t20

కోచ్‌పై మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు

Submitted by chandram on Tue, 11/27/2018 - 19:05

మహిళా టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో క్రికెటర్ మిథాలీ రాజ్‌ను పక్కన పెట్టిన కెప్టెన్ హర్మన్ ప్రీత్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రధానమైన ఆటలో మిథాలీని క్రికెట్ జట్టులోకి తీసుకోకపోవడంపై టీం యాజమాన్యంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మిథాలీపై సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తుంది. మిథాలీని ఎందుకు కీలక ఆటల్లో స్థానం ఎందుకు కల్పించలేదో చెప్పాలిని అభిమానులు, నెటిజన్లు భగ్గుమంటున్నారు. కాగా ఈ విషయం తొలిసారి మిథాలీ రాజ్ స్పందిస్తూ తనకు స్థానం దక్కకపోవడానికి ప్రధాన కారణం జట్టు కోచ్ రమేశ్ పవార్ అనే లేఖలో ప్రస్తవిస్తూ రమేశ్ పవార్ తనను చాలా దారుణంగా అవమానించారంటూ బీసీసీఐకి లేఖలో పంపించారు.

తిప్పేసిన కుల్‌దీప్‌ దంచేసిన రాహుల్‌

Submitted by arun on Wed, 07/04/2018 - 11:05

ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది భారత్‌. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిటీష్ జట్టు జాసన్‌రాయ్, జోస్‌ బట్లర్, భారత బౌలర్లను ఆటాడుకున్నారు. ఓపెనర్ల దూకుడుకు ఇంగ్లండ్ జట్టు ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన కుల్దీప్‌ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. 2వందల పరుగులు చేస్తుందకున్న బ్రిటీష్ జట్టు కుల్దీప్‌ దెబ్బకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకే ఓవర్‌‌లో మూడు వికెట్లు తీసి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు కుల్దీప్‌.