bigg boss-2

బిగ్ బాస్ 2 పై కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు!

Submitted by arun on Wed, 06/13/2018 - 17:53

టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నాని ప్రధాన వ్యాఖ్యాతగా 'బిగ్‌ బాస్-2' రియాల్టీ షో గత ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ రెండో సీజన్ షోపై పలువురు పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్-1లో ఓ కంటెస్టెంట్‌గా ఉన్న కత్తి కార్తీక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్-2 రియాల్టీ షో గురించి 'ఇంకొంచెం మసాలా' అని చెప్పారని... మసాలా ఉందేమో కానీ, ఫ్లేవర్ మాత్రం మిస్ అయిందని కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్-1లో కంటెస్టెంట్ అయిన కార్తీక తన తెలంగాణ యాసలో  యాంకర్ గా జనాలను అలరించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన ఒక్క కంటెస్టెంట్ ను అయినా పెట్టి ఉంటే బాగుండేదని చెప్పింది.