nagarjuna

వర్మ కెరీర్ కు.. నాగ్ ఫ్యామిలీ ‘ఊపిరి’

Submitted by arun on Thu, 03/29/2018 - 11:33

రామ్ గోపాల్ వర్మ మామూలుగా ఎవరి మాటా వినని సీతయ్యగా ప్రసిద్ధుడు. కానీ.. యువ సామ్రాట్ నాగార్జున విషయానికి వచ్చే సరికి కామ్ అయిపోతాడు. శివ సక్సెస్ నుంచి ఇద్దరి మధ్యా మాంఛి అండర్ స్టాండింగ్ కూడా ఉంది. అందుకే.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. రామ్ గోపాల్ వర్మతో కలిసి ఆఫీసర్ సినిమా చేశాడు.. నాగార్జున. డైరెక్ట్ సినిమాలు లేక.. వెబ్ సిరీస్ లతో కాలం గడిపేస్తున్న వర్మకు.. నాగ్ అవకాశం ఇవ్వడం అంటే.. అది మామూలు విషయం ఏమీ కాదు కదా.

ఓ సినిమా చేయండి బాసూ

Submitted by lakshman on Thu, 02/08/2018 - 04:36

కేవలం నటుడిగానే గాక దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నాడు ధనుష్. ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా సూపర్ హిట్ నుసొంతం చేసుకున్నాడు ధనుష్. ఆ సినిమా అనంతరం.. ఇప్పుడు మరోసారి దర్శకత్వానికి రెడీ అయిపోతున్నాడు. ఈ సారి ఒక భారీ సినిమాతో మొత్తం దక్షిణాదిన అంతా సత్తా చాటాలనేది ధనుష్ ప్రణాళిక అని తెలుస్తోంది. అందుకే.. మల్టీస్టారర్ ను, అందునా.. పక్క భాష నటులను కలుపుకుని సినిమా చేయాలని ధనుష్ ప్లాన్ వేశాడట.

అక్కినేని ఫ్యామిలీని వెంటాడుతోన్న గండం

Submitted by arun on Fri, 01/12/2018 - 15:06

ఒక్క హీరోకు ఫ్లాప్ పడితే ఏమో అనుకోవచ్చు. కానీ గుండుగుత్తగా అక్కినేని ఫ్యామిలీ ఫ్యామిలీయే ఫ్లాప్ ల్లో ఇరుక్కుంది. ఒక్క హిట్ కోసం తండ్రి నాగార్జున నుంచి తనయులు చైతు,అఖిల్ వరకు అల్లాడుతున్నారు. ఒక్క చైతు పెళ్లి మ్యాటర్ తప్పించి..పోయిన ఏడాది అక్కినేని ఫ్యామిలీలోని ఏ హీరోకు కలిసి రాలేదు.

అక్కినేని ఫ్యామిలీ హీరోలు నాగార్జున, చైతూ, అఖిల్ ను దురద్రుష్ట్యం వెంటాడుతోంది. ఒక్కరికి హిట్ ఒకరికి ఫ్లాప్ అని కాకుండా ఈ హీరోలంతా ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు. దీంతో ఇటు అక్కినేని హీరోలు, అటు ఫ్యాన్స్ లో నిరాశ నిండుకుంది.

వైఎస్ కోసం పోటీ ప‌డుతున్న కింగ్ నాగార్జున

Submitted by arun on Thu, 01/04/2018 - 14:01

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి టాలీవుడ్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిగ్గా మారారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బ‌యోపిక్ ల హ‌వా కొన‌సాగుతుంది. సావిత్రి జీవిత క‌థ ఆథారంగా మ‌హాన‌టి, ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమా నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఇప్పుడు అదేబాట‌లో వైఎస్సార్ బ‌యోపిక్ రానున్న‌ట్లు టాక్. ఆనందో బ్ర‌హ్మ‌తో హిట్ కొట్టిన మ‌హీరాఘ‌వ సినిమాను డైర‌క్ట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా క‌థ‌  నాడు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు  వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి.. అంత‌ర్గ‌త పోరుతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తెచ్చారు అనే అంశంతో తెర‌కెక్క‌నుంది.

అయ్యో.. నేను ఏడవలేదు: సమంత

Submitted by arun on Thu, 12/21/2017 - 14:37

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం హ‌లో. అఖిల్‌, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం నోవాటెల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు నాగ చైత‌న్య‌, స‌మంత‌లు కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. అయితే వేడుకలో నాగార్జున.. పెద్ద కుమారుడు నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. ‘చైకు ఉన్న మంచి మనసు నాకే కాదు ఎవ్వరికీ లేదు’ అన్నారు. అది విని అభిమానులు కేకలు వేశారు. ఆ సమయంలో సమంత కళ్లు చెమర్చాయట. ఈ విషయాన్ని ఓ అభిమాని ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ నిజమైన ప్రేమంటే ఇదేనని నాగ్‌ మాట్లాడుతున్న వీడియో పోస్ట్‌ చేశాడు.

చిన్మ‌యిని బాధ‌పెట్టిన స‌మంత‌

Submitted by kasi on Thu, 09/21/2017 - 18:17

అవ‌కాశం దొరికిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ న‌టిగా త‌నేంటో ఫ్రూవ్ చేసుకుంటూనే ఉంది స‌మంత‌. తొలి చిత్రం 'ఏమాయ చేసావె' మొద‌లుకొని 'ఈగ‌', 'ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు', 'మ‌నం', 'అఆ' చిత్రాల వ‌ర‌కు త‌న ప్ర‌తిభ‌ని చూపించే ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అయ్యింది ఈ అమ్మ‌డు.

'రాజుగారి గ‌ది2' ట్రైల‌ర్ కి టైమ్ ఫిక్స‌య్యింది

Submitted by kasi on Tue, 09/19/2017 - 13:48

'మ‌నం' చిత్రంలో త‌ల్లీకొడుకులుగా న‌టించిన స‌మంత‌, అక్కినేని నాగార్జున.. ప్ర‌స్తుతం 'రాజు గారి గ‌ది2' చిత్రంలో మ‌రోసారి క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్ మెంట‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, స‌మంత ఆత్మ పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. సీర‌త్ క‌పూర్‌, వెన్నెల కిషోర్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 2015లో వ‌చ్చిన 'రాజుగారి గ‌ది'కి కూడా ఓంకార్‌నే ద‌ర్శ‌కుడు.

నాని, నాగార్జున కాంబినేష‌న్లో శ్రీరామ్ ఆదిత్య మ‌ల్టీస్టార‌ర్

Submitted by lakshman on Tue, 09/12/2017 - 16:02
టాలీవుడ్‌లో బ‌డా హీరోల‌ మ‌ల్టీస్టారర్స్ వ‌చ్చి చాలాకాల‌మే అయింది. శ‌మంత‌క‌మ‌ణిలో న‌లుగురు హీరోలు క‌లిసి న‌టించిన‌ప్ప‌టికీ చిన్న సినిమా కావ‌డంతో సినిమా హిట్ట‌యింది కానీ ఆ కాంబినేష‌న్‌కు ఆశించినంత పేరు రాలేదు. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు త‌ర్వాత ఆ స్థాయి మ‌ల్టీస్టార‌ర్ తెలుగులో...

నాగ్ త‌ర్వాత చిరుతో?

Submitted by kasi on Tue, 09/05/2017 - 11:00

ఇప్ప‌టివ‌ర‌కు అర‌డ‌జ‌ను సినిమాలు చేసినా.. ఒక్క‌టంటే ఒక్క విజ‌యం కూడా సొంతం చేసుకోలేకపోయింది ప్ర‌గ్యా జైస్వాల్‌. 'కంచె' చిత్రంతో న‌టిగా మార్కులు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. ఆ సినిమా కార‌ణంగానే ఇప్ప‌టికీ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటోంది. ఆ మ‌ధ్య నాగార్జున, కె.రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'ఓం న‌మో వెంక‌టేశాయ' చిత్రంలో ఇలాగే ఛాన్స్ కొట్టేసింది ప్ర‌గ్యా. ఆ సినిమాలో ఆమెది చిన్న వేష‌మే అయినా.. నాగ్‌తో ఓ రొమాంటిక్ సాంగ్‌లో క‌నిపించి గ్లామ‌ర్ ప్రియుల‌ను మెప్పించింది. ఆ సినిమా ఫ్లాప్ కావ‌డంతో.. ఇక ప్ర‌గ్యాకి పెద్ద సినిమాల్లో ఆఫ‌ర్లు క‌ష్ట‌మే అనుకున్నారు. అయితే అనూహ్యంగా..