రోజుల పాటూ ఎవరికి దొరక్కుండా ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరిగారు. చివరికి విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఆ పంతులమ్మను అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫతేబాద్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.  ఫతేబాద్‌లోని ఓ స్కూల్లో పాఠాలు బోధిస్తున్న 29 ఏళ్ల పంతులమ్మ పదో తరగతి చదువుతున్న15 ఏళ్ల  పిల్లాడిని ప్రేమించింది. ఫోన్లో మెసేజీలు, వీడియోలు పంపుతూ ప్రేమపాఠాలు బోధించింది. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. గత శుక్రవారం ఇద్దరూ ఊరి నుంచి వెళ్లి పోయారు.

క్లాస్ రూంలో విద్యార్థినితో జడ వేయించుకున్న టీచరమ్మ

Submitted by arun on Thu, 07/05/2018 - 14:04

జనగాం జిల్లా నర్మెట్ట మోడల్ స్కూల్‌లో ఫిజిక్స్ టీచర్ నిర్వాకాన్ని స్టూడెంట్స్ బయటపెట్టారు. తలనొప్పిగా ఉందని ఫిజిక్స్ టీచర్ పార్వతి.. తొమ్మిదో తరగతి విద్యార్థినితో తలకు ఆయిల్‌తో మసాజ్ చేయించుకుంది. అది పూర్తైన తర్వాత.. క్లాస్ రూంలోనే జడ కూడా వేయించుకుంది. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఘటన మీద డీఈఓ విచారణకు ఆదేశించారు.