Adopted Dogs

పెంపుడు కుక్కల కోసం కట్టుకున్న భర్తను..

Submitted by arun on Wed, 06/13/2018 - 16:54

ఆవిడకు కుక్కలంటే ఎంతో ప్రేమ. వాటికోసం ఏమైనా చేయడానికి ఆవిడ వెనకాడదు. ఎంతలా అంటే ఆ మూగ ప్రాణాల కోసం తన 25 ఏళ్ల దాంపత్య జీవితాన్ని వదులుకుంది. భర్తతో తగువు పడి అతని నుంచి విడిపోయింది. ఈ సంఘటన బ్రిటన్‌లోని సఫోక్‌ కౌంటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సఫోక్‌ కౌంటీకి చెందిన లిజ్‌ గ్రూ(45) మైక్‌ అస్లామ్‌(53) భార్యాభర్తలు వీరికి 21 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. లిజ్‌ గ్రూకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే అమితమైన ప్రేమ. అందుకే పెళ్లైన తర్వాత కూడా ఇంటిని మొత్తం మూగజీవాలతో నింపేసింది. ఇంటిని మొత్తం కుక్కలు ఆక్రమించేయడంతో భర్త మైక్‌కు కోపం వచ్చింది. ఈ విషయమై ఇరువురికి తరుచూ గొడవలు జరిగేవి.