Dravid

ద్రవిడ్‌కు అరుదైన గౌరవం

Submitted by arun on Mon, 07/02/2018 - 14:07

మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ద్రావిడ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో రాహుల్‌ ద‍్రవిడ్‌కు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు కల్పించిన విషయాన్ని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక‍్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ స్పష్టం చేశారు. ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌, ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు మాజీ వికెట్‌ కీపర్‌ క్లెయిర్‌ టేలర్‌లకు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఈ ఘనత దక్కించుకున్న ఐదో భారత ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌.