nani

దేవ దాసుకి చీర్స్ కొట్టవచ్చు

Submitted by arun on Fri, 09/28/2018 - 14:25

ఆరోగ్యానికి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ లాగానే సినిమా సక్సెస్కి, తెలుగు సినిమా ఇందుస్త్రీలో మల్టీస్టారర్లు ప్రయోగాలూ ఎప్పటినుండో పనిచేస్తున్నాయి. అలా నాగ్..నాని.. కలిపి కొట్టిన కాక్టెయిల్ నేటి దేవ..దాసు. కథలో కొంచెమే కొత్తదనం వున్నా కుడా... రెండున్నర గంటలపాటు వినోదం మరియు కథని  సోడా విస్కీ లా బాగానే కలిపారు.  ఇలా హాస్యం, భావోద్వేగం, యాక్షన్ కలగలిపిన ఓ కమర్షియల్ కాక్టెయిల్ ‘దేవ’దాస్’. ప్రాణాలు తీయడంలో గోప్పలేదు...ఒక ప్రాణాన్ని కాపాడటంలోనే గొప్ప వుంది అని చూపే సినిమా.  ఇదే ఈ సినిమా ప్రధానాంశం.  ఒక్కో సీను...ఒక్కో ...పెగ్గులా సరదా సరదా వినోదం యొక్క డోస్  పెంచుతాయి.

నాని వచ్చిన వేళా విశేషం

Submitted by arun on Wed, 09/05/2018 - 15:42

నేచురల్ స్టార్ మన నాని నటనకి,

అభిమానుల ఆశీర్వాదం తనకి తాకి,

అప్పుడే ఒక దశాబ్దం అయ్యిందట,

ఇక నా.నీ టీవి కూడా అధిరింధంట. శ్రీ.కో.  

Tags

నాని దగ్గర అంత స్టఫ్ లేదు.. బిగ్ బాస్ పై బాంబ్ పేల్చిన సంజనా..!

Submitted by arun on Tue, 06/19/2018 - 12:50

తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ లో కామన్ మ్యాన్ కోటాలో హౌస్ లోకి ప్రవేశించి, తొలివారంలోనే ఎలిమినేట్ అయిన సంజన, కార్యక్రమ వ్యాఖ్యాత, హీరో నానిపై సెన్సేషనల్ కామెంట్లు చేసింది. తాను ఎన్.టి.ఆర్ ఫ్యాన్.. అయినా నాని సినిమాలను చూస్తాను.. బిగ్ బాస్ నడిపించే స్టఫ్ నాని దగ్గర లేదని అన్నది సంజనా. ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారని, తొలి సీజన్ అంత పెద్ద హిట్ కావడానికి ఎన్టీఆర్ కారణమని వ్యాఖ్యానించిన సంజన, ఆ స్థాయిలో నాని పెర్ ఫార్మెన్స్ లేదని అభిప్రాయపడింది. "ఎన్టీఆర్ ఎక్కడ? నానీ ఎక్కడ? అందుకే నేను బయటకు వచ్చినా పెద్దగా బాధపడలేదు. బిగ్ బాస్ లో మరో అవకాశం వచ్చినా వెళ్లను" అని చెప్పింది.

నాని-శ్రీరెడ్డి ఇష్యూపై విశాల్ స్పంద‌న‌!

Submitted by arun on Wed, 06/13/2018 - 15:23

సోషల్ మీడియా సాక్షింగా నేచురల్ స్టార్ నాని, నటి శ్రీరెడ్డికి పెద్ద వార్ నడుస్తుంది. తాజాగా బిగ్ బాస్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలకు నాని స్పందించి ఆమెకు లీగ‌ల్ నోటీసులు పంపించాడు.`స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుంద`ని కామెంట్ చేస్తూ శ్రీరెడ్డిక పంపిన‌ లీగ‌ల్ నోటీసును త‌న ట్విట‌ర్ ఖాతాలో నాని పోస్ట్ చేశాడు. దానికి శ్రీరెడ్డి స్పందించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణంగా ట్విట్ చేసింది.  తాజాగా ఈ వివాదంపై త‌మిళ హీరో విశాల్ స్పందించాడు.
 

ఫ్యాన్స్‌కి షాకిచ్చిన శ్రీరెడ్డి

Submitted by arun on Sat, 06/09/2018 - 16:09

తన అభిమానులకు షాకిచ్చింది నటి శ్రీరెడ్డి. తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బిగ్‌బాస్-2లో శ్రీరెడ్డి కూడా కంటిస్టెంట్‌గా ఎంపికైనట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. నాని వ్యాఖ్యాతగా జూన్ పదో తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. 16మంది సెలబ్రిటీలు 100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పి.. ఇటీవలి కాలంలో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచిన సినీ నటి శ్రీరెడ్డి కూడా ఈ షోలో పాల్గొననున్నట్టుగా వార్తలొచ్చాయి. 

బిగ్ బాస్ 2లో పార్టిసిపెంట్స్ లిస్ట్ ఇదే..!

Submitted by arun on Thu, 05/31/2018 - 12:45

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా తెలుగు టీవీ ప్రేక్షకులను రియాలిటీ షో 'బిగ్ బాస్‌' ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్, టీఆర్పీ రేటింగ్స్ రావడంతో, రెండో సీజన్ ను జూన్ 10 నుంచి ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయించారు. రెండో సీజన్ కు హీరో నాని యాంకర్ గా వ్యవహరించనుండగా, 100 రోజుల పాటు, 16 మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ లో గడపనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అన్ని హంగులతో కూడిన సెట్ ఇప్పటికే పూర్తయింది. బిగ్‌బాస్ 2 సెట్‌లో కంటెస్టంట్స్‌కు మంచి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచనున్నారని టాక్.

రివ్యూ: కృష్ణార్జున యుద్ధం

Submitted by arun on Thu, 04/12/2018 - 13:34

స‌మ‌ర్ప‌ణ‌: వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి
నిర్మాణ సంస్థ‌: షైన్ స్క్రీన్స్‌
న‌టీన‌టులు: నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ , బ్ర‌హ్మాజీ, దేవ‌ద‌ర్శిని, నాగినీడు త‌దిత‌రులు
కూర్పు: స‌త్య.జి
సంగీతం: హిప్ హాప్ త‌మిళ‌
చాయాగ్ర‌హణం: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
క‌ళ‌: సాహి సురేశ్‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మేర్ల‌పాక గాంధీ

‘కృష్ణార్జున యుద్ధం’ ట్విట్టర్ రివ్యూ: దిల్ రాజు చెప్పిందే నిజమైంది

Submitted by arun on Thu, 04/12/2018 - 10:42

న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్లతో టాలీవడ్ లో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు. నాని వరుసగా 8 హిట్స్ సొంతం చేసుకున్నాడు. నాని తాజాగా నటించిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మరియు ఎక్స్ ప్రెస్ రాజా వంటి చిట్ చిత్రాలని రూపొందించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. నాని ద్విపాత్రాభినయంలో నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ మూవీ గురువారం నాడు (ఈరోజు) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

నానిలోని ‘కృష్ణ’ వచ్చేసాడు

Submitted by arun on Sun, 01/14/2018 - 12:52

నేచురల్‌ స్టార్‌ నాని కొత్త చిత్రం కృష్ణార్జున యుద్ధం చిత్ర ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయ్యింది. భోగి పండుగ కానుకగా ఈ చిత్రంలోని కృష్ణుడు పాత్ర లుక్కును విడుదల చేశారు. లాస్ట్ ఇయర్ నేను లోకల్ - నిన్ను కోరి - ఎంసి ఎ తో హ్యాపీగా క్లోజ్ చేసిన నాని ఈ సంవత్సరం తన ఇన్నింగ్స్ కృష్ణార్జున యుద్ధంతో మొదలు పెట్టబోతున్నాడు దీని ప్రమోషన్ లో భాగంగా భోగి పండగను పురస్కరించుకుని ఇందులో కృష్ణ లుక్ ని విడుదల చేసారు. కృష్ణ - అర్జున్ గా నాని ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పాత్ర కృష్ణను రివీల్ చేసిన యూనిట్ గెటప్ లోనే పాత్ర స్వభావాన్ని చెప్పే ప్రయత్నం చేసారు.