woman-kills-husband-shamirpet

భర్తను చంపి.. ఇంటిముందే పూడ్చిన భార్య!

Submitted by nanireddy on Wed, 06/13/2018 - 09:29

కుటుంబకలహాలతో కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం కేశవరంలో జరిగింది. గ్రామానికి చెందిన  మల్లేష్‌ ,జ్యోతి దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. గత కొంత కాలంగా దంపతులమధ్య కలతలు వచ్చాయి. ఈ క్రమంలో గత నెల 3న మద్యం మత్తులో ఉన్న మల్లేష్, భార్యతో గొడవపడ్డాడు. ఆ సమయంలో వీరిమధ్య  తీవ్రమైంది. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దీంతో జ్యోతి అతడిని తోసివేయడంతో కిందపడిన మల్లేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అతను ఎంతకూ లేవకపోవడంతో భర్త మృతిచెందాడని గుర్తించి ఆందోళనకు గురైన ఆమె.. శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టింది.