critical

వాజపేయి పరిస్థితి విషమం

Submitted by arun on Wed, 06/13/2018 - 10:28

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉంది. శ్వాసకోశ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న ఆయనను సోమవారం ఎయిమ్స్‌లో చేరగా, ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేతలూ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎయిమ్స్‌కు తరలి వస్తున్నారు. వాజ్‌పేయి చికిత్సకు స్పందిస్తున్నారని.. యాంటీబయాటిక్స్‌ ఇస్తున్నామని.. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని మంగళవారం ఉదయం ఎయిమ్స్‌ మీడియా అధికారి ఆరతీ విజ్‌ బులెటిన్‌ విడుదల చేశారు.