twitter

మంత్రి కేటీఆర్‌ సహాయానికి అభినందల వెల్లువ

Submitted by arun on Mon, 04/09/2018 - 15:54

ఆ చిన్నారికి పట్టుమని పదినెలలు కూడా నిండలేదు. ఇంతలోనే కంటికి కొండంత కష్టం. అండగా ఉంటుందనుకున్న ఆరోగ్య శ్రీ ఆదుకోలేదు. అనుకోకుండా తారసపడిన భరత్‌ అనే వ్యక్తి... ఆలోచన ఆ చిన్నారికి వచ్చిన కష్టాన్ని గట్టెక్కించింది. కార్పోరేట్‌ హాస్పిటల్‌లో కాసులు చెల్లించలేని ఆ నిరుపేద తల్లిదండ్రులకు మంత్రి కేటీఆర్‌ ఆపద్భందువయ్యాడు. ఏంటా చిన్నారి కథ..? ఎవరా భరత్‌..? మంత్రి చేసిన సహాయం ఏంటి..?

ప్రముఖులు... ఫేకులు

Submitted by arun on Mon, 03/19/2018 - 12:00

సోషల్‌ మీడియా యుగంలో ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాంలో ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉంటే అంతగొప్పగా భావిస్తుంటారు. ఇక రాజకీయ నాయకుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ ప్రచారం, వ్యక్తిగతంగా పేరు ప్రఖ్యాతుల కోసం సోషల్‌ మీడియా మీదే ఆధారపడుతున్నారు. కానీ మోడీ, రాహుల్ లాంటి అనేకమంది ప్రముఖుల ఫాలోవర్స్‌లో సగంమంది ఫేక్ అని తేలింది.

పేరు మార్చుకున్న రాహుల్‌గాంధీ

Submitted by arun on Sat, 03/17/2018 - 12:44

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేరు మార్చుకున్నారు. ఎందులో, ఎక్కడ, ఏం పేరు ఇలా డౌట్స్‌ మీద డౌట్స్‌ వస్తున్నాయి కదా.. ఏమీ లేదండి, రాహుల్‌ తన ట్విటర్‌ ఖాతా పేరును మార్చుకున్నారు. ఎందుకనీ అంటే... ఇంత వరకు ఆఫీస్ఆఫ్ఆర్జీ అని ఆయన ట్విట్టర్ పేజీని నడిపారు. అంటే రాహుల్ గాంధీ కార్యాలయం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై విమర్శలు ఎక్కువగా వచ్చేవి. గొప్ప కోసం లేదా వెర్రితనంగా దీన్ని సామాజిక మాధ్యమంలో అభివర్ణిస్తూ కామెంట్లు పెట్టేవారు. తన ట్విట్టర్ ఖాతాలో తన పెంపుడు కుక్క ట్వీట్లు పెడుతుందంటూ ఆయన గతంలో విమర్శకులకు సమాధానంగా జోకులు పేల్చారు.

సోష‌ల్ మీడియాకు ఆద‌ర‌ణ క‌రువు

Submitted by lakshman on Sat, 03/10/2018 - 21:32

సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ కు ఆద‌ర‌ణ రోజు రోజుకు త‌గ్గుతుంది. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ దిగ్గ‌జఆలైన ఫెస్ బుక్, ట్విట్ట‌ర్ కు ఆద‌ర‌ణ క‌రువైపోతోంది. ఎక్కువ శాతం యువ‌త వాటికి దూరంగానే ఉంటున్నార‌ట‌. ఈ నేపథ్యంలో సోష‌ల్ మీడియాకు చాలా మంది గుడ్ బై చెబుతున్న‌ట్లు ఓ స‌ర్వే వెల్ల‌డించింది. బోస్టన్‌ కు చెందిన మార్కెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ సంస్థ ఓరిజిన్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి మందిపై అధ్యయనం చేసింది. 

ట్విట‌ర్ ద్వారా ప్రియురాలిని ప‌రిచ‌యం చేసిన ప్రియ‌ద‌ర్శి!

Submitted by arun on Wed, 02/14/2018 - 17:35

పెళ్లి చూపులు సినిమాలో తెలంగాణ యాసతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన పాపులర్ కమెడీయన్ ప్రియదర్శి. రీసెంట్ గా తొలి ప్రేమ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియదర్శి, ‘అ’ అనే సినిమాలోను ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. ప్రతీ సినిమాలో కొత్త దనం కనబరుస్తూ ఆడియన్స్ చే అభినందనలు అందుకుంటున్న ప్రియదర్శి వేలంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలికి ప్రేమ లేఖ రాసాడు. ప్రియదర్శి, రిచా ఇద్దరు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ `డియ‌ర్ ల‌వ్‌.. నీ ప‌ట్ల నా ప్రేమ‌ను, ఆలోచన‌ల‌ని పదాలుగా మార్చి రాయాలనుకోగా, అది జరగలేదు.

ఐటీ మంత్రికి ట్విట్టర్‌లో పంచ్‌

Submitted by arun on Mon, 02/12/2018 - 09:10

ఐటీ మంత్రికే ట్విట్టర్‌లో పంచ్‌ పడింది. ఓ సినిమా గురించి ట్వీట్‌ చేసినందుకు నెటిజన్లు కౌంటర్‌ ఇచ్చారు. రైతులు, విద్యార్థుల కష్టాలు పట్టించుకోకుండా సినిమాలు చూడ్డమేంటని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. నెటిజన్ల ప్రశ్నలతో చిర్రెత్తుకొచ్చిన ఆ మంత్రి వెంటనే తన డీపీ మార్చేశారు. కేటీఆర్‌... తెలంగాణ ఐటీ శాఖా మంత్రి. ట్విట్టర్‌లో బాగా యాక్టీవ్‌గా ఉంటారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడమేకాదు, అధికారులను అలర్ట్‌ చేస్తూ ట్వీట్స్‌ చేస్తుంటారు.

సోషల్ మీడియాకు అనసూయ గుడ్‌ బై

Submitted by arun on Wed, 02/07/2018 - 12:36

ప్రముఖ యాంకర్‌ అనసూయ సోషల్ మీడియాకు గుడ్‌ బై చెప్పేసింది. రీసెంట్‌గా ఓ కుర్రాడు అన‌సూయతో సెల్ఫీ దిగేందుకు ప్ర‌యత్నించ‌గా, ఆమె సెల్ ప‌గ‌ల‌గొట్టింద‌ట‌. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా బుక్ అయింది. ఈ నేప‌ధ్యంలో అన‌సూయ‌కి భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నెటిజ‌న్స్ త‌మ‌కి న‌చ్చిన స్టైల్‌లో అన‌సూయ‌కి క్లాస్ పీకారు. క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి వారు శాంతించక‌పోవ‌డంతో సోష‌ల్ సైట్స్ నుండి అన‌సూయ త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తుంది. ట్వీటర్‌తో పాటు ఫేస్‌ బుక్‌లో కూడా అనసూయ అకౌంట్ కనిపించటం లేదు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావటం వల్లే అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

అసభ్యకరమైన ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి

Submitted by arun on Fri, 01/26/2018 - 17:23

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయకు కొంతకాలంగా అసభ్యకరమైన ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయట. భారతదేశంలో ఓ మహిళకున్న స్వేచ్ఛ ఇదేనా? అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. భారతదేశంలో మహిళలకు ఎలాంటి భద్రత, గౌరవం లేదంటూ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘లావణ్య త్రిపాఠిని అరెస్ట్ చేయండి’

Submitted by arun on Thu, 01/25/2018 - 14:10

టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువనటి లావణ్య త్రిపాఠిని అరెస్ట్‌ చేయాలంటూ ఓ అభిమాని సంచలన వ్యాఖ్య చేశాడు. అయితే ఈ వ్యాఖ్య వెనుక ఆ అభిమాని అంతులేని అభిమానం ఉంది.సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆమె నటించిన ‘ఇంటెలిజెంట్‌’ సినిమాను లావణ్య తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమానికి వెళ్లిన లావణ్య పసుపు రంగు గౌనులో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేసింది. దీనికి వరుణ్‌ అనే అభిమాని ఆమెకు ట్యాగ్ చేస్తూ, ‘అందంగా ఉండటం నేరమైతే ఇప్పటికిప్పుడే లావణ్యను అరెస్ట్‌ చేయండి. ఆమె తన అందంతో చంపేస్తోంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి వెంటనే లావణ్య రిప్లై ఇచ్చింది. ‘హా.. హా..