pendurthi-police-chased-robbery-case

బాయ్ ఫ్రెండ్ కోసం 'ఇల్లు చక్కబెట్టిన' తల్లీకూతురు!

Submitted by nanireddy on Wed, 06/13/2018 - 08:07

బాయ్ ఫ్రెండ్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని ఓ యువతి తన కొంపకే ఎసరు తెచ్చింది. ఆపై తల్లి చేసిన నిర్వాకంతో ముగ్గురు జైలుపాలయ్యారు. వివరాల్లోకివెళితే విశాఖ జిల్లా పెందుర్తిలో ఈనెల 2 న డాక్టర్‌ కోట ఉమాకుమార్‌ శంకర్రావు ఇంట జరిగిన భారీ దొందతనం కేసును పోలీసులు చేధించారు. భారీ దోపిడీకి పాల్పడింది శంకర్రావు కూతురు ఆమె స్నేహితుడు, అలాగే భార్య అని తేల్చారు. 2వ తేదీ సాయంత్రం కుటుంబమంతా బయటకు వెళ్లారు . తాను స్థానికంగా ఉన్న బంధువుల ఇంటికి వెళతానని చెప్పిన శంకర్రావు కూతురు లిఖిత ఇంటిలోనే ఉండిపోయింది. ఈ క్రమంలో ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నస్నేహితుడిని ఇంటికి పిలుచుకుని ఇద్దరు కలిసి దోపిడీకి పాల్పడ్డారు.