ram gopal varma

జీఎస్టీకి వ‌ర్మ డైర‌క్ట్ చేయ‌లేదా..?

Submitted by lakshman on Sun, 02/18/2018 - 11:59


ప్ర‌పంచంలో ఏ విష‌యాన్ని అయినా అర్ధం చేసుకోవ‌చ్చు . అర్ధం కాక‌పోతే ఒక‌టికి రెండు సార్లు బైహార్ట్ చేస్తే అర్ధం అవుతుంది. కానీ డైర‌క్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ మాట్లాడే మాట‌లు అస్స‌లు అర్ధం కావు. అస‌లు విష‌యానికొస్తే నిన్న సీసీఎస్ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన వ‌ర్మ‌ను పోలీసులు 3గంట‌ల పాటు విచారించి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. 
1. జీఎస్టీని ఎందుకు తీసారు?

2. మాల్కోవాతో తీసిన  వీడియోలో ఉన్న అభ్యన్తరకర సన్నివేశాలు ఎలా తీసారు

3. ఐటీ యాక్ట్ ప్రకారం మహిళలను అస్లీళంగా చూపెట్టడం తప్పు దీనికి మీ సమాధానం

4. మీ పేస్ బుక్, ట్విటర్ లో మాల్కోవావి పెట్టిన ఫోటోలు ఎక్కడివి

విచారణకు హాజరైన రాంగోపాల్‌ వర్మ

Submitted by arun on Sat, 02/17/2018 - 12:19

దర్శకుడు రాంగోపాల్ వర్మకు సీసీఎస్ పోలీసులు ఎదుట హాజయ్యారు. మహిళాసంఘం నాయకురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదుతో వర్మకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ వేదికలో తనను కించపరిచారంటూ ఆమె సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పాటు జీఎస్టీని అడ్డుకుంటే కొడతానని బెదిరించారని  ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ 67,ఐపీసీ 508,509 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. జీఎస్టీ వ్యవహారం,మహిళాలను కించపరిచారన్నఅభియోగాలపై వర్మను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు.

‘ఈ జోకర్లు పరువు తీస్తున్నారే!’

Submitted by arun on Mon, 02/12/2018 - 10:24

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి టీడీపీ ఎంపీలను లక్ష్యం చేసుకున్నాడు. వివిధ అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసే వర్మ... పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించాడు. టీడీపీ ఎంపీల ఫొటో ఒకటి పోస్టు చేసిన వర్మ...రెండు పోస్టులు పెట్టాడు. 

వర్మకు షాకిచ్చిన సీసీఎస్ పోలీసులు

Submitted by arun on Thu, 02/08/2018 - 16:15

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రాంగోపాల్ వర్మకు సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీచేశారు. జీఎస్టీ (గాడ్ సెక్స్ అండ్ ట్రుత్)పై నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు వర్మకు నోటీసులందజేశారు. ఈ కేసులో వర్మ నేడు సీసీఎస్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా..విచారణకు హాజరుకాలేనని లాయర్ ద్వారా వర్మ పోలీసులకు తెలియజేశాడు. 

జీఎస్టీని ఎందుకు తొలగించారంటే..: వర్మ

Submitted by arun on Thu, 02/01/2018 - 15:38

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ 'గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్' అంటూ షార్ట్ ఫిల్మ్ తీసిన విషయం తెలిసిందే. అయితే, ఈ షార్ట్ ఫిల్మ్‌ను భారత్‌లో నిలిపివేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై రామ్‌ గోపాల్‌ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చారు.  ‘‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌ ఇక అందుబాటులో ఉండదు ఎందుకంటే విమియో తొలగించిందని ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఈ ఫిలిం ఓ సైట్ ద్వారా పైరసీ అవుతోందంటూ ప్రొడ్యూసర్స్ కంప్లైంట్ చేయడంతో విమియో నుంచి తొలగించాల్సి వచ్చింది. ప్రొడ్యూసర్స్ మెయిన్ సైట్ గాడ్‌సెక్స్‌ట్రూత్‌మూవీ.కమ్ ద్వారా అందుబాటులోనే ఉంది.

జీఎస్టీ వ‌ల్ల ఆర్జీవికి వ‌చ్చిన లాభ‌మెంతో తెలుసా?

Submitted by arun on Wed, 01/31/2018 - 13:50

ఎన్నో నిరసనల మధ్య రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లఘు చిత్రం 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా మియా మ‌ల్కోవా న్యూడిటీపై ఆధార‌ప‌డి తీసిన 19 నిమిషాల నిడివి గల ఈ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీంతో, నెట్లో ఇది విడుదల కాగానే, చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. లక్షల మంది ఒక్కసారిగా సైట్లోకి ఎంటర్ కావడంతో... అది క్రాష్ అయింది కూడా.

బ‌హిరంగ వాసి భ‌లే ఉందే

Submitted by arun on Fri, 01/12/2018 - 11:40

అజ్ఞాతవాసి సినిమాపై ఆర్జీవీ ఎందుకు మాట్లాడ‌లేద‌ని అంద‌రు అనుకున్నారు. కానీ ఉన్న‌ట్లుండి అజ్ఞాతవాసి గెట‌ప్ లో రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది. క‌త్తిమ‌హేష్ రివ్యూ ఎలా ఇచ్చాడు. అంటూ అనే  విశేషాల్ని నెటిజ‌న్ల‌తో పంచుకున్న ఆర్జీవీ త‌న అభిమాని  అజ్ఞాతవాసి పోస్టర్ ని షేర్ చేశాడు. మార్ఫింగ్ చేసిన ఫోటోలో ప‌వ‌న్ కు బ‌దులు ఆర్జీవీ ఫోటోను ఎడిట్ చేశాడు. అంతేకాదు ఆ ఫోటో పై  అజ్ఞాతవాసి పోస్టర్ ని బహిరంగవాసి త‌గిలించారు. అసలే డివైడ్ టాక్ తో సతమతమవుతున్న అజ్ఞాతవాసికి వర్మ చేస్తున్న పోస్టులు  కొంత వెటకారంగానే ఉన్నాయి.

మరో సంచలనానికి తెరలేపిన వర్మ..

Submitted by arun on Thu, 01/11/2018 - 17:38

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. పోర్న్‌ స్టార్‌ను డైరెక్ట్‌ చేయాలన్న తన కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు. ఓ ప్రముఖ పోర్న్‌ స్టార్‌ తో ప్రత్యేక వీడియో చిత్రీకరించాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వర్మ తెలియజేశాడు. ఇప్ప‌టికే వెబ్‌సిరీస్ పేరిట అమ్మాయిల‌ను న‌గ్నంగా చూపించిన వ‌ర్మ.. ఈ సారి ఏకంగా పోర్న్‌స్టార్‌తోనే ఓ వీడియో రూపొందించాడు. స‌న్నీలియోన్ త‌ర్వాత మ‌రో పోర్న్‌స్టార్ మియా మ‌ల్కోవా.. వ‌ర్మ ద్వారా భార‌త తెర‌పై మెర‌వ‌నుంది. `గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌` పేరిట వ‌ర్మ ఈ వీడియోను రూపొందించాడు. ఈ విష‌యాన్ని వ‌ర్మ‌, మ‌ల్కోవా..

జె.డి.చ‌క్ర‌వ‌ర్తి నిర్మాత కాద‌ట‌

Submitted by kasi on Tue, 09/26/2017 - 13:15

మ‌హాన‌టుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బ‌యోపిక్ తీస్తున్నాన‌ని.. దానికి 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' అనే పెడుతున్నాన‌ని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాకి ప్ర‌ముఖ న‌టుడు జె.డి.చ‌క్ర‌వ‌ర్తి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడని తాజాగా వార్త‌లు వినిపించాయి.

రాంగోపాల్ వర్మ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్సీ

Submitted by lakshman on Fri, 09/22/2017 - 18:08
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించడం అటు టాలీవుడ్‌తో పాటు, ఇటు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వాళ్ల గురించి తన సినిమాలో..