Life Style

పిల్ల‌ల నిద్ర‌విష‌యంలో త‌ల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

Submitted by lakshman on Sun, 03/18/2018 - 23:48

చిన్న‌పిల్ల‌ల్ని బుజ్జ‌గించేందుకు త‌ల్లిదండ్రులు అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. ర‌క‌ర‌కాల మాట‌లు చెప్పి బుజ్జ‌గించినా రాను రాను అదే అల‌వాటుగా మారితే ప్ర‌మాద‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. బ‌జ్జ‌గించ‌డం బాగానే ఉన్నా అదే అంశాన్ని డాక్ట‌ర్లు న‌స అని అంటున్నారు. న‌స‌ని రెండు ర‌కాలుగా విభ‌జిస్తున్నారు.  అందులో మొదటి కారణం పెంపకంలో లోపం కాగా రెండవ కారణం పిల్లలకు నిద్ర చాలక పోవటం.

వైవాహిక జీవితంలో చిచ్చుపెడుతున్న‌ పోర్న్ వీడియోలు

Submitted by lakshman on Sat, 03/17/2018 - 09:33

పోర్న్‌ వీడియోలు చూసే వ్యక్తి క్రమంగా అందరికీ దూరమైపోయి ఒంటరితనాన్ని కోరుకుంటాడు. పోర్న్‌ చూసే కాలం, పోర్న్‌ (మామూలు సంభోగం నుండి హింసాత్మకమైనవాటి వరకు) స్థాయి పెరిగే కొద్దీ ఈ ఒంటరితనం పెరుగుతుంది. పోర్న్‌ చూసేవారు జీవిత భాగస్వామిని గాయపరిచే అవకాశం ఎక్కువ. ఆమె ఇష్టాయిష్టాలు, ఇబ్బందులు లక్ష్యపెట్టకపోవడమే కాదు. క్రమంగా ఆమెతో మానసిక సాన్నిహిత్యానికి భయపడతారు.

తొలిరేయి సంతృప్తిగా ముగించాలంటే

Submitted by lakshman on Tue, 03/13/2018 - 19:10

కొత్తగా పెళ్లయిన జంట శృంగారం విషయంలో ఎన్నో కలలు కంటారు. ముఖ్యంగా మగవారు తమ భార్యను శృంగారంలో సుఖ పెట్టాలని అనుకుంటారు. అయితే శృంగారం పట్ల కనీస అవగాహన లేనివారు లైంగికంగా ఎలా పాల్గొనాలన్న విషయంలో చాలా భయపడుతూ ఉంటారు. మరికొందరిలో ఇలాంటి వాటితో సంబంధం లేకుండా లైంగిక సామర్థ్యం లేకుండా వుంటారు. ఇలాంటివాటివల్ల శృంగారంలో పాల్గొనేటపుడు ఆ సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యను ఎవరికి చెప్పలేక వారిలో వారే సతమతమవుతూ శృంగార జీవితాన్ని తృప్తిగా అనుభవించలేకపోతుంటారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. వీటిని అధిగమించి హాయిగా గడపాలంటే...
 

ఎండ తాపాన్ని దూరం చేసే పుదీనా

Submitted by lakshman on Tue, 03/13/2018 - 18:32

ఎండ తాపాన్ని దూరం చేసి శరీరాన్ని చల్లగా ఉంచే పదార్థాల్లో పుదీనా కూడా ఉంటుంది. అందుకే దీన్ని ఈ కాలంలో ఎక్కువుగా వాడుతుంటాం. అసలు ఇది ఎలా మేలు చేస్తుందంటే... 
 
1. వేసవి కాలంలో బయట ఆహారం పడనప్పుడూ, మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అరుగుదల తగ్గుతుంది. అలాంటప్పుడు గ్లాసు నీళ్లలో కొన్ని పుదీనా ఆకులు వేసి మరిగించి తీసుకోవాలి. రుచిగా ఉండాలంటే కాస్త తేనె వేసుకుంటే చాలు. ఇలా తీసుకున్నప్పుడు పుదీనా లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు జీర్ణవ్యవస్థలో మేలు చేసే ఎంజైములను  విడుదల చేస్తాయి. ఇవి అరుగుదలకు చక్కగా ఉపయోగపడతాయి. 
 

పిల్లలకు శాపంగా మారుతున్న త‌ల్లిదండ్రులు

Submitted by lakshman on Mon, 03/12/2018 - 20:07

బాల్యం.. స్వేచ్ఛాప్రపంచం. హద్దుల్లేని ఆలోచనల స్రవంతి..ఆ రేపటి పౌరులను.. వారి ఆలోచనా ప్రవాహాన్ని సరైన మార్గంలోకి మళ్లించడమే ఇప్పుడు పెద్ద సమస్య. తీరికలేని తల్లిదండ్రులు తీరికయ్యాకా చూసేసరికి పిల్లలు పెద్దలైపోతున్నారు. పెద్ద సమస్యగా మారిపోతున్నారు. ఆడేపాడే వయసులోనే వారు మంచీచెడు నేర్చుకుంటారు. తప్పటడుగులు వేసేటప్పుడే నడక నేర్పాలి. పడిపోయినప్పుడే నిలబెట్టాలి. ఒరిగిపోతున్నప్పుడే ఆసరా ఇవ్వాలి. అన్నీ అయ్యాక అయ్యో అంటే లాభం లేదు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. కాకపోతే బిజీ జీవన విధానంలో పెద్దలు ఇవేవీ పట్టించుకోకపోవడమే పిల్లలకు శాపంగా మారుతోంది. ఆధునిక జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానం మేలు ఎంత చేస్తోందో..

సోష‌ల్ మీడియాకు ఆద‌ర‌ణ క‌రువు

Submitted by lakshman on Sat, 03/10/2018 - 21:32

సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ కు ఆద‌ర‌ణ రోజు రోజుకు త‌గ్గుతుంది. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ దిగ్గ‌జఆలైన ఫెస్ బుక్, ట్విట్ట‌ర్ కు ఆద‌ర‌ణ క‌రువైపోతోంది. ఎక్కువ శాతం యువ‌త వాటికి దూరంగానే ఉంటున్నార‌ట‌. ఈ నేపథ్యంలో సోష‌ల్ మీడియాకు చాలా మంది గుడ్ బై చెబుతున్న‌ట్లు ఓ స‌ర్వే వెల్ల‌డించింది. బోస్టన్‌ కు చెందిన మార్కెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ సంస్థ ఓరిజిన్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి మందిపై అధ్యయనం చేసింది. 

ఎండ నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే

Submitted by lakshman on Sat, 03/03/2018 - 19:35

సాధరణంగా వేసవి వచ్చిందంటే చాలు మన శరీరంలో ఉడక మొదలవుతుంది. అంతేకాక మన శరీరంలో సాధారణంగా ఉండే శక్తి కూడా తగ్గుతుంది. తక్కువ పని చేసినా ఎక్కువ శక్తి కోల్పొతాం.. తత్ఫలితంగా శక్తి హీనతా జరిగి చివరికి అలసటకి గురి అవ్వటమేకాక అసహనానికి కూడా లోను అవుతాం. ప్రయాణాల్లో సైతం ఎంతో శరీరం నిర్జలీకరమైపోతుంది. వేసవికాలంలో సూర్య కిరణాల తాకిడికి చర్మాన్ని కాలిపోయేలా చేసి చర్మంలోని తేమను పోగొడతాయి. దీనివల్ల మన శరీరంలో శక్తి అయిపోతుంది. కానీ మీరు వేసవిలో ఉడక నుంచీ బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. అవేంటో చూద్దామా..
నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లను తినాలి

మీ ధూమపానం చేస్తారా? మీ భార్య గర్భిణీ అయితే మీరు కాస్త ఆగండి

Submitted by lakshman on Sat, 03/03/2018 - 19:27

 మీ ధూమపానం చేస్తారా? మీ భార్య గర్భిణీ అయితే మీరు కాస్త ఆగండి.. ఆలోచించండి..ఎంటీ ఆగమంటున్నామనుకుంటున్నారా? మీ ధూమపానం వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలు మీ పుట్టబోయే బిడ్డపై  ఖచ్చితంగా పడతాయి. పాసెసివ్ స్మోకింగ్ (నిష్క్రియాత్మక ధూమపానం )కూడా ఆ వ్యక్తిలో పొగాకు యొక్క విషపదార్ధాలు ప్రభావం కలిగి ఉంటాయి. అదే విధంగా గర్భిణీస్త్రీలలో కూడా . గర్భిణీ స్త్రీ ఉన్న ఇంట్లో, లేదా గర్భణీ స్త్రీకి ధూమపానం పొగ సోకడం వల్ల అది, నేరుగా ఆమె కడుపులో పెరుగుతున్న పిండం మీద ప్రభావిం చూపి, పెరుగుదల మరియు నిర్మాణం మీద ప్రభావం చూపెడుతుంది.

స్మార్ట్ ఫోన్ తో సరికొత్త వ్యాధులు..మొబైల్ ను చూసేందుకు మెడను వంచారో.. మటాష్

Submitted by arun on Wed, 02/21/2018 - 15:39

సెల్ ఫోన్ వల్ల ఇన్నాళ్లూ రేడియేషన్  ప్రాబ్లమే అని అనుకున్నాం. కానీ అంతకుమించి సమస్యలను తెచ్చిపెడుతోందీ.. స్మార్ట్ ఫోన్. మన జీవనచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తూ.. బతుకంతా నేల చూపులు చూపించే ప్రమాదాన్ని మోసుకొస్తుంది. మెడను వంచుతూ మొబైల్ చూస్తే.. స్పాండిలైటిస్ వంటి దీర్ఘ కాలిక వ్యాధులను కొనితెచ్చుకోక తప్పదంటున్నారు డాక్టర్లు.

మోకాళ్ల నొప్పులు త‌గ్గించుకోవ‌డం చాలా ఈజీ

Submitted by lakshman on Wed, 02/21/2018 - 07:16

మోకాళ్ల నొప్పులు వ‌చ్చాయంటే ఎవ‌రికైనా బాగా ఇబ్బందిగానే ఉంటుంది. స‌రిగ్గా కూర్చోలేరు. నిల‌బ‌డ లేరు. న‌డ‌వలేరు. అయితే వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వచ్చే మోకాళ్ల నొప్పులు స‌హ‌జమే అయినా కొంద‌రిలో పోషకాహార లోపం, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల కూడా మోకాళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలో అలా వచ్చే మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకునేందుకు కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే చాలు. దాంతో నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!