earthquake

శవాలదిబ్బగా మారిన ఇండోనేషియా

Submitted by arun on Mon, 10/01/2018 - 13:23

ఎటుచూసినా విధ్వంసం.. సునామీ మిగిల్చిన ఘోరం.. శవాలగుట్టలు, రోడ్లపై ప్రజల ఆకలికేకలు తీరాన్ని మింగేసిన నీళ్లు..ఇండోనేసియాలోని సులవేసి ద్వీప రాజధాని పాలూ నగరంలో కనిపిస్తున్న దృశ్యాలు. ప్రకృతి బీభత్సానికి ఇప్పటి వరకు 832 మంది చనిపోయారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మృతులను సామూహిక ఖననాలు చేస్తున్నారు.

ఇండోనేషియా అయ్యెను భయబ్రాంతం

Submitted by arun on Thu, 08/09/2018 - 15:22

ఇండోనేషియాలో మరోసారి భూకంపం,

నాలుగు రోజులకే వచ్చెను తిరిగి ప్రకంపం,

ఇండోనేషియా అంత అయ్యెను భయబ్రాంతం,

చేస్తున్నారు ఇరుక్కుపోయిన వారిని తీసే ప్రయత్నం. శ్రీ.కో

Tags

తైవాన్ లో భారీ భూకంపం...

Submitted by arun on Wed, 02/07/2018 - 11:26

తూర్పు ఆసియా దేశం తైవాన్‌లో రాత్రి 11:50 గంటల సమయంలోభారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. తైవాన్‌ తూర్పు తీరంలోని హువాలియెన్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలజికల్‌ సొసైటీ తెలిపింది. భారీ భూకంపం ధాటికి హువాలియెన్‌ పట్టణంలో పెద్ద పెద్ద భవనాలు, ఇతర నిర్మాణాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. వాటిల్లో వందలమంది చిక్కుకుపోయినట్లు సమాచారం. భారీ భూకంపం తర్వాత 100సార్లకు పైగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ప్రాణభయంతో జనం రోడ్లపై పరుగులుతీశారు. 

భారీ భూకంపం

Submitted by nanireddy on Sat, 12/16/2017 - 11:36

ఫసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా పేరొందిన ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జావా తీర ప్రాంతంలో భూమి భారీగా ప్రకంపించింది. 

రిక్చర్ స్కేల్‌ పై దాని తీవ్రత 6.5గా ఉన్నట్లు నేషనల్‌ డిజాస్టర్‌ మిటిగేషన్‌ ఏజెన్సీ వెల్లడించింది. పంగందరన్‌, తసిక్‌మలయా, కియామిస్, బంజర్‌, గౌరత్‌, కెబుమెన్‌, బన్యుమస్‌ నగరాలు భూకంపం దాటికి వణికిపోయాయి. అర్ధరాత్రి ఘటన చోటుచేసుకోవటంతో ఇళ్లలోంచి ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. 

కారణం.. కోకోస్!

Submitted by lakshman on Fri, 09/22/2017 - 17:28
  • అభికేంద్రం కూడా దాని వద్దే నమోదు
  • మెక్సికో వ్యాలీ కిందే ఉన్న కోకోస్ ప్లేట్
  • అందులో ఘర్షణల వల్లే ఇంత తీవ్రత
  • 1985లోనే జారిపోయిన పసిఫిక్ ప్లేట్
  • రింగ్ ఆఫ్ ఫైర్‌ను అంచనా వేయడం కష్టం

మెక్సికో: మెక్సికోను చిగురుటాకులా వణికించిన భూకంపానికి కారణం ఆ ఒక్క ప్లేటే కారణమా..? రెండు దశాబ్దాల క్రితం భూమి లోలోపలికి జారిపోయిన ఆ ప్లేటే ఇంత తీవ్రతకు కారణమైందా..? 1985 భూకంపానికి, తాజా భూకంపానికి లింకుందా..? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు.